Translate

30, అక్టోబర్ 2020, శుక్రవారం

ఉత్పత్తి -- ఉపాధి

  1. ఉత్పత్తి ---ఉపాధి. 
ప్రశ్నలు సమాధానములు .


.1.ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఏవి?

ఆర్థిక వ్యవస్థలో రంగాలను మూడు రకాలుగా విభజించారు. 1 ప్రాథమిక రంగం.
 2 పారిశ్రామిక రంగం 
3 సేవా రంగం .

 2.స్థూల జాతీయోత్పత్తి అనే భావనను వివరించండి ?

ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తువుల సేవల విలువను లెక్క కట్టడాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు.


 3. అంత్య వస్తువులు అనగా నేమి ?

పూర్తిగా తయారయ్యి వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంత్య వస్తువులు అం టారు.

4.ప్రాథమిక రంగం అనగా నేమి? 

వ్యవసాయం దాని అనుబంధ రంగాలను కలిపి ప్రాథమిక రంగం అంటారు.

 .5.పారిశ్రామిక రంగం అనగానేమి ?

యంత్రాలను ఉపయోగించి వస్తువులను తయారుచేసే రంగాన్ని పారిశ్రామిక రంగం అంటారు.

6. సేవా రంగం అనగానేమి?

 వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను అందించే రంగాన్ని సేవా రంగం అంటారు ఉదా బ్యాంకులు, రైల్వేలు , విద్య వైద్యం, భీమా సంస్థలు, బీమా సంస్థలు మొదలగునవి .

7.వినియోగ వస్తువుల కు రెండు ఉదాహరణలు ?

వినియోగ వస్తువుల కు ఉదాహరణలు బియ్యం సైకిల్ పెన్ను పుస్తకం కారు మొదలగునవి .

8.ఉత్పాదక వస్తువులకు రెండు ఉదాహరణలు? 

ఉత్పాదక వస్తువులకు ఉదాహరణలు ట్రాక్టరు వ్యవసాయ పంపుసెట్లు మోటార్లు. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తికి దోహదం చేయును.

9.మాధ్యమిక వస్తువులు అనగా నేమి ?

పూర్తిగా తయారుకాని లేదా వినియోగానికి వీలుగా లేక ఉత్పత్తి మధ్యలో ఉండే .వస్తువులను మాధ్యమిక వస్తువు అని అంటారు


10.వ్యవస్థీకృత రంగం అనగానేమి ?

స్థిరమైన ఉపాధిని కల్పించే రంగాన్ని వ్యవస్థీకృత రంగం ఉంటారు ఈ రంగంలో క్రమపద్ధతిలో విధానాలు ,నిర్ధారిత పని గంటలు ,ఉద్యోగ భద్రత ,వంటివి  ఉంటాయి

11.అవ్యవస్థీకృత రంగం అనగానేమి?

అస్థిరమైన ఉపాధిని కల్పించే రంగాన్ని అవ్యవస్థీకృత రంగం అంటారు. ఇందులో లో ఉద్యోగలకు నియమ నిబంధనలు కానీ, ఉద్యోగ భద్రత గాని ,క్రమబద్ధమైన విధానాలు గాని ఉండవు.

12.అల్ప ఉపాధి అనగానేమి?

 సామర్థ్యానికి తగ్గ పని లభించని స్థితిని అల్ప ఉపాధి అంటారు.
Ex.. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి వ్యవసాయం చేయడం.

 13.ప్రచ్ఛన్న నిరుద్యోగం అనగా నేమి?

 అవసరాని కంటే  అధిక శాతం మంది శ్రామికులు పనిచేసే స్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.
Ex. భారత దేశ వ్యవసాయ రంగంలో ప్రత్యేక నిరుద్యోగం అధికం.

 14.స్థూల దేశీయోత్పత్తిలో వస్తున్న నా మార్పులను రంగాల వారీగా వివరించండి ?

భారతదేశంలో లో జాతీయ దేశీయోత్పత్తి ని మూడు భాగాలుగా  లెక్కించడం జరుగుతుంది . 1.ప్రాథమిక రంగం 2.పారిశ్రామిక రంగం 3.సేవా రంగం.
ప్రాథమిక రంగం లో 1972 -73 సంవత్సరంలో 43% ఆదాయం రాగా 2011వ సంవత్సరం నాటికి 16 %శాతానికి ఆదాయం   తగ్గిపోయింది. పారిశ్రామిక రంగంలో 71 -72 సంవత్సర కాలంలో 23% ఆదాయం  రాగా 2011 సంవత్సరం నాటికి 26% శాతానికి పెరిగింది .  సేవారంగం వాటా 71 -72 సంవత్సరం లో 35% శాతం నుండి ఇ
2011నాటికి58 %శాతానికి పెరిగింది. ఈ విధంగా  వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గి ,పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరిగింది.

కామెంట్‌లు లేవు: