Q.అవ్యవస్థీకృత రంగం కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడానికి నీవు చేసే సూచనలు ఏవి ?
1.అసంఘటిత రంగ కార్మికులకు తగిన జీతాలు అందేటట్లు చేయడం.
2. కార్మిక చట్టాల కనుగుణంగా సెలవులు లబ్ధి పొందేలా చూడడం .
3ఉపాధి పొందే చోటు అన్ని రకాల ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం 4.కార్మికులకు బీమా ఆరోగ్య రక్షణ వంటి చర్యలు చేపట్టడం .
5.ఉద్యోగుల వేతనాలు సకాలంలో అందేటట్టు చూడడం .6.యజమాని యొక్క దయ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేలా చూడటం.
7. సెలవులను పొందినప్పుడు వేతనాలు మినహాయించు కుండా వేతనాలు అందే ఏర్పాట్లు చేయడం.
8. పెన్షన్ భీమా రిటైర్మెంట్ సదుపాయాలు పొందేలా చూడడం.
Q.భారత దేశంలో చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
1 .అనిశ్చిత వర్షపాతం.
2 మార్కెట్ సౌకర్యాలు తగినంత లేకపోవడం 3.పెట్టుబడి కొరత
4.నిరక్షరాస్యులైన టువంటి రైతులు.
5. చిన్న భూ కమతాలు .
6.విస్తాపన వ్యవసాయం
7. తగినంత పరిజ్ఞానం లేకపోవడం .
8.ఎరువులు రసాయనిక మందులు ఎలా వినియోగించుకోవాలో తెలియక పోవడం.
9మధ్య దళారీలు వ్యవస్థ .
ఈ కారణాల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు
Q. ఉపాధి అవకాశాలను కల్పించడానికి తీసుకోవలసిన చర్యలను తెలపండి?
A. వ్యవసాయ రంగ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం.
B. సాంకేతిక వృత్తి విద్యలను అందుబాటులో ఉండేలా ప్రోత్సహించడం .
C.మౌలిక సదుపాయాలను రోడ్లు రవాణా బ్యాంకులు భీమా వంటి సదుపాయాలను కల్పించడం .
D.ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వృద్ధి చెందేలా చూడటం.
E.టెక్నాలజీ పార్కులను ప్రోత్సహించడం .
F.విదేశీ సాంకేతికపరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకోవడం.
G. స్వదేశీ సాంకేతిక పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వడం.
H. కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహించడం I. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తీర్చిదిద్దడం వంటి చర్యల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చు .
Q.ఉపాధి బదిలీ అనగా నేమి ?
ఒక రంగంలో లో పనిచేసే వ్యక్తులు తగినంత వేతనాలు పొందలేక నైపుణ్యాన్ని పెంపొందించుకుని వేరొక రంగానికి మారడాన్ని ఉపాధి బదిలీ అంటారు.
Q.సేవా రంగం లోని అంశాలు ఏవి ?
సేవా రంగం లోని అంశాలు రవాణా ప్రసార సాధనాలు ద్రవ్య సంస్థలు బ్యాంకింగ్ భీమ విద్య వైద్యం పరిపాలన ప్రసార సాధనాలు పోస్ట్ ఆఫీస్ టెలికమ్యూనికేషన్స కంప్యూటర్లు ఇంటర్నెట్ మొదలగునవి.
Q.వ్యవస్థీకృత రంగం అనగానేమి?
ఒక అనిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి ఉపాధి కల్పిస్తున్న టువంటి రంగాలను వ్యవస్థీకృత రంగం అంటారు .దీనిలో జీతాలు ,ఆదాయం ,ఉద్యోగ భద్రత, సెలవులు ,వైద్యం , వంటివి నిర్ణీత విధానంలో అందుతాయి.
Q.అవ్యవస్థీకృత రంగం అనగానేమి?
ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి ఉపాధి కల్పన అందించని రంగాలను అవ్యవస్థీకృత రంగం అంటారు ఇందులో చేతి పనులు, చేనేత ,బీడీల తయారీ అగర వత్తులు తయారీ ఇవి అవ్యవస్థీకృత రంగానికి చెందిన అంశాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి