Translate

26, నవంబర్ 2020, గురువారం

భారత ఎన్నికల సంఘం

  1. *భారత ఎన్నికల సంఘం.*

_________-----___________.


*  భారత ఎన్నికల సంఘము ఎప్పుడు        ఏర్పడింది?


#  1950 జనవరి 25 న ఏర్పడింది.


*  మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ స0"        జరిగాయి.?


#  1952 సంవత్సరం.


*   బ్రిటీషు వారి కాలం లో ఎంత శాతం         మందికి ఓటు హక్కు ఉండేది.

#   14% జనాభా కు మాత్రమే.


*   తొలి ఓటరు దినోత్సవం ఏ రోజు               ప్రకటించారు?


#    2011 జనవరి 25 ను తొలి ఓటరు            దినోత్సవం గా ప్రకటన.


*   మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు         ఎంతమంది?


#    17.32 కోట్లు.


*      ఎన్నికల సిబ్బంది నియామకాలు              తెలిపే ఆర్టికల్?


#324(6).


*ఎన్నికల సంఘము ను ఎప్పుడు త్రి సభ్య

సంస్థ గా ఏర్పాటు చేశారు?


#1993 సంవత్సరం.


*T.N   శేషన్ పదవీకాలం?


#1990-1996 సం"".


 *   ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించారు?   ఏ.సంవత్సరం లో?


#18సం"". ( 1988.)


* ఎలెక్టరేట్ అనగానేమి?(Electorate).


# ఓటర్లు సముదాయం.


*అధికార పార్టీ అనగానేమి?


#ఎన్నికల్లో మెజార్టీ సాదించిన రాజకీయ పార్టీని  అదికార పార్టీ అంటారు.

    

*ప్రతిపక్ష పార్టీ అనగానేమి?


#అధికారంలోకి రావడానికి  ప్రయత్నం చేసి, కొన్ని  స్థానాల్లో గెలిచిన రాజకీయ పార్టీ ని ప్రతిపక్ష పార్టీ అంటారు.


 *జాతీయ పార్టీఅనగానేమి?


 #సాదారణ ఎన్నికల్లో కనీసం4 రాష్ట్రంలలో పోలైన ఓట్లలో 6%  లేదా4 వేర్వేరు రాష్ట లలో నుండి 11లోకసభ సీట్లు సాధించిన పార్టీ  ని జాతీయ పార్టీ అంటారు.


*ప్రాంతీయ పార్టీ అనగానేమి?


#రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో  పోలైన ఓట్లు లో3% లేదా3 శాసనసభ స్థానాలు పొందితే ప్రాంతీయ పార్టీ గా గుర్తింపు ఇస్తారు.


*సార్వజనీన ఓటు హక్కు అనగానేమి?


#18సంవత్సరం లు నిండిన పౌరులు కుల,మత,జాతి, లింగ,భాషా బేధాలు లేకుండా పొందే రాజకీయ హక్కు   .  


   * ఏ కేసు లోసుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల లో NOTA ను ప్రవేశ పెట్టారు?


#2013  పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీ స్  కేసు.


*'నోటా'( NOTA) ఏ స్వేచ్ఛ హక్కు లో భాగమని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?


#భావ ప్రకటన స్వేచ్ఛ.


 *నోటా NOTA   ను ఏ రాష్ట్ర శాసనసభ ఎన్నికల లో ప్రవేశ పెట్టారు?


#ఢిల్లీ,మిజోరాం, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్.


 *ఎన్నికల సిబ్బందికి ఇచ్చే ఓటు హక్కు


#పోస్టల్ బాలట్


*పోలింగ్ స్టేషన్ కు ఎన్ని మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదు? 


#100 మీటర్ లు.


 *V.V.P.A.T   ను ప్రవేశపెట్టమని ఏ కేసు లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? 


#2013 డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కేసు.


*ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు ను 18 సం" తగ్గించారు?


#1988 సం"" 61 వ రాజ్యాంగ సవరణ


*ఎన్నికల కమిషన్ విధులు రాజ్యాంగం లో ఏ భాగం లో ఉన్నాయి?


#15వ భాగంలో. 


*ఎన్నికల కమిషన్ విధులు తెలిపే  ఆర్టికల్స్ ఏవి?


#ఆర్టికల్స్ 324 నుండి 329 వరకు.


 1.ఎన్నికల కమిషన్ ముఖ్య విధులు ఏవి?


^పాలనా సంబంధ విధులు.

^సలహా విదులు.

^పాక్షిక నాయ సంబంధించిన విధులు


*.NOTA  అనగానేమి?


#None of the above.

తిరస్కరించే ఓటు హక్కు.


* E.V.M.     అనగానేమి?

 #Electronic voting machine

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్


    * రిటర్నింగ్ అది కారి అనగా ?


#నియోజకవర్గ పరిధిలో ఎన్నికల అదికారి.


* ప్రిసైడింగ్ అధికారి అనగా


  #  పోలింగ్ కేంద్రాలో విదులు నిర్వహించే అదికారి.


* .V.V.P.A.T అనగా?


# ఓటరు వెరిపైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్.


                   💐ప్రశ్నలు💐 

---------/.

.1. భారత ఎన్నికల సంఘం విధులను తెలపండి 

:-  రాజ్యాంగంలోని 15 వ భాగం  లో ఆర్టికల్ 324 నుండి  329 వరకు ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం, అధికార విధులను, తెలిపారు .

1 పాలనా సంబంధ విధులు .

2 సలహా విధులు ..

3 పాక్షిక న్యాయ సంబంధ విధులు. 




2.భారత దేశంలో ఎన్నికల విధానాన్ని  వ్యాఖ్యానిo చుము?

ఎన్నికల కమిషన్ ఎన్నికల విధానాలలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది 

1. లోక్ సభ రాష్ట్ర శాసన సభలకు ఎన్నికల తేదీలను ప్రకటించడం .

అధికారులను నియమించడం.: రిటర్నింగ్ అధికారులను ప్రిసైడింగ్ అధికారులను పోలింగ్ అధికారులను నియమించడం.

 నామినేషన్ పత్రాల స్వీకరణ: ఎన్నికలకు తగిన అర్హతలు గల అభ్యర్థుల యొక్క నామినేషన్ పత్రాలను స్వీకరించడం

 అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం : నామినేషన్ పత్రాల స్క్రూటినీ తర్వాత క అభ్యర్థుల యొక్క తుది జాబితాను ప్రకటించడం

ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేయడం (బ్యాలెట్ బాక్సులు):   పార్టీ అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తును కేటాయిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేయడం ,/o(r)బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయడం నిర్వహించడం .

ఫలితాల ప్రకటన:- పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల  ఓ లెక్కింపు గెలుపొందిన అభ్యర్థి ని ఎన్నిక అయినట్లు ప్రకటించడం




3.ఎన్నికల సంఘం సంస్కరణలు ఆవశ్యకత ను వివరించుము?

1 ప్రపంచంలో లో అత్యధిక జనాభా ఉన్న దే దేశాలలో భారతదేశానిది రెండవ స్థానం .

ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం చాలా మహత్తరమైన నా కార్యక్రమం.

 సుపరిపాలన అందిస్తామని మెరుగైన నా ఆర్థిక సాంఘిక సమానత్వం సాధిస్తామని పేదరిక నిర్మూలనకు కృషి ప్రతి పార్టీ ప్రజలకు వాగ్దానం చేస్తుంది  .

కానీ అవినీతిపరులైన రాజకీయ నాయకులు నేర చరితులు ఓట్ల కోసం కులమతాలను వాడి ధనబలంతో  ఓటర్లను   ప్రలోభ పెట్టి ఓట్లు కుంటున్నారు .

ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరం . కావున మన ఎన్నికల లో ఎటువంటి ప్రలోభాలకు ,అవినీతికి, కి   దన బలానికి ,దౌర్జన్యానికి బెదిరింపులకు ,అవకాశం లేకుండా ఎన్నికలు  స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సంస్కరణలు చాలా అవసరం.


4.ఎన్నికల ప్రవర్తనా నియమాలను వ్రాయండి?

 ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనగా ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకూ పార్టీలు అభ్యర్థులు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల నియమావళి అంటారు.

1.అభ్యర్థులు జాతి ,కులం, మతం, ప్రాంతీయ పరమైన  విద్వేషాలు రెచ్చగొట్ట కూడదు .

.2.వ్యక్తిగత దూషణలు చేయరాదు .

3.మసీదులు ,చర్చిలో, దేవాలయాలలో, ప్రార్థనా స్థలాలు, పాఠశాల ,ఎన్నికల ప్రచారం చేయకూడదు .

4.ఓటర్లకు లంచాలు ఇవ్వడం,   ప్రలోభ పెట్టడం ,బెదిరించడం ,వంటివి చేయరాదు .

5.పోలింగ్ స్టేషన్ కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు .

6.అనుమతి లేకుండా ఇళ్ళ పై జెండా ఎగరవేయడం ,బ్యానర్లు కట్టడం , నినాదాలు రాయడం పోస్టర్లు అతికించడం చేయరాదు.



5.ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి గురించి  వివరించoడి?

 భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది .

  ఇది ఒక ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ .

తన అధికారంతో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంటుంది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (6 )ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల, అనుమతితో కేంద్ర రాష్ట్ర సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం విధులకు తీసుకోవడం జరుగుతుంది.

 ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు .

ఎన్నికల సంఘం దేశంలోని ఓటర్ల జాబితాను తయారుచేసి లోక్ సభ, రాజ్యసభ ,రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి మరియు ఉప రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం ,ఎన్నికల సంఘం యొక్క ముఖ్య కర్తవ్యం .

ఈ సంస్థ నిర్వహించే  కార్యక్రమాలలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలులేదు.


6.ఓటుహక్కు  ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ఎలా చెప్పగలవు?

1. ప్రజాస్వామ్యంలో  లో  ఓటు హక్కు ద్వారా తమకు కావలసిన అటువంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది అలాంటి సమయంలో ప్రజలు నిస్వార్ధంగా సేవచేసే రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది .

2 ఓటు హక్కు సామాన్య ప్రజలకు వజ్రాయుధం లాంటిది .

3.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మన పాలకులను మనమే నియమించుకోవడానికి అవకాశం ఇస్తుంది 

.4.మనం ఓటు వేయకపోతే   చెడు పరిపాలనకు దారితీయవచ్చు మనం వేసిన ఓటు పాలకుల నిర్ణయిస్తుంది కాబట్టి ఓటు హక్కు కీలకం.

7 ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించబడును? 

   1. ఒక నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధి తన పదవికి రాజీనామా చేసినప్పుడు గాని మరణించినప్పుడు గాని ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయుటకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.

కామెంట్‌లు లేవు: