ప్రశ్న సమాధానములు.
💐 ×××××××××💐1.సరళీ కృత ఆర్ధిక విధానం అంటే ఏమిటి?
1991వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం ఈ విధానం భారతదేశంలో ప్రవేశపెట్టింది .దీని ప్రకారం విదేశీ పెట్టుబడిదారులను పరిశ్రమలను భారతదేశంలోకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే ఆర్థిక విధానాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు.
2.సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి?
2.సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి?
భారతదేశ ము లో జరిగే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు వివిధ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అటువంటి ప్రభుత్వాలను సంకీర్ణ ప్రభుత్వం అంటారు.ex UPA, NDA.
3.మతతత్వ వాదం అనగానేమి?
3.మతతత్వ వాదం అనగానేమి?
భారతదేశం వివిధ రకాల మతాలకు పుట్టినిల్లు. ఇటువంటి భారతదేశంలో తమ మతం గొప్పదని ఇతర మతాలు తక్కువని, ఛాందస భావాలు, మూఢనమ్మకాలు కలిగి ఉండడమే మతతత్వం అంటారు . ఇది దేశ ప్రజల మధ్య కలహాలను సృష్టిస్తుంది .ఇది ఇది దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుంది.
4.జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి?
దేశం మొత్తం మీద శాంతిని కాపాడే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించ దానికి శాంతి భద్రతలు నెలకొల్పడానికి, దేశ సమగ్రతను పరిరక్షించడానికి ,కేంద్ర ప్రభుత్వం చేసిన అత్యవసర చట్టాన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు.
5.ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానేమి?
5.ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానేమి?
సిక్కుల పవిత్ర్ర స్థలమైన న స్వర్ణ దేవాలయం ను ఉగ్రవాదులు ఆక్రమించు కోగా వారిని అక్కడ నుంచి ఖాళీ చేయడానికి భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్్ అంటారు .
6.అల్ప సంఖ్యాకులు అంటే ఏమిటి?
దేశ జనాభాలో ఏ మతానికి చెందిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారో వారిని అల్పసంఖ్యాకులు అని అంటారు Ex ముస్లింలు ,క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు.
7.అధిక సంఖ్యాకులు అనగానేమి?
7.అధిక సంఖ్యాకులు అనగానేమి?
దేశ జనాభాలో ఏ మతం వారి సంఖ్య అధికంగా ఉంటుందో వారిని అధిక సంఖ్యాకులు అంటారు ఉదా. హిందువులు
8. అత్యావసర పరిస్థితి లో జరిగిన పరిణామాలు ఏమిటి?
8. అత్యావసర పరిస్థితి లో జరిగిన పరిణామాలు ఏమిటి?
ప్రాథమిక హక్కులను నిలిపివేయడం.
పౌర హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయడం.
ఎన్నికల వివాదాలు న్యాయ స్థానాలకు జోక్యం లేకుండా చేయటం.
రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం.
న్యాయవ్యవస్థను పార్లమెంటుకు లోబడి ఉండేలా చూడడం .
ఇలాంటి పరిణామాలు జరిగాయి.
9. 1970 లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తెల్పుము?
1. భారతీయ లోక్ దళ్. (B.L.D ) .
కాంగ్రెస్ (ఓ ).
సి పి ఐ (ఎం) భారతీయ కమ్యూనిస్టు పార్టీ (marxists).
డిఎంకె - ద్రవిడ మున్నేట్ర కజగం .
జన సంఘం.
శిరోమణి అకాలీదళ్ S.A.D.
ఇలాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి
10.పార్టీ ఫిరాయింపులు అనగానేమి?
ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికై తర్వాత కొద్దికాలానికి వేరొక పార్టీలో చేరడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు.
11.రాష్ట్ర పతి పాలన అనగానేమి?
11.రాష్ట్ర పతి పాలన అనగానేమి?
రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా పాలించే లేకపోతే గవర్నర్ రాష్ట్రపతికి శాసనసభను రద్దు చేయమని సిఫార్సు చేయవచ్చు అప్పుడు ప్రధానమంత్రి సలహా తో రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి పాలనా బాధ్యతను గవర్నరు చేపట్టామని కోరవచ్చు దీనిని రాష్ట్రపతి పాలన అంటారు.
12.తెలుగుదేశం పార్టీ స్థాపనకు దారితీసిన కారణాలు ఏవి?
12.తెలుగుదేశం పార్టీ స్థాపనకు దారితీసిన కారణాలు ఏవి?
తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించడం.
తరచుగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండటం .
అవినీతి అక్రమాలు పెరిగిపోవడం సరైన పాలనా వ్యవస్థ లేక అభివృద్ధిలో వెనక వెనుకబాటుతనం ఈ కారణాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది
13(.N. T. R. ) తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు ఏవి?
తెలుగుదేశం పార్టీని 1982 సంవత్సరంలో లో (ఎన్టీఆర్) నంద మూరి తారక రామారావు గారు తన 60వ పుట్టినరోజు సందర్భంగా స్థాపించాడు .
1.పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం.
2.ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం.
3. మద్యపాన నిషేధం .
4.మహిళలకు ఆస్తి హక్కు. ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు
14.అస్సాం ఉద్యమం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
అస్సాంలో ఉద్యమం స్వయంప్రతిపత్తి కోసం ప్రారంభమైంది.
అస్సాంలో అస్సామీ భాష కాకుండా కాకుండా బెంగాల్ భాష ఎక్కువగా మాట్లాడటం. అస్సామీ పౌరులను రెండవ తరగతి పౌరులుగా చూడడం .
బంగ్లాదేశ్ నుండి వలసలు అస్సాంలో కి అధికంగా జరగడం.
టీ తోటల మీద ఆధిపత్యం స్థానికులకు కాకుండా బెంగాలీలకు ఉండడం.
చమురును రాష్ట్రం నుండి తరలించి వేరే చోట శుద్ధి చేయడం.
ఉపాధిలో లో స్థానిక లకు అవకాశాలు కాకుండా బయటి వారికి ప్రాధాన్యతనివ్వడం.
సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా ఆర్థిక కోణాలు కూడా ఉద్యమానికి చాలా ప్రాముఖ్యత వహించాయి.
15.అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ఏవి?
అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ప్రధానంగా బోడో లు, khaseelu, కర్బీ లు మిజోలు,.
16. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించటానికి మూడు ముఖ్య కారణా లు ఏవి?
16. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించటానికి మూడు ముఖ్య కారణా లు ఏవి?
పంజాబ్లో స్వయం ప్రతిపత్తి కోసం
ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించడానికి 3 అంశాలు కారణమయ్యాయి .
1 చైనా బర్మా బంగ్లాదేశ్ లతో సున్నిత సరిహద్దు ప్రాంతంగా ఉండటం.
2. తిరుగుబాటు బృందాలు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవడం .
3 అల్పసంఖ్యాక వర్గాల పై తిరుగుబాటు బృందాలు పెద్ద ఎత్తున హింసాత్మక దాడులకు పాల్పడడం .
ఈ కారణాల వల్ల సైనిక దళాలు ప్రవేశించడంతో పౌర హక్కులు స్వేచ్ఛ రద్దయ్యాయి.
17.పంజాబ్ ఆందోళన కు గల కారణాలు వ్యాఖ్యానిoచండి?
పంజాబ్లో స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం రూపుదిద్దుకుంది .
అత్యధిక శాతం మాట్లాడే భాష మతం ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది .సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కోరడం .
రాజధాని చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా కాక పంజాబ్కు రాజధానిగా ప్రకటించాలని కోరడం.
బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి అధిక శాతం నీళ్లు పంజాబ్ రాష్ట్రానికి కావాలని కోరడం.
తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న బింద్రే నవాలా వేర్పాటు వాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం కలుస్తాను కావాలని కోర సాగాడు.
స్వర్ణ స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య పై కారణాల వల్ల పంజాబ్ లో లో ఉద్యమం తీవ్రరూపంం దాల్చింది.
18. అస్సాం ,పంజాబ్ ఉద్యమా ల పోలిక, తేడా లను వ్రాయండి?
అస్సాం పంజాబ్లోని ఉద్యమాల రెండూ కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే ప్రారంభమయ్యాయి.
తర్వాత కాలంలో హింసాత్మక మార్గాన్ని ఎన్ను కు న్నాయి .
రెండు కూడా స్థానిక మైనార్టీల పై కక్ష సాధింపు చర్యలు కు కు పూనుకున్నాయి.
పంజాబ్లో ఉద్యమం ఒక మతపరమైన అంశం .
అస్సాంలో భాష సంస్కృతి ఆర్థిక సాంస్కృతిక అంశాలు ఉద్యమానికి దోహదం చేశాయి.
రెండు రాష్ట్రాలలో లో ఉద్యమాలు శాంతి భద్రతల సమస్యను సృష్టించాయి.
జాతి సమగ్రతకు సార్వభౌమత్వానికి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా పరిణమించాయి.
19.ఆంద్రప్రదేశ్ అస్సాం ఉద్యమాల మధ్య పోలిక ,తేడాలను వివరించండి?
19.ఆంద్రప్రదేశ్ అస్సాం ఉద్యమాల మధ్య పోలిక ,తేడాలను వివరించండి?
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి
.
అస్సాంలో ఉద్యమం సామాజిక ఉద్యమం ఇక్కడ భాష సంస్కృతి నిరుద్యోగం ఉపాధి వలసల యొక్క సమస్య ప్రధానమైనది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సమస్య పరిష్కారం కాబడినది .
కానీ అస్సాంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి అస్సాం లోని ప్రాంతీయ తమ పోరాటం నిర్విరామంగా కొనసాగించారు
20.టెలికాం విప్లవము వల్ల జరిగిన మార్పులు ఏమిటి?
20.టెలికాం విప్లవము వల్ల జరిగిన మార్పులు ఏమిటి?
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో అనేక సానుకూల ప్రతికూల మార్పులు కూడా తెచ్చింది .
అనుకూల ఫలితాలు.
1. సమయం ఆదా అవుతుంది .
2.వేగంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.
3.ఇంటర్నెట్ ద్వారా సర్వీసులు వేగంగా చేసుకునే అవకాశం లభించింది .4.సౌకర్యవంతమైన జీవితం వీలవుతుంది.
వ్యతిరేక ఫలితాలు.
ఇంటర్నెట్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లాంటి సౌకర్యాలకు ప్రజలు బానిసలై పోయి అధిక సమయాన్ని అందులో వే చ్చేస్తున్నారు .
అధిక సమయం కంప్యూటర్ ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. మానవ సంబంధాలు దారి తప్పుతున్న నాయి..
21. సంకీర్ణ ప్రభుత్వా ల( U.P A.,N .D .A. జనతాదళ్) శకం లో జరిగిన పరిణామాలు వివరించండి?
21. సంకీర్ణ ప్రభుత్వా ల( U.P A.,N .D .A. జనతాదళ్) శకం లో జరిగిన పరిణామాలు వివరించండి?
సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థలో పార్టీలన్నీ కలిసి రాజకీయ సిద్ధాంతాలు కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు వచ్చింది .
రాజకీయాలు విధానాలలో కేంద్రప్రభుత్వం సున్నితత్వం తో వ్యవహరించవలసి వచ్చింది.
సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమాలు సమన్వయ సంఘాలు అంటే పలు విధానాల ద్వారా భాగస్వాముల మధ్య మరింత అవగాహన సాధించగలి గాయి.
22.బెంగాల్ లో వామపక్ష విధానాలు ను వ్యాఖ్యానిo చండి?
22.బెంగాల్ లో వామపక్ష విధానాలు ను వ్యాఖ్యానిo చండి?
బెంగాల్లో్లో్లో వామపక్ష ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టింది .
కౌలుదార్లు సమస్యలను పరిష్కరించింది .పరిపాలనా సంబంధ ఆలస్యం తొలగించింది .భూస్వామ్య్య వర్గాల పెత్తనం లేకుండా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసింది.
కౌలుదారు లను భూస్వాములు బలవంతంగా తొలగించడానికి వీలు లేకుండా చేసింది.
గ్రామీణ పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది.
23.ఆపరేషన్ బ ర్గా అంటే ఏమిటి?
బెంగాల్ లో జూన్ 1978 సంవత్సరంలో ప్రభుత్వం కౌలుదార్లు పేర్లను నమోదు చేసి వాళ్ల హక్కులను కాపాడడానికి ఆపరేషన్ బర్గా చేపట్టింది .
కౌలుదారు లను బెంగాల్ లో బర్గా దారులు అంటారు వీరు భూస్వాముల భూముల సాగుచేస్తూ అధిక మొత్తంలో భూ స్వాములకు వాటాగా చెల్లిస్తూ ఉంటే వారు ఈ సమస్య పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్
బర్గా.
బర్గా.
24.73,74 వ రాజ్యాంగ సవరణ లను వ్యాఖ్యానిo చండి?
1992 వ సంవత్సరంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇస్తూ రాజ్యాంగ సవరణ చేసింది .
73 వ రాజ్యాంగ సవరణలు గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించగా 74వ రాజ్యాంగ సవరణలు పట్టణ నగరాలకు వాటి స్థాయి లో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు . అందులో1/3 స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
షెడ్యూలు కులాలు షెడ్యూలు జాతులకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
25.ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రధాని p. v. నరసింహారావు చర్యలు పేర్కొనండి?
25.ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రధాని p. v. నరసింహారావు చర్యలు పేర్కొనండి?
1992వ సంవత్సరం పీవీ నరసింహారావు నేతృత్వంలో సరళి కృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడం .
రైతులకు ఇచ్చే సబ్సిడీ కోత విధించడం .
ప్రజా సేవ ఆరోగ్యం వంటి అంశాల్లో ఖర్చులు తగ్గించుకోవడం .
విదేశీ దిగుమతుల మీద పరిమితులను పనులను తగ్గించు కోవడం .
విదేశీ పెట్టుబడులకు పరిమితులను తగ్గించు కోవడం .
ఆర్థిక రంగంలో బ్యాంకింగ్ ,బీమా ,విమానయానం, వంటివాటిలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి