జనాభా (ప్రశ్నలు సమాధానములు నిధి)
1.జనసాంద్రత అనగానేమి?
ఒక ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు తెలియజేసే దాన్ని జనసాంద్రత అంటారు .
2.లింగనిష్పత్తి అనగానేమి?
జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు కు ఎంత మంది స్త్రీలు ఉన్నారు తెలియజేసే దాన్ని లింగనిష్పత్తి అంటారు.
3.ఫెర్టిలిటీ శాతం అంటే ఏమిటి?
ఒక మహిళ తన జీవిత కాలంలో లో ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చింది తెలియజేయు శాతాన్ని ఏమంటారు.
4 .భౄణహత్య అనగానేమి?
గర్భంలో ఉన్న శిశువును గర్భంలోనే చంపడాన్ని భ్రూణహత్య అంటారు .
5.శ్రా మిక జనాభా అనగానేమి?
జనాభా సమూహంలో లో 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులను శ్రామిక జనాభా అంటారు.
6.జనాభా మార్పు ను తెలియచేసే అంశాలను వివరించండి?
జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. 1.జననాలు, 2.మరణాలు .3వలసలు .
అనే మూడు ప్రక్రియల వల్ల జనాభా మార్పు కలుగుతుంది.
7.దేశ జనాభా ను ప్రధాన o గా ఎన్ని వర్గాలు గా విభజిస్తారు?
ఒక దేశ జనాభాను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు .
1 పిల్లలు (సాధారణంగా 15 సంవత్సరాల లోపు వారు)
2. పని చేసే వయసు (15 నుండి 59 మధ్య వయస్సు)
3. వృద్ధులు 59 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వాళ్ళు.
8.జన నాల రేటు అంటే ఏమిటి?
8.జన నాల రేటు అంటే ఏమిటి?
ఒక సంవత్సర కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభా ఎంత మంది సజీవంగా జీవించి ఉన్నారో దానిని జననాల రేటు అంటారు.
9.మరణాలు రేటు అంటే ఏమిటి?
ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక సంవత్సర కాలంలో ఎంత శాతం మంది మరణించారు తెలియజేసే దాని రేటు అంటారు.
10.జనాభా విస్తరణ అనగానేమి?
10.జనాభా విస్తరణ అనగానేమి?
జనాభా పెరుగుదల ఏ ఏ రాష్ట్రాలలో ఎంత ఉందో ఏ ప్రాంతాలలో ఎంత ఉందో తెలియజేసే దానిని జనాభా విస్తరణ అంటారు.
11.జనాభా పెరుగుదల అంటే ఏమిటి?
11.జనాభా పెరుగుదల అంటే ఏమిటి?
ప్రతి పది సంవత్సరాల కాలంలో జనాభా సంఖ్య పెరుగుదలను సూచించే దానిని జనాభా పెరుగుదల అంటారు.
12.జన గణన ద్వారా ఏమి తెలుసుకుంటారు?
దేశ జనాభాలో ఏ వయసు వారు ఎంత శాతం మంది ఉన్నారు.
శ్రామిక జనాభా ఎంత ఉంది .
జనాభాలో వృద్ధులు ఎంతమంది.
ఎంత మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు.
పారిశ్రామిక రంగం లో ఎంత మంది ఉన్నారు సేవా రంగంలో ఎంత జనాభా ఉంది.
అక్షరాస్యులు నిరక్షరాస్యులు. మతం , గృహ సౌకర్యం ,ఎన్ని రకాల వృత్తులలో ఉపాధి పొందుతున్నారు .ఎంతమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఇలాంటి అంశాలు సమాచారం సేకరించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఈ జనాభా సమాచారo సేకరించబడుతుంది.
13.వివిధ రాష్ట్రాల జనసాంద్రత లో తేడాలకు గల కారణాలు ఏంటి?
Ans.రాష్ట్రం యొక్క భూభాగం,
మైదానాలు, అడవులు. కొండలు.
పర్వతాలు, వార్షిక వర్షపాతం ,ఎడారులు సారవంతమైన నేలలు ,
మౌలిక వసతులు, విద్య వైద్య సౌకర్యాలు ,పట్టణీకరణ ,ఉపాధి అవకాశాల విస్తరణ .
వంటి అంశాలు .
వివిధ రాష్ట్రాలలో జనసాంద్రత లో తేడాలకు కారణం.
14.జనాభా పెరుగుదల కు గల కారణాలు ఏంటి?
1బాల్య వివాహాలు.
2. విద్య వైద్య సౌకర్యాల అభివృద్ధి.
.3.
ఉపాధి అవకాశాల పెరుగుదల ..4కరువుకాటకాల నిర్మూలన .5.మూఢనమ్మకాలు.
6.కుటుంబ నియంత్రణ పాటించకపోవడం పుత్రసంతానం కోసం నిరీక్షణ మధ్య .
7.జననాల రేటు ఎక్కువ కావడం .
సంతానానికి సంతానానికి మధ్య అనంతరం లేకపోవడం ..
8.వరదలను నివారించుట.
ఈ కారణాల వల్ల జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుంది
15.జనాభా పెరుగుదల అరికట్టేందుకు నీ సూచనలు తెల్పుము?
15.జనాభా పెరుగుదల అరికట్టేందుకు నీ సూచనలు తెల్పుము?
1.అక్షరాస్యతను పెంపొందించడం.
2.బాల్య వివాహాలను అరికట్టడం.
3.కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించడం .
4.విద్య వైద్య సంస్థలను అందుబాటులోకి తీసుకురావడం.
5.మూఢనమ్మకాలను తొలగించడం .
6.అధిక సంతానం అధిక భారం అని తెలియ చేయడo.
7.పురుషులైనా స్త్రీలైనా సమానమనే అనే భావన కలిగించడం
8.కుటుంబం పరిమిత కుటుంబం వల్ల కలిగే లాభాలను వివరించడం.
9.జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుందని తెలుపడం.
ఈ చర్యల ద్వారా జనాభాను అరికట్టవచ్చు
16.జనాభా సమస్య నివారణకు నినాదాలు వ్రాయండి?
16.జనాభా సమస్య నివారణకు నినాదాలు వ్రాయండి?
A.అధిక జనాభా- అనర్థాలకు హేతువు.
B.చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం.
C.అధిక జనాభా -ఆహార కొరత కు కారణం..
D.పరిమిత కుటుంబం ప్రగతికి సోపానం
17. లింగనిష్పత్తి లో అసమానతలు ఏ విదంగా తగ్గించవచ్చు?తెల్పుము?
17. లింగనిష్పత్తి లో అసమానతలు ఏ విదంగా తగ్గించవచ్చు?తెల్పుము?
1.అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా 2.పురుషులు స్త్రీలు సమానం అనే భావనను వృద్ధి చెందడం ద్వారా.
3. పురుషాధిక్యతను తగ్గించడం.
4. పురుషాధిక్య తను తగ్గించడం ద్వారా 5.మహిళా అక్షరాస్యతా పెంపొందించడం ద్వారా.
6. చట్టాల రూపకల్పన మరియు పటిష్ఠంగా అమలు చేయడం చేయడం ద్వారా.
18. శ్రామిక జనాభా అని ఎవరిని అంటారు?
15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారిని శ్రామిక జనాభా అంటారు వీరు వివిధ రకాల వృత్తుల లో పాల్గొని ఉత్పత్తి కార్యక్రమాలు చేపడతారు
19.అంతర్గత వలసలు అనగానేమి?
19.అంతర్గత వలసలు అనగానేమి?
దేశంలోని వివిధ రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను అంతర్గత వలసలు అంటారు
20.అంతర్జాతీయ వలసలు అనగానేమి?
20.అంతర్జాతీయ వలసలు అనగానేమి?
ఒక దేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని అంతర్జాతీయ వలస అంటారు.
21.తెలంగాణలోని ఏ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ ఉంది దానికి గల కారణం ఏమిటి?
తెలంగాణలో అత్యధికంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన ప్రాంతంలో జన సాంద్రత అధికంగా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాబట్టి అక్కడ జీవన సదుపాయాలు పారిశ్రామిక కేంద్రాలు , విద్య వైద్య కేంద్రాలు ,ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి కి వలస వచ్చి అక్కడ స్థిరపడటం వల్ల అధిక జనసాంద్రత కేంద్రీకృతమై ఉంది .
22.లింగనిష్పత్తి లో ఎక్కువ ,తక్కువ, ఉంటే సమాజం పై పడే ప్రభావం ను పేర్కొనండి?.
22.లింగనిష్పత్తి లో ఎక్కువ ,తక్కువ, ఉంటే సమాజం పై పడే ప్రభావం ను పేర్కొనండి?.
లింగ నిష్పత్తి లో తేడాలవల్ల సమాజంలో సామాజిక దుష్పరిణామాలు లేదా అరాచకాలు జరిగే అవకాశాలు ఏర్పడును.
వివాహం కావలసిన వారి మధ్య పురుషులకు స్త్రీలు ,స్త్రీలకు పురుషులు ,తగినంత లభ్యం కాకపోవచ్చు .
లింగ నిష్పత్తి జననాల రేటు ను ప్రభావితం చేస్తుంది .
సామాజిక అసమానతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
💐 💐 💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి