భారతదేశ శీతోష్ణస్థితి.
ప్రశ్నలు సమాధానాలు.
1.Q.వాతావరణం అనగా నేమి?
ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వర్షపాతం పవనాలు, ఆర్ధత ,మేఘాలు ,అవపాతం .వంటి సంయుక్త స్థితి వాతావరణం అంటారు.
Q2.
శీతోష్ణస్థితి అనగా నేమి ?
వాతావరణ పరిస్థితిలో ఉండే అంశాలు ఒక విశాలమైన ప్రాంతంలో 30 సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ సమయం వాతావరణ పరిస్థితులు ఒకేలా ఉండడాన్ని శీతోష్ణ స్థితి అంటారు.
3.Climo graph.or climoto graph. అనగా నేమి ?
దేశంలో వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వర్షపాతం అంశాలలోనూ వ్యత్యాసాలను తెలియ చేయడాన్ని climo graph అంటారు.
4.శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి?
1.అక్షాంశం.
2.భూమికి నీటికి గల సంబంధం .
3భౌగోళిక స్వరూపం .
4ఉపరితల గాలి ప్రసరణ .
5.Q.రుతుపవనాల ఆరంభం అనగా నేమి ?
అధిక పీడన ప్రాంతాలనుంచి అల్పపీడన ప్రాంతాలకు గాలి వేయడాన్ని రుతు పవనాలు ఏమంటారు. అప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన అకస్మాత్తుగా వర్షం రావడాన్ని రుతుపవన ఆరంభం అంటారు.
6.Q. వ్యాపార పవనాలు (tradewinds)అనగా నేమి?
ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులను వ్యాపార పవనాలు అంటారు.
(trade అనే జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం.).
7Q.జెట్ ప్రవాహాలు అనగానేమి ?
నేలనుండి 12 వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులను ప్రవాహాలు అంటారు.
8Q. పశ్చిమ విక్షోభాలు అనగా నేమి ?
భారతదేశం లో శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాను వాయు గుండాలను పశ్చిమ విక్షోభాలు అంటార.
9.Q. మ్యాంగో షవర్స్( mango showers)మామిడి జల్లులు అనగా నేమి?
భారతదేశ ద్వీపకల్పంలో వేసవికాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా కురిసే వర్షాలు మామిడి జల్లులు అంటారు. ఈ వ్యక్తి ఈ వర్షాలు మామిడి పండ్లు త్వరగా పండడానికి దోహదం చేస్తాయి.
10.Q.లూ (Loo)పవనాలు అనగా నేమి ?
భారతదేశం ఉత్తర మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక ప వనా.లూ( L00) పవనాలు అంటారు.
11.Q. భారతదేశ సాంప్రదాయ కాలాలు వివరించండి? (or) సాంప్రదాయ భారతీయ కాలాలను వర్గీకరించి నెలవారీగా వ్రాయండి?
వసంతం రుతువు. చైత్రం - వైశాఖం (మార్చి --ఏప్రిల్)
గ్రీష్మం ఋతువు. జేష్ఠ --ఆషాడం ( మే -జూన్)
వర్షరుతువు . శ్రావణం -భాద్రపదం (జూలై -ఆగస్టు)
శరదృతువు .ఆశ్వయుజం- కార్తీకదీపం( సెప్టెంబర్ర్ -అక్టోబర్)
హేమంత ఋతువు. మార్గశిరం -పుష్యం (నవంబర్ -డిసెంబర్)
శిశిర ఋతువు . మాఘం ఫాల్గుణం ?(జనవరి ఫిబ్రవర.)
12.I.P.C.C.:INTER GOVERNMENTAL PANAL ON CLIMATE CHANGE.
13.A.G.W.Anthroprogenic Global warming.
14.Q.హరితగృహ వాయువులు ఏవి?
కార్బన్ డయాక్సైడ్ . మీథేన్, క్లోరో ఫ్లోరో కార్బన్స్.
15.Q. భూగోళం వేడెక్కడానికి ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలు ఏమిటి?
అడవుల నిర్మూలన అటవీ సంపదను నాశనం చేయడం
వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో అధిక యంత్రాల వినియోగం
శిలాజ ఇంధనాలను దుర్వినియోగం చేయడం .
పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను సరిగా ప్రాసెస్ చేయకుండా వదిలివేయడం.
ఎయిర్ కూలర్లు రిఫ్రిజిరేటర్ లను అధికంగా వినియోగించడం .
వాహనాల వినియోగం పెరగడం .
జనాభా పెరగడం .
వ్యవసాయ రంగంలో రసాయనిక మందులు వినియోగం .
ఈ కారణాల వల్ల భూమి వేడెక్కడం జరుగుతుంది.
17.భూగోళం వేడెక్కడం ని తగ్గించడానికి కి తగిన సూచనలు చర్యలను తెలపండి ?
అడవులను ఎక్కువగా పెంచడం.
పర్యావరణ అనుకూల విధానాలను చట్టాలను తయారుచేయడం .
ఏసీల వినియోగాన్ని తగ్గించడం.
ప్రజా రవాణా సౌకర్యాలను పెంచడం.
సేంద్రియ ఎరువులను వినియోగించడం.
సౌరశక్తిని వినియోగించడం పునర్వినియోగ ఇంధనాలను వాడడం.
Q. భారతదేశ శీతోష్ణస్థితులు ప్రభావంపై 4 వ్యాఖ్యలు వ్రాయండి?
A. కరువులు సంభవించడం.
B. తుఫానులు సంభవించడం వాయుగుండాలు ఏర్పడడం.
దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడం .
కరువు కాటకాలు ఏర్పడడం.
తీర ప్రాంతాలు ముంపునకు గురి కావడం .
కొండ చరియలు విరిగి పడడం .
ప్రకృతి విపత్తులు సంభవించటం .
సముద్ర మట్టాలు పెరగడం
Q. అక్టోబర్ వేడిమి అనగా నేమి ?
అధిక ఉష్ణోగ్రత గాలిలో తేమ కారణంగా అక్టోబర్ నెలలో వాతావరణం చాలా ఉక్కపోత గా ఉంటుంది దీనినే అక్టోబర్ వేడి అంటార.
వర్షచ్చాయా ప్రాంతం అనగానేమి ?
వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాన్ని వర్షచ్చాయా ప్రాంతం అంటారు.
నైరుతి రుతుపవన కాలం అనగా నేమి
భారతదేశానికి జూన్ మొదట్లో నైరుతి దిక్కు నుండి (కేరళ) వీచే పవనాలను నైరుతి రుతుపవనాలు అంటారు ఇవి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం వరకు వీస్తాయి..
ఈశాన్య రుతుపవన కాలం అనగానేమి?
భారత దేశానికి ఈశాన్య దిక్కు నుంచి అక్టోబర్ మధ్య కాలం నుండి రుతుపవనాల ల వెనుదిరిగి వస్తాయి ఈ కాలాన్ని ఈశాన్య రుతుపవన కాలం అంటారు .
మాన్ సూన్ అనగా నేమి?
మా న్ సూన్ అనే పదం mausam అరబిక్్ పదం నుండి వచ్చింది మాన్సూన్ అనగా రుతుపవనాలు అని అర్థం .
భారతదేశంలో లో పంటకాలం (రుతుపవనాల) పేర్కొనుము?
భారతదేశంలో 3 పంట కాలాలు ఉన్నాయి అవి .
ఖరీఫ్ కాలం ;- జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం వరకు ఉండే పంట కాలం
రబీ కాలం :-నవంబర్ నుండి మార్చి వరకు ఉండే పంట కాలం.
జయాద్ :ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే పంట కాలం.
అడవుల నిర్మూలన అంటే ఏమిటి ?
అడవులను పెద్ద మొత్తంలో నరికి వేసే చర్యలను అటవీ నిర్మూలన అంటారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి