ప్రశ్నల సమాధానం నిధి.
1.రాజ్యాంగ సభ అంటే ఏమిటి?
భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన కోసం స్వాతంత్రానికి ముందు ఏర్పాటు చేసినటువంటి సభ్యుల సమూహాన్ని రాజ్యాంగ సభ అంటారు.
1946లో రాజ్యాంగ సభ సభ్యులు ను రాష్ట్ర శాసన సభలు పరోక్షంగా ఎన్నుకున్నా యి
2.రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి?
భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, ,లక్షణాలను మూల తత్వాలు లను, వివరించే ముందు భాగమే రాజ్యాంగ ప్రవేశిక .దీనిని నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాలకు అనుగుణంగా రూపకల్పన చేశారు.
3.ఏక పౌర సత్వం అంటే ఏమిటి?
ఒక దేశానికి చెందిన నివాస పరమైన చట్టబద్ధమైన హక్కు ను ఏక పౌరసత్వం అంటారు.
భారతదేశంలో ఒకే పౌరసత్వం అమలులో ఉంది.
4.సమాఖ్య వాదం అనగానేమి?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చేసుకుని ఎవరి పరిధిలో వారు చట్టబద్ధంగా పరిపాలన చేసుకోవడాన్ని సమాఖ్య విధానం అంటారు .
5.పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏమిటి?
లోక్ సభ , రాజ్య సభ ,మరియు రాష్ట్రపతి కలిసి పార్లమెంట్ ఏర్పడుతుంది.
పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు దేశానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు రాష్ట్రపతి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడం.
6.అధ్యక్ష తరహా విధానం అనగానేమి?
దేశానికంతటికీ పరిపాలన బాధ్యత వహించే విధానాన్ని అధ్యక్ష తరహా విధానం అంటారు .
.ఇందులో అధ్యక్షుడు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి గా వ్యవహరించి పరిపాలన బాధ్యత అంతా తన చేతిలో ఉంచుకుంటాడు .
7.భారత రాజ్యాంగం లో అధికారాలు ఎన్ని
జాబితా లు గా విభజించారు?అవి ఏవి?
భారత రాజ్యాంగంలో అధికారాలను మూడు రకాలుగా మూడు జాబితాలు గా విభజించారు అవి .
1కేంద్ర జాబితా
2. రాష్ట్ర జాబితా .
3ఉమ్మడి జాబితా
8.ముసాయిదా రాజ్యాంగ o లో అధికరణాలు ,షెడ్యూళ్లు ఎన్ని?
ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణ లు 8 షెడ్యూళ్ళు కలవు భారత దేశం ముసాయిదా రాజ్యాంగం అతి పెద్దది.
9.ప్రస్తుత రాజ్యాంగ o లో అధికరణా లు షెడ్యూళ్లు ఎన్ని?
ప్రస్తుతం బారత రాజ్యాంగంలో 448అధికరణలు .
12 షెడ్యూళ్ళు
25 భాగాలు కలవు.
10.అఖిల భారత సర్వీసులు అంటే ఏమిటి?
భారతదేశానికి అంతటికీ పరిపాలనా పరమైన సర్వీసులను అందించే అధికారులను అఖిల భారత సర్వీసులు అంటారు ఉదాహరణ ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్.(I.A.S. I.P.S.)
11. రాజ్యాంగ o లోని మౌలిక సూత్రాలు వివరించండి?.
భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలు 1.పార్లమెంటరీ వ్యవస్థ
2.సమాఖ్య వ్యవస్థ .
3.సర్వసత్తాక దేశం.
4. ఒకే న్యాయ వ్యవస్థ .
5.లిఖిత పూర్వక రాజ్యాంగం.
6. అఖిల భారత సర్వీసులు .
7.సంక్షేమ రాజ్యం మొదలగునవి
12.భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలు పేర్కొనండి?
13.రాజ్యాంగ ప్రవేశిక లో కొత్తగా చేర్చిన పదాలు ఏవి?
భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన అటువంటి పదాలు "సామ్యవాద"" లౌకిక "అనే పదాలను చేర్చడం జరిగింది.
14 రిజర్వేషన్లు అంటే ఏమిటి?
సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గానికి ముఖ్యంగా షెడ్యూలు కులాలు ,షెడ్యూల్ తెగలకు ,ఆర్థిక ,సామాజిక ,రాజకీయ య న్యాయాన్ని ,సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని చర్యలు చేపట్టారు వాటిని రిజర్వేషన్లు అంటారు.
15.పార్లమెంటరి , అధ్యక్ష తరహా విధానం మధ్య వ్యత్యాసాలు తెల్పుము?
పార్లమెంటరీ విధానం:-
పార్లమెంటరీ విధానంలో అధ్యక్షుడు నామమాత్రం.
ప్రధానమంత్రి యదార్థ పాలకుడు .
కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ లో అంతర్భాగం మంత్రులు అందరూ దీనిలో సభ్యత్వం కలిగి ఉంటారు
పార్లమెంటరీ విధానంలో అధ్యక్షుడు మంత్రి మండలి సలహాలకు కట్టుబడి ఉండాలి .పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి మంత్రులకు అధిపతి గా వ్యవహరిస్తాడు.
అధ్యక్ష తరహా విధానం:-
అధ్యక్ష తరహా విధానం లో అధ్యక్షుడే సర్వాధికారి అన్ని నిర్ణయాలు అధ్యక్షుడే తీసుకుంటాడు.
కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ లో అంతర్భాగం కాదు.
అధ్యక్షులకు వివిధ సలహాదారులు సలహాలు అందిస్తారు .
శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖల మధ్య అధికార పంపిణీ ఉంటుంది.
16."సమానత్వం" భావన ను తెల్పే కరపత్రం తయారు చేయండి?
పాఠశాల సమాజపు ప్రతి రూపం.
వివిధ సమూహాల నుండి పిల్లలు పాఠశాలకు రావడం జరుగుతూ ఉంటుంది .
పాఠశాలలో లో పిల్లలకు పేద ధనిక అనే భావనలు రాకుండా అందరికీ ఒకే రకమైన యూనిఫామ్స్ ఉంటాయి.
అలాగే అందరూ కలిసి మెలిసి మధ్యాహ్న భోజన సమయంలో ఆహారాన్ని తీసుకుంటారు.
చదువుకునే సమయంలో ఆటల సమయంలో అందరూ కలిసి మెలిసి ఆడుకోవడం సమానత్వ భావనను పెంపొందిస్తుంది.
17.ఉమ్మడి జాబితా లోని రెండు అంశాలు ఉదా లివ్వండీ?
వివాహాలు . విడాకులు పౌర విచారణ స్మృతి శిక్షాస్మృతి ,విద్య మొదలగునవి.
18.మానవతా విశ్వసూత్రం ఆధారంగా ఏ దేశ రాజ్యాంగం రూపకల్పన చేశారు?
మానవతా విశ్వ సూత్రం ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన దేశం జపాన్.
19.రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాలు ఏవి? తెల్పుము?.
రాజ్యాంగ సభ చేసుకున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా
1.కేంద్ర అధికారుల సంఘం.
2 కేంద్ర రాజ్యాంగ సంఘం .
3.రాష్ట్ర రాజ్యాంగ సంఘం.
4ప్రాథమిక హక్కులు .
5.అల్పసంఖ్యాక వర్గాలు.
6.గిరిజన ప్రాంతాలు .
వంటివాటిపై సలహా సంఘాలను ఏర్పాటు చేశారు
20. దేశఐక్యత కాపాడటానికి ముసాయిదా రాజ్యాంగ మూడు ముఖ్య విధానాలు ఏవి?
భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం భారతదేశ ఐక్యతను కాపాడేలా రూపకల్పన చేశారు ఇందుకుగాను రాజ్యాంగంలో మూడు విధానాలు అనుసరించారు
1 ఒకే న్యాయవ్యవస్థ .
2 పౌర నేర అంశాలలో మౌలిక చట్టాలలో సారూప్యత
3 ముఖ్యమైన పదవులలో నియమించడానికి దేశమంతటికీ అఖిలభారత సివిల్ సర్వీసులు వ్యవస్థను నెలకొల్పారు.
21. లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?
నేపాల్ దేశం రాజ్య ప్రవేశిక పేర్కొంది .
22.శాంతి కాముకత ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది ?
జపాన్ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి