ప్రశ్నల సమాధానములు నిధి.
1.జాతీయోద్యమం అంటే ఏమిటి?
భారత స్వాతంత్ర పోరాటంలో సామాన్య ప్రజానీకం నుండి సంస్థానాల రాజులు వరకు ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసినందున దీన్ని జాతీయ ఉద్యమం అంటారు.
2. ముస్లిం లీగ్ పార్టీ గురించి తెల్పుము?
ముస్లింలీగ్ పార్టీని 1906 సంవత్సరంలో స్థాపించారు. .
ఇది ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ . ఈ లీగ్ కృషివల్ల 1909వ సంవత్సరంలో ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి .
పార్టీకి 1930 వరకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లేదు. 1937లో ముస్లిం పార్టీ 102 స్థానాలను గెలుచుకుంది
1940 నుండి ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది.
1946లో రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలలో విజయభేరీ మోగించింది. 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినం నిర్ణయించింది అనేక చోట్ల మతపరమైన దాడులు చెలరేగాయి
3.క్యాబినెట్ మిషన్ లోని సభ్యులు ఎవరు?
కేబినెట్ మిషన్ లోని సభ్యులు lord penthik Lawrence, sir Stafford cripps, A.V.Alexander .
4.బ్రిటీష్ ఇండియా లో మొదటి ఎన్నికలు ఎన్ని రాష్ట్రాలలో ,ఎప్పుడు నిర్వహించారు?
బ్రిటిష్ ఇండియాలో మొదటి ఎన్నికలు 11 రాష్ట్రాలలో 1937 సంవత్సరంలో నిర్వహించారు. 11 రాష్ట్రాలకు ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
5.వ్యక్తిగత సత్యాగ్రహం అంటే ఏమిటి?
స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు మొదలైన వాటితో నిమిత్తం లేకుండా వ్యక్తులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జాతీయ నాయకులు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా జైలుకు వెళ్లార. దీనిని వ్యక్తిగత సత్యాగ్రహం అంటారు.
6.స్వాతంత్య్ర ఉద్యమం లో హిందూ మహాసభ, (R. S. S). రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ఏమిటీ?
స్వాతంత్ర ఉద్యమంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయినా ఆర్ ఎస్ ఎస్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పని చేశాయి .
కులం వర్గాలను అధిగమించి హిందువులు అందరినీ ఏకం చేసే సామాజిక జీవితంలో సంస్కరణ తీసుకురావాలని ఇవి ప్రయత్నించాయి. ఈ సంఘ కార్యకలాపాలలో అనేకమంది కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రభావితమయ్యారు
ఆర్ ఎస్ ఎస్ వల్ల ముస్లిం ప్రజల్లో కొంత అభద్రతా భావం ఏర్పడింది.
7." విభజించు పాలించు"అన్న విధానాన్ని వ్యాఖ్యానిo చండి? .
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో అనుసరించినా విధానాన్ని విభజించు పాలించు అంటారు ఈ విధానం లో (విభిన్న ప్రాంతాలుభిన్న ప్రాంతాలు, మతాలూ,మతాలు తెగల మధ్య బేధాభిప్రాయాలు నెలకొల్పడం) భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం మైనార్టీ వర్గాల మధ్య విభేదాలను సృష్టించి మతకలహాలకు కారణమయింది ఇలాంటి విధానాలను అవలంబించి భారతదేశాన్ని మరికొంత కాలం పరిపాలన చేయాలనేదే బ్రిటిష్ వారి అభిమతం
8.ముస్లిం లీగ్ పార్టీ వల్ల జరిగిన రాజకీయ పరిణామాల ఏమిటి?
R
9.ప్రత్యేక నియోజకవర్గాల విశేషం ఏంటి?
భారతదేశంలో 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు లో భాగంగా మత ప్రాతిపదికన ముస్లింలకు కొన్ని స్థానాలను ప్రత్యేకంగా రిజర్వు చేయడాన్ని ప్రత్యేక నియోజకవర్గం అంటారు.
Q.కమ్యూనల్ అవార్డ్ అనగా నేమి?
భారతీయ సమాజాన్ని కుల ప్రాతిపదికన విడదీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కమ్యూనల్ అవార్డ్ లేదా ప్రత్యేక నియోజకవర్గాలు. దీన్ని ప్రతిపాదించినది రామ్సే మెక్డొనాల్డ్
ఇందులో లో దళిత వర్గాలకు ప్రత్యేక ఏలెక్టరేట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గాంధీ అంబేద్కర్ పూనా ఒప్పందం ద్వారా దీనిని రద్దు చేయడమైనది .గాంధీజీ సంయుక్త ఏ లెక్టరేట్
ప్రతిపాదించారు.
10.క్రిప్స్ రాయబారo విశేషాలు ఏమిటి?
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ సైన్యం యొక్క ప్రజల ల యొక్క మద్దతు కోరుతూ భారత జాతీయ నాయకులతో 1942 వ సంవత్సరంలో sir Stafford cripps నాయకత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశాన్ని cripps రాయబారం ఉంటారు
ఈ సమావేశం తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని క్రిప్స్ ప్రకటించారు.
11.క్విట్ ఇండియా ఉద్యమం గురించి వ్యాఖ్యానిo చండి?
క్రిప్స్ రాయబారం విఫలం అయిన తర్వాత 1942లో ఆగస్టు లో కాంగ్రెస్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది దేశం నుండి బ్రిటిష్ వారిని వెళ్లగొట్టాలని ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఈ ఉద్యమంలో నే గాంధీజీ గారు "డూ ఆర్ డై "అనే నినాదం ఇచ్చారు .
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకం నుండి విద్యార్థులు కార్మికులు రైతులు అందరూ కూడా దేశవ్యాప్త ఆందోళన చేపట్టడం జరిగింది ఇందులో బ్రిటిష్ వారి ఫ్యాక్టరీలలో కళాశాలలో పోలీస్ స్టేషన్లు పోస్ట్ ఆఫీసులు రైల్వే స్టేషన్లు లలో సమ్మె చేయడం జరిగింది
12. జాతీయోద్యమం లో భారత జాతీయ సైన్యం పాత్ర ( I.N.A.)ను పేర్కొనుము?
ఐ .ఎన్ .ఏ . అనగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ సైన్యాన్ని కి కి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించడం జరిగింది జపాను సహాయంతో భారత్లోని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారత జాతీయ సైన్యం పోరాడాల్సింది .దీని ప్రధాన కార్యాలయం రంగూన్ ,సింగపూర్ లో స్థాపించారు. ఈ ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ "చలో ఢిల్లీ "" జైహింద్ "అని నినాదాలు ఇచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.
13. స్వాతంత్ర్యం తర్వాత బా రత దేశం లో విలీనం ఐన సంస్థానాలు ఏవి,?
భారతదేశంలో సంస్థానంలో విలీనం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.
స్వాతంత్రం తర్వాత భారతదేశం లో విలీనమైన సంస్థానాలు .
కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్.
1947 సంవత్సరం లో పాకిస్తాన్ కాశ్మీర్ పై దండెత్తినప్పుడు కాశ్మీర్ రాజు భారతదేశంలో విలీనం కావడానికి భారత దేశంలో విలీనం కావడానికి అంగీక రించారు.
హైదరాబాద్ సంస్థానాన్ని పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది .
జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశంలోకి కలవడం జరిగింది.
14."తెభాగ" ఉద్యమం అంటే ఏమిటి?
బెంగాల్ లో భూస్వాముల నుంచి భూమిని సాగు తీసుకున్న రైతులు కౌలు పరిమాణం మూడింట రెండు వంతులు పెంచాలని ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమాన్ని తెభాగ
ఉద్యమం అంటారు
15. సంస్థానాలు విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ను పేర్కొనండి?
భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినప్పుడు సుమారు 550 పైగా సంస్థానాలకు కూడా స్వాతంత్రం ప్రకటించడం జరిగింది .ఈ సంస్థానాలు భారతదేశంలో లో నైనా పాకిస్తాన్ లోనైనా లేదా స్వతంత్రంగా అయినా ఉండడానికి అవకాశం ఇచ్చారు.
స్వతంత్రం తర్వాత సంస్థానాల విలీనం ఆ బాధ్యత భారత మొదటి హోం శాఖ మాత్యులు "సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఉంచడం జరిగింది వీటిని ఆయన చాలా చాకచక్యంగా భారతదేశంలో విలీనం చేశారు. అయితే జునాగఢ్, హైదరాబాద్ ,కాశ్మీర్ సంస్థానాలు .విలీనం కాలేదు వీటిని స్వాతంత్రం తరువాత ప్రత్యేక చర్యల ద్వారా భారతదేశంలో కలిపారు జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశం లో కలవడం జరిగింది హైదరాబాద్ పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేశారు కాశ్మీర్ పై పాకిస్తాన్ దండెత్తడం తో కాశ్మీరు రాజు భారతదేశంలో విలీనానికి అంగీకరించారు
16.భా రత దేశ విభజన కు దారి తీసిన వివిధ కారణాలు తెలపండి?
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అనుసరించినా విభజించు పాలించు అనే విధానం .
భారతదేశానికి విభజనకు దారి తీసింది .
ముస్లిం మైనార్టీల లో అభద్రతా భావం .
ముస్లింలీగ్ సభ్యులు తాత్కాలిక ప్రభుత్వం లో చేరిన ప్రభుత్వ పరిపాలన సరైన సహకారం అందించకపోవడం.
ముస్లిం లీగ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ ప్రయత్నాలు విఫలం కావడం
ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినం జరపడం .మతకలహాలు మతకలహాలు .
మహమ్మద్ ఇక్బాల్ లాంటి కవులు కూడా పాకిస్తాన్ అనే భావనను సమర్థించడం.
ఈ కారణాల వల్ల భారతదేశం పాకిస్థాన్ రెండుగా విడిపోయింది
17.స్వాతంత్ర్య ఉద్యమం లో గాంధీజీ పాత్ర ఏమిటి?
గాంధీజీ భారతదేశానికి 1915 వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి రావడం జరిగింది.
1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించి సత్యం అహింసల పై ఆశ్రమాన్ని నడిపారు 1917 బీహార్ లోని చంపారన్ రైతుల సత్యాగ్రహం నిర్వహించి విజయవంతం అయ్యాడు 1919 సంవత్సరం లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ సంఘటన కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించారు .1920 -22 సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి "సత్యం అహింస "అనే సిద్ధాంతాలతో భారత దేశానికి స్వాతంత్రం తీసుకు రావడం జరిగింది
18.సుభాష్ చంద్రబోస్ లో మీకు నచ్చిన గుణాలు ఏవి? ఎందుకు?
భారత జాతీయోద్యమ నాయకుడు లో సుభాష్ చంద్ర బోస్ ముఖ్య నాయకుడు విదేశాలలో(ఐ ఎన్ ఏ అనే సైన్యాన్ని) భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై అత్యంత సాహసోపేతంగా యుద్ధాన్ని ప్రకటించారు.
ఈయన సైన్యాన్ని అజాద్ హింద్ ఫౌజ్ అంటారు. నినాదాలు "చలో ఢిల్లీ" జై హింద్"
19(.డొమినియన్) రాజ్య ప్రతిపత్తి అంటే ఏమిటి?
భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం కాకుండా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండే స్వాతంత్రాన్ని ఇవ్వడం.
20.దేశవిభజన లో మౌంట్ బాటెన్ విధానాలు పేర్కొనండి?
1947 ఫిబ్రవరి లో వావేల్ లో స్థానం లో వైస్రాయ్ గా మౌంట్ బాటెన్ వచ్చారు .అప్పటికి భారత దేశంలో లో కాంగ్రెస్ ముస్లింల మధ్య బేధాభిప్రాయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి
మౌంట్ బాటన్ మరోసారి కాంగ్రెస్ ముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేశారు .
కానీ విఫలమయ్యాయి విఫలమయ్యాయి .
.దాంతో 1947 జూన్ 3న ఒక ప్రణాళికను రూపొందించి ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని పాకిస్తాన్ ను విభజించడానికి నిర్ణయం తీసుకున్నారు
ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ముస్లింలీగ్ అంగీకరించాయి.
💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి