Translate
31, డిసెంబర్ 2020, గురువారం
29, డిసెంబర్ 2020, మంగళవారం
ప్రపంచీకరణ
💐💐ప్రపంచీకరణ💐💐
-----------------/-/-------------1విదేశీ వాణిజ్యo అనగానేమి?
ఒక దేశం మరొక దేశం తో చేసే వ్యాపార లావాదేవీలను విదేశీ వాణిజ్యం అంటారు.
2.బహుళ జాతి సంస్థలు అంటే ఏమిటి ఉదా.లివ్వండీ?
ఒక కంపెనీ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగిస్తూ చౌకగా ఉత్పత్తుల చేపట్టి నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు ఉదాహరణకు కోకో కోల , సాంసంగ్,. టాటా మోటార్స్,, ఇన్ఫోసిస్, ర్యాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్.
3.విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి?
విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు (భవనాలు యంత్రాలు భూమి ఇతర పరికరాలపై ) వ్యయాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు.
4.సరళీకృత ఆర్థిక విధానo అంటే ఏమిటి?
వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న అవరోధాలను తొలగించి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు ఈ విధానాన్ని భారతదేశం 1991 నుండి అమలు చేస్తూ వస్తుంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి ఎక్కువగా వచ్చాయి.
5.జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
బహుళజాతి కంపెనీలు ,స్థానిక కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని చేపడితే అటువంటి కంపెనీలను జాయింట్ వెంచర్లు అంటారు.
6.W.T.O . విస్తరించుము?
ప్రపంచ వాణిజ్య సంస్థ ( world trade organisation. )
7.I.M.F .
అంతర్జాతీయ ద్రవ్య నిధి.
8.ఎస్ ఈ జెడ్ అనగా నేమి?
.స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి.)
9.ప్రపంచీకరణ అనగానేమి?
విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానంవేగంగా పెరిగింది .పెరుగుతున్న ఈ దేశాల సంబంధాన్ని ఇది ప్రపంచీకరణ అంటారు.
10.ప్రపంచీకరణ పై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని వివరించండి?
ప్రపంచీకరణ వల్ల సేవలు ప్రత్యేకించి ఐటీ తో కూడిన సేవలందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
నిర్వహణ ఖర్చులు తగ్గాయి. పరిపాలనా సంబంధమైన పనులు ,ఇంజనీరింగ్ పనులు డేటా ఎంట్రీ, జమా ఖర్చులు లెక్కలు, సులభంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేయగలుగుతున్నారు.
వినియోగదారులకు కూడా నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి.
వినియోగదారులకు సాంకేతిక పరిజ్ఞానం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు అనుభవిస్తున్నారు. ఉత్పత్తిదారులు ,కార్మికులపై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం ఒకే రకంగా లేదు.
11.ప్రపంచీకరణ ప్రక్రియ లో బహుళ జాతి సంస్థల పాత్ర ఏమిటి?
బహుళజాతి కంపెనీలు నియంత్రణలో పెట్టుబడులు వాణిజ్యం ద్వారా మార్కెట్లు ఉత్పత్తి అనుసంధానం బహుళజాతి సంస్థల వల్లనే వేగవంతం అయ్యింది. బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసే ఎటువంటి వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అమ్మడం జరుగుతూ ఉంది .వివిధ దేశాల మధ్య దూరం తగ్గి అనుసంధానం పెరిగి ఆర్థిక ప్రక్రియ వేగవంతమైంది.
బహుళజాతి సంస్థల వల్లనే పెట్టుబడులు సేవలు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం మధ్య దిగువ తరగతి దేశాలకు సులభంగా అందుబాటులోకి వచ్చింది.
12భారత దేశo పై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి?
ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాల్లో ధనవంతులకు మేలు జరిగింది .
వివిధ వస్తువుల ఉత్పత్తులలో నాణ్యత పెరిగి ధరలు తగ్గాయి .
వినియోగదారులకు కు ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.
బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి .అవి వారికి లాభంగా పరిణమించాయి.
భారతదేశ అతి పెద్ద కంపెనీల మధ్య కూడా పోటీ పెరిగి సాంకేతిక పరిజ్ఞానం ,ఉత్పత్తి పద్ధతు లలో , ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తున్నారు .
బహుళజాతి సంస్థల వల్ల ప్రత్యేకించి ఐటీ రంగంలో అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి.
ప్రపంచీకరణ వల్ల కొన్ని భారతీయ కంపెనీలు కూడా బహుళజాతి సంస్థలు గా మార్పు చెందాయి.
13.బహుళ జాతి భారతీయ కంపెనీలు ఏవి ఉదా. లివ్వండి?
బహుళజాతి భారతీయ కంపెనీలు టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్ సుందరం ఫాస్ట న ర్ ,వంటి కంపెనీలు,.
14.కార్మిక చట్టాల సడలింపు కంపెనీలు కు ఏ విదంగా ఉపయోగ పడుతుంది వివరించండి?
కార్మిక చట్టాల వల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది.
కానీ కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి .కార్మికులను నియామకం చేసుకునేటప్పుడు డు కల్పించాల్సిన వసతులను పూర్తిస్థాయిలో అంద చేయరు ..
కార్మికులకు పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువ.
ఈ సంస్కరణల వల్ల కార్మికులకు నష్టదాయకం.
కంపెనీలకు లాభదాయకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ.
15.ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల పై ఒకే విదంగా ఉంటుందా?
ప్రపంచీకరణ ప్రభావం వల్ల అన్ని దేశాల మీద ఒకే విధంగా ఉండదు .సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి పేద మధ్య ఆదాయ దేశాలకు కు ఎగుమతి చేస్తారు. దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలకు లాభాలు వస్తాయి.
పేద , మధ్య ఆదాయ దేశాలు లో లో విదేశీ పెట్టుబడులు వాణిజ్యం పెరుగుతాయి. ప్రపంచమంతా సరిహద్దు లేని విస్తృత వ్యాపార కేంద్రంగా మారిపోతాయి.
వివిధ దేశాల సంబంధాలు పెరుగుతాయి.
వివిధ రకాల ఉత్పత్తుల్లో వివిధ రకాల దేశాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి .
16.విదేశీ పెట్టుబడులు, వాణిజ్యాల పై అవరోధాలు కల్పించడానికి గలాకారణాలు ఏమిటి? వీటిని ఎందుకు సరళికరించాలనుకుంటుంది?
స్వాతంత్రం తరువాత విదేశీ పెట్టుబడులు వాణిజ్య లపై అవరోధాలు కల్పించడానికి కారణం దేశీయ పరిశ్రమల అభివృద్ధి, విదేశీ పరిశ్రమల పోటీ నుండి రక్షణ కల్పించడం ప్రధాన ధ్యేయం.
అయితే కాలక్రమంలో భారతదేశంలో లో పెట్టు బడులు తగ్గిపోయి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగింది.
1991 సంవత్సరం భారతదేశం విదేశీ మారక ద్రవ్యం లోటు ఏర్పడింది.
దాంతో విదేశీ పెట్టుబడుల మీద ఆధార పడవలసి వచ్చింది.
కావున ఆర్థిక ఆంక్షలు తొలగించి ఆర్థిక వ్యవస్థను సరళీ కరించి విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడులకు అవరోధాలను తొలగించారు.
17.ప్రపంచ వాణిజ్య సంస్థ గూర్చి వివరించండి?
జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ స్థానంలో 1955 జనవరి 1న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు కాబడింది.
దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో కలదు .
ప్రస్తుతం ఈ సంస్థలో సభ్య దేశాల సంఖ్య 153.
ఈ సంస్థ యొక్క ఆశయం వివిధ దేశాల మధ్య వాణిజ్యపరమైన ఆటంకాలను తొలగించి ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం.
18. విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడుల మధ్యగల వ్యత్యాసాలు తెలపండి?
విదేశీ వాణిజ్యం:-
వివిధ దేశాల మధ్య జరిగే ఎగుమతులు ,దిగుమతులు, అమ్మకాలు ,కొనుగోళ్లను ,విదేశీ వాణిజ్యం అంటారు.
విదేశీ వ్యాపారం లో వస్తువులు సేవలు మార్పిడి చేసుకోవడం జరుగుతుంది.
విదేశీ వాణిజ్యం ని పెంచడానికి తగ్గించటానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాల ను (పన్ను))ఉపయోగించవచ్చు.
విదేశీ పెట్టుబడి. :- వివిధ దేశాలు తమ పెట్టుబడులను లాభదాయక కంపెనీలలో పెడతారు. వివిధ దేశాల మధ్య మూలధనం పెట్టుబడి బదిలీ జరుగుతుంది.
19. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడుల లో ముఖ్య ప్రవాహాలను తెలపండి?
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో మనం మూడు ముఖ్య ప్రవాహాలను గమనించవచ్చు.
.వస్తు సేవల ప్రవాహం.
. శ్రమ ప్రవాహం: ఉపాధి వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లడం.
.పెట్టుబడి ప్రవాహం స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూరప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడానికి పెట్టుబడి ప్రవాహం అంటారు
20.అరబ్ వసంతం అనగానేమి?
ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా ,తునీషియా ,ఈజిప్టు ,వంటి దేశాలలో ఉన్న నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటుచేసుకున్నాయి అటువంటి విప్లవాలను ప్రసార మాధ్యమాల్లో "అరబ్ వసంతం "గా పేర్కొన్నారు.
______________________________
"Education is the most power ful weapon which you can use to change the world ".
.🌹🌹🌺🌺🌹🌹
లేబుళ్లు:
Plz give me your valuable feed back
22, డిసెంబర్ 2020, మంగళవారం
రాంపురం -- గ్రామ ఆర్థిక వ్యవస్థ
రాంపురం:గ్రామ ఆర్థిక వ్యవస్థ .
1.ఉత్పత్తి కారకాలు పేర్కొనండి?
ఉత్పత్తి కారకాలు భూమి ,శ్రమ, మూలధనం ,వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం.
2.స్థిర పెట్టుబడి అనగానేమి?
4.నిర్వాహణ పెట్టుబడి అంటే ఏమిటి?
ఉత్పత్తి కార్యకలాపాల కోసం చేసే పెట్టుబడిని నిర్వహణ పెట్టుబడి అంటారు . వస్తువుల తయారీకి అవసరమయ్యే పెట్టుబడి .
5.బౌతిక పెట్టుబడి అంటే ఏమిటి?
ఉత్పత్తి చేయడానికి రైతులకు అవసరమయ్యే ఆర్థిక వనరులను భౌతిక పెట్టుబడి అంటారు. ఉదాహరణకు రసాయనిక మందులు, సాగునీరు, పురుగు మందుల వినియోగం, అంతటిి భౌతిక పెట్టుబడిగాా భావిస్తారు.
6.బహుళ పంటల సాగు అంటే ఏమిటి?
ఒక విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అంటారు.
7.చిన్న కారు రైతులు అంటే ఏమిటి?
రెండు హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయ పొలం ఉన్నటువంటి రైతులను చిన్నకారు రైతులు అంటారు .
8.M.G.N.R.E.G.A. ను విస్తరించుము?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
9.మిగులు ఉత్పత్తి అంటే ఏమిటి?
ఉత్పత్తి అయిన వస్తువుల నుండి వినియోగాన్ని తీసివేస్తే వచ్చేది మిగులు ఉత్పత్తి.
1౦.రాంపురం లోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలి లభిస్తుంది ఎందుకు?
రాంపురం గ్రామంలో పని చేయడానికి వ్యవసాయ కూలీల సంఖ్య ఎక్కువగా ఉంది. .కాబట్టి తక్కువ వేతనాల కే పని చేయడానికి కూలీలు సిద్ధంగా ఉంటారు.
1.సాగునీటిి సదుపాయాలను పెంచుకోవడం .2.బహుళ (అనేక) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడం.
12.ఒక హెక్టార్ అంటే ఏమిటి?
భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానంగా హెక్టార్లు ఉపయోగిస్తారు.
13.రాంపురం లో ఆధునిక వ్యవసాయ విధానాల ను పేర్కొనండి?
వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది.
2.స్థిర పెట్టుబడి అనగానేమి?
ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైనా యంత్రాలు ట్రాక్టర్లు యంత్ర పరికరాలు పై చేసే పెట్టుబడిని స్థిర పెట్టుబడి అంటారు.
3.రాంపురం లో వ్యవసాయేతర కార్యకలాపాలు ఏమిటీ?
3.రాంపురం లో వ్యవసాయేతర కార్యకలాపాలు ఏమిటీ?
వ్యవసాయం కాకుండా ఇతర కార్యకలాపాల ద్వారా ఉత్పత్తి చేపడితే వాటిని వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు .పాడి పరిశ్రమ, చిన్న తరహా వస్తువుల తయారీ ,దుకాణాల నిర్వహణ ,కోళ్ల పెంపకం ,టీ కొట్టు ల నిర్వహణ ,శీతలపానీయాల అమ్మకం ,పుస్తకాల షాపుల నిర్వహణ మొదలగునవి.
4.నిర్వాహణ పెట్టుబడి అంటే ఏమిటి?
ఉత్పత్తి కార్యకలాపాల కోసం చేసే పెట్టుబడిని నిర్వహణ పెట్టుబడి అంటారు . వస్తువుల తయారీకి అవసరమయ్యే పెట్టుబడి .
5.బౌతిక పెట్టుబడి అంటే ఏమిటి?
ఉత్పత్తి చేయడానికి రైతులకు అవసరమయ్యే ఆర్థిక వనరులను భౌతిక పెట్టుబడి అంటారు. ఉదాహరణకు రసాయనిక మందులు, సాగునీరు, పురుగు మందుల వినియోగం, అంతటిి భౌతిక పెట్టుబడిగాా భావిస్తారు.
6.బహుళ పంటల సాగు అంటే ఏమిటి?
ఒక విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అంటారు.
7.చిన్న కారు రైతులు అంటే ఏమిటి?
రెండు హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయ పొలం ఉన్నటువంటి రైతులను చిన్నకారు రైతులు అంటారు .
8.M.G.N.R.E.G.A. ను విస్తరించుము?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
9.మిగులు ఉత్పత్తి అంటే ఏమిటి?
ఉత్పత్తి అయిన వస్తువుల నుండి వినియోగాన్ని తీసివేస్తే వచ్చేది మిగులు ఉత్పత్తి.
1౦.రాంపురం లోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలి లభిస్తుంది ఎందుకు?
రాంపురం గ్రామంలో పని చేయడానికి వ్యవసాయ కూలీల సంఖ్య ఎక్కువగా ఉంది. .కాబట్టి తక్కువ వేతనాల కే పని చేయడానికి కూలీలు సిద్ధంగా ఉంటారు.
పెద్ద రైతులు ట్రాక్టర్లు యంత్ర పరికరాల సహాయంతో వ్యవసాయం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి.
కావున కూలీలకు తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు.
11. రాంపురం గ్రామంలో ఉత్పత్తి పెంచడానికి వివిధ పద్ధతులు ఏమిటీ?
11. రాంపురం గ్రామంలో ఉత్పత్తి పెంచడానికి వివిధ పద్ధతులు ఏమిటీ?
1.సాగునీటిి సదుపాయాలను పెంచుకోవడం .2.బహుళ (అనేక) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడం.
3.భూసారాన్ని పెంచడం .
4.పంట మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టడం. 5.అంతర పంటల సాగు చేయడం.
6.అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడడం. 7.ఎరువులు రసాయనిక మందులను వ్యవసాయంలో వినియోగించడం .
8.యంత్రాలు యంత్ర పరికరాల సహాయంతో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ వ్యవసాయ. దిగుబడి సాధించే పద్ధతులు వాడడం.
12.ఒక హెక్టార్ అంటే ఏమిటి?
భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానంగా హెక్టార్లు ఉపయోగిస్తారు.
ఒక హెక్టారుకు 10000 చదరపు మీటర్లు వ్యవసాయ విస్తీర్ణాన్ని కలిగి ఉంటే దాన్ని ఒక హెక్టారు అంటారు.
13.రాంపురం లో ఆధునిక వ్యవసాయ విధానాల ను పేర్కొనండి?
వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది.
సాగు నీటిి లభ్యత పెరగడం వల్ల విద్యుత్ యంత్రాల ను వినియోగించి నీటిని ఎక్కువ అ సాగు విస్తీర్ణానికి వాడుకుంటున్నారు.
బోరుబావులను వినియోగించడం జరుగుతుంది.
ట్రాక్టర్ల వ్యవసాయ యంత్ర పరికరాలు వరి కోత యంత్రాలు వినియోగం పెరిగింది .
బహుళ పంటల సాగు విధానం అమలులోకి వచ్చింది .
అధిక దిగుబడినిచ్చే వ్యవసాయ వంగడాలను (విత్తనాలు) వినియోగం, రసాయనిక ఎరువులు రసాయనిక మందులు, వినియోగం పెరిగింది.
లేబుళ్లు:
Plz give me your valuable feed back
7, డిసెంబర్ 2020, సోమవారం
ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం
ప్రశ్నలు సమాధానాలు
1.N. A. T. O. ను విస్తరించుము?
North Atlantic treaty organisation
2.S.E.A.T.O. ను విస్తరించుము?
South east Asian treaty organisation
3.C.E.N.T.O. ను విస్తరించుము?
Central treaty organisation
4. సై నిక ఒప్పందం అనగానేమి?
రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్న ఒప్పందం సైనిక ఒప్పందం అంటారు. ప్రపంచ యుద్ధాల సమయంలో అనేక దేశాలు ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి .Ex N.A.T.O. ,S.E.A.T.O..
5.P.L.O. ను విస్తరించుము?
పాలస్తీనా లిబ రేషన్ ఆర్గనైజేషన్.
6.పరోక్ష యుద్ధం అంటే ఏమిటి?
ఒక దేశం పై మరొక దేశం నేరుగా యుద్ధం చేయకుండా సాంకేతిక పద్దతుల ద్వారా ఉగ్రవాద చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను దేశాన్ని దెబ్బతీసే టువంటి చర్యలను పరోక్ష యుద్ధం అంటారు
7.ప్రచ్ఛన్న యుద్ధం అనగానేమి?
7.ప్రచ్ఛన్న యుద్ధం అనగానేమి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యమైన అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధం అంటారు.
8.అలీ న విదానం అంటే ఏమిటి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా (ప్రజాస్వా మ్య) కూటమిలో గాని రష్యా (కమ్యూనిస్టు) కూటమి గాని చేరకుండా తటస్థ విధానాన్ని అవలంబించడానికి అలీన విధానం అంటారు .అయితే వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సహకారాలను పెంపొందించుకునే ఉద్దేశ్యంతో నెహ్రూ ఈ విధానాన్ని అనుసరించారు
9.వీటో అధికారం అనగానేమి?
9.వీటో అధికారం అనగానేమి?
ఐక్యరాజ్యసమితి లోని భద్రతామండలి చేసే నిర్ణయాలను ను శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించే విధానాన్ని లేదా తిరస్కరించే విధానాన్ని వీటో అధికారం అంటారు ఈ అధికారం అమెరికా ,బ్రిటన్ ,చైనా ,ఫ్రాన్స్ ,రష్యా, దేశాలకు మాత్రమే కలదు.
10. వలస పాలన నుండి విముక్తి అంటే ఏమిటి?
10. వలస పాలన నుండి విముక్తి అంటే ఏమిటి?
ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించి పరిపాలన చేస్తూ ఉంటే అటువంటి దేశాలను ఆ పాలిత దేశాలనుంచి విముక్తి చేయడాన్ని వలస పాలన విముక్తి అంటారు .Ex. భారతదేశాన్ని బ్రిటన్ దేశం నుంచి విముక్తి చేయడం.
11.(U. N. O). ఐక్యరాజ్య సమితి లో శాశ్విత సభ్య దేశాలు ఏవి?
అమెరికా ,బ్రిటన్, చైనా ,ఫ్రాన్స్, రష్యా దేశాలకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కలదు.
12. ఐక్యరాజ్య సమితి లోగో ( పతాకం) ను వివరించండి?
ఐక్యరాజ్యసమితి పతాకం: నీలిరంగు పతాకంపై గ్లోబు, గ్లోబు కు ఇరువైపులా ఆలివ్ కొమ్మలు ఉంటాయి .
నీలిరంగు అభివృద్ధికి నిదర్శనం .
గ్లోబు ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాల ను సూచిస్తుంది .
ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం.
13.సైనిక ఒప్పందం వల్ల అగ్రరాజ్యాల కు అందుబాటులో కి వచ్చిన కీలక వనరులు ఏవి?
సైనిక ఒప్పందంం వల్ల అగ్ర రాజ్యాల ప్రభావం పెరిగి వాటికి క్రింది వనరులు అందుబాటులోకి వచ్చాయి.
13.సైనిక ఒప్పందం వల్ల అగ్రరాజ్యాల కు అందుబాటులో కి వచ్చిన కీలక వనరులు ఏవి?
సైనిక ఒప్పందంం వల్ల అగ్ర రాజ్యాల ప్రభావం పెరిగి వాటికి క్రింది వనరులు అందుబాటులోకి వచ్చాయి.
: చమురు ఖనిజాలు వంటి కీలక వనరులు. : ఉత్పత్తులకు మార్కెట్ .
:పెట్టుబడులుు పెట్టడానికి ప్రమాదకరం లేని ప్రదేశాలు .
తమ సైనికులను ఆయుధాలను ఉపయోగించడానికి సైనిక స్థావరాలు .
తమ భావజాల వ్యాప్తి .పెద్ద మొత్తంలో ని ఖర్చుకి ఆర్థిక మద్దతు.
14.ఆయుధ, అంతరిక్ష పోటీ వల్ల జరిగిన పరిణామాలు ఏమిటీ?
1. ఆయుధాలు పైన ఖండాంతర క్షిపణుల విధ్వంసకర ఆయుధాలు పైన ప్రపంచ దేశాలు ఖర్చును పెంచాయి.
2. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ భయం వాతావరణం ఏర్పడింది.
3. వివిధ దేశాల మధ్య గూడ చర్యలు చోటుచేసుకున్నాయి.
4.వివిధ దేశాల మధ్య సైనిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం ,సైద్ధాంతిక విభేదాలు పెరిగాయి.
15.బాoడుoగ్ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
ఆసియా ఆఫ్రికా ఖండాలలో ని 29 దేశాల ప్రతినిధులు 1955 ఏప్రిల్ 18 నుండి 24 వరకు ఇండోనేషియాలోని బాండుంగ్ లో సమావేశం అయ్యారు.
బాండుంగ్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు.
ఆసియా ఆఫ్రికా లో ఆర్థిక అభివృద్ధి పెంపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తించడం .
శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించడం.
ఆఫ్రికా ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవడం .
వలసపాలకుల వైఖరిని ఖండిస్తూ ప్రాథమిక హక్కులు ప్రజలకు అందేలా చూడడం.
16.అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి?
అలీనోద్యమ మొదటి సమావేశం 1961 సెప్టెంబర్ లో యుగోస్లేవియా లోని బెల్గ్రేడ్ లో జరిగింది 2012నాటికి సభ్య దేశాల సంఖ్య 120 కి పెరిగింది .
దీని ముఖ్య ఉద్దేశాలు
అలీనోద్యమ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్రాన్ని సంపాదించాయి.
పెరుగుతున్న ప్రపంచ యుద్ధ తీవ్రతలు మిగిలిన ప్రపంచం పై దాని ప్రభావం పడకుండా చూడడం.
వలస పాలన నుండి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలో చేరకుండా చూడడం.
17.మధ్య ప్రాచ్యం అనగానేమి?
17.మధ్య ప్రాచ్యం అనగానేమి?
ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమాసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు.
18.పశ్చి మ ఆసియా సంక్షోభo అనగానేమి?
18.పశ్చి మ ఆసియా సంక్షోభo అనగానేమి?
పశ్చిమాసియాలో అరబ్బులకు యూదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలను పశ్చిమాసియా సంక్షోభం అంటారు.
19.జియోనిస్ట్ ఉద్యమం అనగానేమి?
19.జియోనిస్ట్ ఉద్యమం అనగానేమి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి ఇ తమ మాతృభూమి అయినా పాలస్తీనాను తిరిగి పొందే ఉద్దేశంతో చేసిన ఉద్యమాన్ని జియోనిస్ట్ ఉద్యమం అంటారు.
20.మూడవ ప్రపంచ దేశాలు అని అలీన దేశాలను ఎందుకంటారు?
అప్పుడే స్వాతంత్రం పొందిన దేశాలను మూడో ప్రపంచ దేశాలు అంటారు.
ఈ దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవి .
ఈ దేశాలలో పేదరికం ,అనారోగ్యం ,అసమానత్వం ,వలసవాదం వంటివి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావం తో కూడిన పరిస్థితులు నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి.
ఈ దేశాల యొక్క సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అలీన ఉద్యమం సరైనది అని భావించడం వల్ల ఇందులో చేరాయి. కాబట్టి ఈ దేశాలను అలీనోద్యమ దేశాలు అంటారు.
21.వాగ్దత్త భూమి అనగా?.
యూదులు పాలస్తీనా భూభాగాన్ని వాగ్దత్తభూమి అంటారు.
22.ఆరబ్బులు,యూదులు మధ్య ఘర్షణలకు కారణాలు ఏంటి?
అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది .
అక్కడ ఉన్న జెరూసలేం, యూదులు, క్రైస్తవులు ,ముస్లింలకు పవిత్ర స్థలం.
యూదులను నిర్వాసితులు చేయడంతో వారు యూరప్ ,ఆసియా అంతటా వలస వెళ్లారు.
ఏసుక్రీస్తు సిలువ వేయడానికి యూదులను బాధ్యులను చేసి వారిని వేధింపులకు గురి చేశారు .
జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో లక్షలాది మంది యూదులను చంపటం దీనికి పరాకాష్ట.
యూదుల తమ దేశాన్ని ని తిరిగి పొందాలని జియోనిస్ట్ ఉద్యమం చేపట్టారు.
అదే సమయంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనడంతో అమెరికా, యు. ఎస్ .ఎస్ .ఆర్ . లు తమ ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాయి.
1947 లో లో ఐక్యరాజ్యసమితి ఇ పాలస్తీనాను రెండు భాగాలుగా చేసి అరబ్బులకు ,మరొకటి యూదులకు కేటాయించింది.
అయితే ఇప్పటికి కూడా అరబ్బులకు యూదులకు సరైనటువంటి పరిష్కారం లభించక పోవడం వల్ల ఆ ప్రాంతం నిత్యం ఘర్షణ తో సతమతమవుతూ ఉంది.
23.పంచశీ ల ఒప్పందం ను వివరించండి?
1. ఒక దేశ సర్వసత్తాక తను భౌగోళిక తను మరొకరు గౌరవించడం.
2 ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం .
3.దాడులకు దిగడం వివాదాలను అవగాహనతో పరిష్కారం చేసుకోవడం..
4.అంతర్జాతీయ సంబంధాలు సహకారం కోసం కృషి చేయడం.
5. శాంతియుత సహజీవనానికి ప్రోత్సహించడం.
24.గోర్బచేవ్ పరిపాలన విధానాలు తెల్పుము?
రష్యాలో గోర్బచేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలు చేయడానికి రాజకీయ సంస్కరణలు చేయడానికి ప్రయత్నించాడు .
ఈయన ఉదార వాద సిద్ధాంతాలు కలవాడు.
పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపర్చడానికి ప్రయత్నం చేశాడు.
గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
25 గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, అంటే ఏమిటి?
గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా అంటారు.
26.ఏక ధ్రువ ప్రపంచం అంటే ఏమిటి?
26.ఏక ధ్రువ ప్రపంచం అంటే ఏమిటి?
1991లో యు.ఎస్.ఎస్.ఆర్. పతనం కావడంతో తో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ప్రారంభమైంది . అమెరికా ఆర్థిక శక్తిగా తయారైంది .అది ఏకధృవ ప్రపంచం గా మారింది.
27.ద్విద్రువ ప్రపంచం అంటే ఏమిటి?
27.ద్విద్రువ ప్రపంచం అంటే ఏమిటి?
వలస దేశాలు స్వాతంత్రం పొందిన తరువాత తర్వాత అమెరికా రష్యాలు రెండు ప్రపంచ ఆర్థిక శక్తులుగా పరిణమించాయి. ఈ రెండు దేశాల ప్రపంచ ప్రాబల్యాన్ని ద్వి ధ్రువ ప్రపంచం అంటారు.
28.U. S. S. R. పతనానికి గల కారణాలు వ్రాయండి?
28.U. S. S. R. పతనానికి గల కారణాలు వ్రాయండి?
29.మెక్ మోహన్ రేఖ అనగానేమి?
భారతదేశం చైనా దేశాల మధ్య సరిహద్దురేఖ మెక్ మోహన్ రేఖ అంటారు.
30.భారత దేశం, చైనా, సంబంధాలను వ్యాఖ్యానిo చుము?
30.భారత దేశం, చైనా, సంబంధాలను వ్యాఖ్యానిo చుము?
1949లో చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యం అయింది చైనా కమ్యూనిస్టు పార్టీ ని గుర్తించిన తొలి దేశాలలో భారత దేశం ఒకటి
భారతదేశం చైనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య స్థానానికి మద్దతు తెలిపింది.
భారతదేశం చైనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య స్థానానికి మద్దతు తెలిపింది.
1954 april 29 న పంచశీల ఒప్పందం పై రెండు దేశాలు నాయకులు సంతకం చేశారు.
టిబెట్ భారతదేశాల సరిహద్దు అయిన మెక్ మోహన్ రేఖను చైనా అంగీకరించలేదు.
ఆక్సాయ్చిన్ ప్రాంతం లో సరిహద్దు వివాదం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది .
పంచశీల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ
1962 లో భారతదేశంపై చైనా దండెత్తింది.
మూడో ప్రపంచ దేశాల్లో తన ఆధిపత్యానికి భారత్ అవరోధంగా ఉందని భావించింది.
రెండు దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగా గా కొనసాగిన కొన్నిసార్లు ఘర్షణలకు కూడా కారణమవుతూ ఉన్నాయి
31.పాకిస్థాన్,భారత్ దేశం సంబంధాలను వివరించండి?
మత ప్రాతిపదికపై భారత దేశం రెండు రాజ్యాలు గా విడిపోయిన తర్వాత చెలరేగిన సంఘటనలు ప్రభావం ఇరుదేశాల సంబంధాలను శాసిస్తుంది .
కాశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య వివాదాలకు కారణమవుతోంది .
1966లో భారత్ పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం కుదిరింది .ఈ ఒప్పందాలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉంది .
1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో భారత జోక్యం చేసుకోవడంతో ఈ రెండు దేశాలు మరో సారి యుద్ధం చేసుకున్నాయి.
1999లో కార్గిల్ సమస్య భారత్-పాక్ల మధ్య యుద్ధానికి కారణం అయింది .
అదే సమయంలో సంస్కృతి, నాగరికత ,వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, సౌహార్దం పర్యటనలు, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
32. బంగ్లాదేశ్, భారత దేశం సంబంధాలు ను వివరించండి?
32. బంగ్లాదేశ్, భారత దేశం సంబంధాలు ను వివరించండి?
బంగ్లాదేశ్ భారతదేశం రెండూ కూడా సరిహద్దు దేశాలు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది .
బ్రహ్మపుత్ర నది గంగా నది జలాల పంపకంలో రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి.
అయినప్పటికీ రెండు దేశాలు ఆర్థిక రంగంలో సాంకేతికంగా సాంస్కృతికంగా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాయి.
33.శ్రీలంక భారత దేశం మధ్య సంబంధాలు ను వివరించండి?
భారతదేశం శ్రీలంక 2 ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక 1948లో స్వాతంత్రం పొందింది శ్రీలంక భారత్ దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయ తమిళం మాట్లాడే అల్పసంఖ్యాకుల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన విధానం భారతదేశం శ్రీలంక సంబంధాల పట్ల ఘర్షణలకు కారణం అయింది .
ప్రస్తుతం రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి
34. L.T.T.E ?
34. L.T.T.E ?
Libration of Tamil Tigers Eelam
35.సిమ్లా ఒప్పందం గురించి వ్యాఖ్యానించండి?
35.సిమ్లా ఒప్పందం గురించి వ్యాఖ్యానించండి?
1945లో అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ వా వేల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులను ప్రేమించే ఈ విషయమై చర్చించడానికి సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దీనినే సిమ్లా ఒప్పందం అంటారు .కార్యనిర్వాహక మండలి లో పదవులన్నీ భారతీయులతో భర్తీ చేయడం .
హిందువులకు ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం ఇస్తామని ప్రకటించడం.
ముస్లిం లీగ్ సభ్యులను ముస్లింలకు మాత్రమే నామినేట్ చేస్తుందని మహమ్మద్ అలీ జిన్నా పట్టుపట్టడంతో విఫలమయ్యాయి.
36."ముక్తి బాహిని" అనగా
ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు చేసిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని mukti bahini అంటారు
💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐
లేబుళ్లు:
Plz give me your valuable feed back
3, డిసెంబర్ 2020, గురువారం
రాజకీయ ధోరణలు ఆవిర్భావం1977-2000.
ప్రశ్న సమాధానములు.
💐 ×××××××××💐1.సరళీ కృత ఆర్ధిక విధానం అంటే ఏమిటి?
1991వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం ఈ విధానం భారతదేశంలో ప్రవేశపెట్టింది .దీని ప్రకారం విదేశీ పెట్టుబడిదారులను పరిశ్రమలను భారతదేశంలోకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే ఆర్థిక విధానాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు.
2.సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి?
2.సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి?
భారతదేశ ము లో జరిగే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు వివిధ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అటువంటి ప్రభుత్వాలను సంకీర్ణ ప్రభుత్వం అంటారు.ex UPA, NDA.
3.మతతత్వ వాదం అనగానేమి?
3.మతతత్వ వాదం అనగానేమి?
భారతదేశం వివిధ రకాల మతాలకు పుట్టినిల్లు. ఇటువంటి భారతదేశంలో తమ మతం గొప్పదని ఇతర మతాలు తక్కువని, ఛాందస భావాలు, మూఢనమ్మకాలు కలిగి ఉండడమే మతతత్వం అంటారు . ఇది దేశ ప్రజల మధ్య కలహాలను సృష్టిస్తుంది .ఇది ఇది దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుంది.
4.జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి?
దేశం మొత్తం మీద శాంతిని కాపాడే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించ దానికి శాంతి భద్రతలు నెలకొల్పడానికి, దేశ సమగ్రతను పరిరక్షించడానికి ,కేంద్ర ప్రభుత్వం చేసిన అత్యవసర చట్టాన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు.
5.ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానేమి?
5.ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానేమి?
సిక్కుల పవిత్ర్ర స్థలమైన న స్వర్ణ దేవాలయం ను ఉగ్రవాదులు ఆక్రమించు కోగా వారిని అక్కడ నుంచి ఖాళీ చేయడానికి భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్్ అంటారు .
6.అల్ప సంఖ్యాకులు అంటే ఏమిటి?
దేశ జనాభాలో ఏ మతానికి చెందిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారో వారిని అల్పసంఖ్యాకులు అని అంటారు Ex ముస్లింలు ,క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు.
7.అధిక సంఖ్యాకులు అనగానేమి?
7.అధిక సంఖ్యాకులు అనగానేమి?
దేశ జనాభాలో ఏ మతం వారి సంఖ్య అధికంగా ఉంటుందో వారిని అధిక సంఖ్యాకులు అంటారు ఉదా. హిందువులు
8. అత్యావసర పరిస్థితి లో జరిగిన పరిణామాలు ఏమిటి?
8. అత్యావసర పరిస్థితి లో జరిగిన పరిణామాలు ఏమిటి?
ప్రాథమిక హక్కులను నిలిపివేయడం.
పౌర హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయడం.
ఎన్నికల వివాదాలు న్యాయ స్థానాలకు జోక్యం లేకుండా చేయటం.
రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం.
న్యాయవ్యవస్థను పార్లమెంటుకు లోబడి ఉండేలా చూడడం .
ఇలాంటి పరిణామాలు జరిగాయి.
9. 1970 లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తెల్పుము?
1. భారతీయ లోక్ దళ్. (B.L.D ) .
కాంగ్రెస్ (ఓ ).
సి పి ఐ (ఎం) భారతీయ కమ్యూనిస్టు పార్టీ (marxists).
డిఎంకె - ద్రవిడ మున్నేట్ర కజగం .
జన సంఘం.
శిరోమణి అకాలీదళ్ S.A.D.
ఇలాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి
10.పార్టీ ఫిరాయింపులు అనగానేమి?
ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికై తర్వాత కొద్దికాలానికి వేరొక పార్టీలో చేరడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు.
11.రాష్ట్ర పతి పాలన అనగానేమి?
11.రాష్ట్ర పతి పాలన అనగానేమి?
రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా పాలించే లేకపోతే గవర్నర్ రాష్ట్రపతికి శాసనసభను రద్దు చేయమని సిఫార్సు చేయవచ్చు అప్పుడు ప్రధానమంత్రి సలహా తో రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి పాలనా బాధ్యతను గవర్నరు చేపట్టామని కోరవచ్చు దీనిని రాష్ట్రపతి పాలన అంటారు.
12.తెలుగుదేశం పార్టీ స్థాపనకు దారితీసిన కారణాలు ఏవి?
12.తెలుగుదేశం పార్టీ స్థాపనకు దారితీసిన కారణాలు ఏవి?
తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించడం.
తరచుగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండటం .
అవినీతి అక్రమాలు పెరిగిపోవడం సరైన పాలనా వ్యవస్థ లేక అభివృద్ధిలో వెనక వెనుకబాటుతనం ఈ కారణాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది
13(.N. T. R. ) తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు ఏవి?
తెలుగుదేశం పార్టీని 1982 సంవత్సరంలో లో (ఎన్టీఆర్) నంద మూరి తారక రామారావు గారు తన 60వ పుట్టినరోజు సందర్భంగా స్థాపించాడు .
1.పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం.
2.ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం.
3. మద్యపాన నిషేధం .
4.మహిళలకు ఆస్తి హక్కు. ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు
14.అస్సాం ఉద్యమం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
అస్సాంలో ఉద్యమం స్వయంప్రతిపత్తి కోసం ప్రారంభమైంది.
అస్సాంలో అస్సామీ భాష కాకుండా కాకుండా బెంగాల్ భాష ఎక్కువగా మాట్లాడటం. అస్సామీ పౌరులను రెండవ తరగతి పౌరులుగా చూడడం .
బంగ్లాదేశ్ నుండి వలసలు అస్సాంలో కి అధికంగా జరగడం.
టీ తోటల మీద ఆధిపత్యం స్థానికులకు కాకుండా బెంగాలీలకు ఉండడం.
చమురును రాష్ట్రం నుండి తరలించి వేరే చోట శుద్ధి చేయడం.
ఉపాధిలో లో స్థానిక లకు అవకాశాలు కాకుండా బయటి వారికి ప్రాధాన్యతనివ్వడం.
సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా ఆర్థిక కోణాలు కూడా ఉద్యమానికి చాలా ప్రాముఖ్యత వహించాయి.
15.అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ఏవి?
అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ప్రధానంగా బోడో లు, khaseelu, కర్బీ లు మిజోలు,.
16. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించటానికి మూడు ముఖ్య కారణా లు ఏవి?
16. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించటానికి మూడు ముఖ్య కారణా లు ఏవి?
పంజాబ్లో స్వయం ప్రతిపత్తి కోసం
ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించడానికి 3 అంశాలు కారణమయ్యాయి .
1 చైనా బర్మా బంగ్లాదేశ్ లతో సున్నిత సరిహద్దు ప్రాంతంగా ఉండటం.
2. తిరుగుబాటు బృందాలు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవడం .
3 అల్పసంఖ్యాక వర్గాల పై తిరుగుబాటు బృందాలు పెద్ద ఎత్తున హింసాత్మక దాడులకు పాల్పడడం .
ఈ కారణాల వల్ల సైనిక దళాలు ప్రవేశించడంతో పౌర హక్కులు స్వేచ్ఛ రద్దయ్యాయి.
17.పంజాబ్ ఆందోళన కు గల కారణాలు వ్యాఖ్యానిoచండి?
పంజాబ్లో స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం రూపుదిద్దుకుంది .
అత్యధిక శాతం మాట్లాడే భాష మతం ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది .సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కోరడం .
రాజధాని చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా కాక పంజాబ్కు రాజధానిగా ప్రకటించాలని కోరడం.
బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి అధిక శాతం నీళ్లు పంజాబ్ రాష్ట్రానికి కావాలని కోరడం.
తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న బింద్రే నవాలా వేర్పాటు వాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం కలుస్తాను కావాలని కోర సాగాడు.
స్వర్ణ స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య పై కారణాల వల్ల పంజాబ్ లో లో ఉద్యమం తీవ్రరూపంం దాల్చింది.
18. అస్సాం ,పంజాబ్ ఉద్యమా ల పోలిక, తేడా లను వ్రాయండి?
అస్సాం పంజాబ్లోని ఉద్యమాల రెండూ కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే ప్రారంభమయ్యాయి.
తర్వాత కాలంలో హింసాత్మక మార్గాన్ని ఎన్ను కు న్నాయి .
రెండు కూడా స్థానిక మైనార్టీల పై కక్ష సాధింపు చర్యలు కు కు పూనుకున్నాయి.
పంజాబ్లో ఉద్యమం ఒక మతపరమైన అంశం .
అస్సాంలో భాష సంస్కృతి ఆర్థిక సాంస్కృతిక అంశాలు ఉద్యమానికి దోహదం చేశాయి.
రెండు రాష్ట్రాలలో లో ఉద్యమాలు శాంతి భద్రతల సమస్యను సృష్టించాయి.
జాతి సమగ్రతకు సార్వభౌమత్వానికి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా పరిణమించాయి.
19.ఆంద్రప్రదేశ్ అస్సాం ఉద్యమాల మధ్య పోలిక ,తేడాలను వివరించండి?
19.ఆంద్రప్రదేశ్ అస్సాం ఉద్యమాల మధ్య పోలిక ,తేడాలను వివరించండి?
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి
.
అస్సాంలో ఉద్యమం సామాజిక ఉద్యమం ఇక్కడ భాష సంస్కృతి నిరుద్యోగం ఉపాధి వలసల యొక్క సమస్య ప్రధానమైనది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సమస్య పరిష్కారం కాబడినది .
కానీ అస్సాంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి అస్సాం లోని ప్రాంతీయ తమ పోరాటం నిర్విరామంగా కొనసాగించారు
20.టెలికాం విప్లవము వల్ల జరిగిన మార్పులు ఏమిటి?
20.టెలికాం విప్లవము వల్ల జరిగిన మార్పులు ఏమిటి?
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో అనేక సానుకూల ప్రతికూల మార్పులు కూడా తెచ్చింది .
అనుకూల ఫలితాలు.
1. సమయం ఆదా అవుతుంది .
2.వేగంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.
3.ఇంటర్నెట్ ద్వారా సర్వీసులు వేగంగా చేసుకునే అవకాశం లభించింది .4.సౌకర్యవంతమైన జీవితం వీలవుతుంది.
వ్యతిరేక ఫలితాలు.
ఇంటర్నెట్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లాంటి సౌకర్యాలకు ప్రజలు బానిసలై పోయి అధిక సమయాన్ని అందులో వే చ్చేస్తున్నారు .
అధిక సమయం కంప్యూటర్ ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. మానవ సంబంధాలు దారి తప్పుతున్న నాయి..
21. సంకీర్ణ ప్రభుత్వా ల( U.P A.,N .D .A. జనతాదళ్) శకం లో జరిగిన పరిణామాలు వివరించండి?
21. సంకీర్ణ ప్రభుత్వా ల( U.P A.,N .D .A. జనతాదళ్) శకం లో జరిగిన పరిణామాలు వివరించండి?
సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థలో పార్టీలన్నీ కలిసి రాజకీయ సిద్ధాంతాలు కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు వచ్చింది .
రాజకీయాలు విధానాలలో కేంద్రప్రభుత్వం సున్నితత్వం తో వ్యవహరించవలసి వచ్చింది.
సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమాలు సమన్వయ సంఘాలు అంటే పలు విధానాల ద్వారా భాగస్వాముల మధ్య మరింత అవగాహన సాధించగలి గాయి.
22.బెంగాల్ లో వామపక్ష విధానాలు ను వ్యాఖ్యానిo చండి?
22.బెంగాల్ లో వామపక్ష విధానాలు ను వ్యాఖ్యానిo చండి?
బెంగాల్లో్లో్లో వామపక్ష ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టింది .
కౌలుదార్లు సమస్యలను పరిష్కరించింది .పరిపాలనా సంబంధ ఆలస్యం తొలగించింది .భూస్వామ్య్య వర్గాల పెత్తనం లేకుండా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసింది.
కౌలుదారు లను భూస్వాములు బలవంతంగా తొలగించడానికి వీలు లేకుండా చేసింది.
గ్రామీణ పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది.
23.ఆపరేషన్ బ ర్గా అంటే ఏమిటి?
బెంగాల్ లో జూన్ 1978 సంవత్సరంలో ప్రభుత్వం కౌలుదార్లు పేర్లను నమోదు చేసి వాళ్ల హక్కులను కాపాడడానికి ఆపరేషన్ బర్గా చేపట్టింది .
కౌలుదారు లను బెంగాల్ లో బర్గా దారులు అంటారు వీరు భూస్వాముల భూముల సాగుచేస్తూ అధిక మొత్తంలో భూ స్వాములకు వాటాగా చెల్లిస్తూ ఉంటే వారు ఈ సమస్య పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్
బర్గా.
బర్గా.
24.73,74 వ రాజ్యాంగ సవరణ లను వ్యాఖ్యానిo చండి?
1992 వ సంవత్సరంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇస్తూ రాజ్యాంగ సవరణ చేసింది .
73 వ రాజ్యాంగ సవరణలు గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించగా 74వ రాజ్యాంగ సవరణలు పట్టణ నగరాలకు వాటి స్థాయి లో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు . అందులో1/3 స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
షెడ్యూలు కులాలు షెడ్యూలు జాతులకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
25.ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రధాని p. v. నరసింహారావు చర్యలు పేర్కొనండి?
25.ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రధాని p. v. నరసింహారావు చర్యలు పేర్కొనండి?
1992వ సంవత్సరం పీవీ నరసింహారావు నేతృత్వంలో సరళి కృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడం .
రైతులకు ఇచ్చే సబ్సిడీ కోత విధించడం .
ప్రజా సేవ ఆరోగ్యం వంటి అంశాల్లో ఖర్చులు తగ్గించుకోవడం .
విదేశీ దిగుమతుల మీద పరిమితులను పనులను తగ్గించు కోవడం .
విదేశీ పెట్టుబడులకు పరిమితులను తగ్గించు కోవడం .
ఆర్థిక రంగంలో బ్యాంకింగ్ ,బీమా ,విమానయానం, వంటివాటిలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
లేబుళ్లు:
Plz give me your valuable feed back
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)