Translate

12, అక్టోబర్ 2020, సోమవారం

ప్రపంచ యుద్ధాలు -ప్రపంచం

ప్రపంచ యుద్ధాలు --ప్రపంచం .

1.రష్యన్ విప్లవం సమాజంలో లో తెచ్చిన మార్పులు ఏమిటి వివరించండి?

భూస్వాములు రాజులు పెట్టుబడిదారులు దోపిడీదారులు లేని దేశం అన్ని నిర్మించడం  లక్ష్యంగా కార్యక్రమం  మొదలయ్యింది

.ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

 ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు .

 భూముల అన్నింటిని జాతీయం చేసి పంచి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు .

బ్యాంకు జాతీయకరణ వంటి చర్యలను సోవియట్ లో డిమాండ్ చేశారు .

1924లో యు ఎస్ ఎస్ ఆర్  ఏర్పాటు చేసుకున్నారు.

 ఉమ్మడి క్షేత్రాలలో వ్యవసాయానికి  నిర్ణయం అందరూ కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తిని పంచుకునేవారు.

అందరికీ అక్షరాస్యత ప్రాథమిక విద్యను అందించే ప్రయత్నం మొదలయ్యింది .

మహిళా కార్మికుల సంక్షేమం కోసం ఫ్యాక్టరీలలో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు .

తక్కువ ఖర్చుతో ప్రజారోగ్యం సంక్షేమ కార్యక్రమాలు గృహవసతి కార్మికుల కు కార్మికులకు ఏర్పాటు చేశారు.

2.ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి పాత్రను పేర్కొనండి?

ప్రపంచ దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి తీవ్రంగా గా కృషి చేస్తోంది.

సూయజ్ కాలువ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించింది.

 భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ నివారణకు తీవ్రంగా కృషి చేస్తోంది .

గ్రీక్ టర్కీ దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేసింది.

 ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించింది .

కువైట్ ను స్వాతంత్రం పొందేలా కృషి చేసింది .

నమీబియా దేశం స్వాతంత్ర్యం పొందడానికి సమితిలో సభ్యత్వం పొందడానికి కృషి చేసింది.

 ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య వివాదాన్ని పరిష్కరించింది.

 ప్రత్యేకించి మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా నివారించగలుగుతుంది .

అంతేకాకుండా మానవతా దృక్పథంతో వివిధ అంతర్జాతీయ సంస్థల ద్వారా విద్య, వైద్య ,పేదరిక ,కార్మిక సమస్యల పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించింది.

3.తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిణామాలను తెలపండి ?

తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల కర్మాగారాలు మూతబడి లక్షలాది కార్మికులు  తమ ఉపాధి ఉద్యోగ అవకాశాలను కోల్పోయారు .

 కర్మాగారాలు మూతపడడంతో తమ ఉత్పత్తులకు  డిమాండ్ లేక వేలాది మంది రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.

కరెన్సీ విలువ పడిపోవడంతో మధ్య తరగతి ప్రజలు ఉద్యోగస్తులు పింఛనుదారులు సమస్యలు ఎదుర్కొన్నారు .

వ్యాపారస్తులు తమ వ్యాపారాలు దెబ్బతినడంతో తమ ఉపాధిని కోల్పోయారు .

స్వయం ఉపాధి ఉన్న వాళ్లు కూడా ఎన్నో కష్టాలకు లోనయ్యారు .

కార్మికుల పరిస్థితి దారుణంగా తయారయింది .

ఉన్నత వర్గాల వారు తాము కూడా పేద వారిగా  మారుతామని భయపడ్డారు.

 మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

 ఆర్థిక సంక్షోభం ప్రజలకు తీవ్ర ఆందోళనలను కలిగించింది..

4.ఐక్యరాజ్యసమితి   ప్రపంచ ప్రభుత్వం లాంటిది అని తెల్పు నాలుగు సిద్ధాంతాలను వివరించండి?

ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్ప డింది.

1. ప్రపంచ శాంతిని నెలకొల్పటం.

 2 మానవ హక్కులను కాపాడటం .

3 అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం.

 4 సామాజిక ప్రగతికి ప్రోత్సహించటం.

ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఐక్యరాజ్యసమితి అనేక అంతర్జాతీయ సంస్థలు అనుబంధంగా ఏర్పాటు చేసింది .

అందులో   యూనిసెఫ్ (U N I C E F 0,)యునెస్కో. (U N E S C O.) డబ్ల్యు.హెచ్.ఓ.W H O 

 ఐ ఎల్ ఓ (I L O. )ఇలాంటివి ప్రధానమైనవి.

5.శాంతిని పెంపొందించే నినాదాలను పేర్కొనండి?

యుద్ధం వద్దు _శాంతి ముద్దు.

పోరు నష్టం_ పొందు లాభం.

6 ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి?

1.సాధారణ సభ( జనరల్ అసెంబ్లీ)

2. భద్రతామండలి (సెక్యూరిటీ కౌన్సిల్)

3. ఆర్థిక  మరియు సామాజిక మండలి (ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ )

4.ధర్మకర్తృత్వ మండలి (ట్రస్ట్ షిప్ కౌన్సిల్ )

5.అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ జస్టిస్)

6. సచివాలయం (సెక్రటరియేట్).

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు.

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్U.N.I.C.E.F.

 యునైటెడ్  నేషన్స్ ఎడ్యుకేషన్  అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ .U.N.E.S.C.O.

 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.W.H.O.

 ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్.F.A.O.

అంతర్జాతీయ కార్మిక  సంస్థ I.L.O.

ప్రపంచ  వాతావరణ  సంస్థI.M.O.

 విశ్వ  తపాలా  సంఘం U.P.U.

అంతర్జాతీయ  atomic శక్తి  సంస్థ I.A.E.A .etc.

కామెంట్‌లు లేవు: