Translate

5, అక్టోబర్ 2020, సోమవారం

ప్రపంచ యుద్ధాలు-- ప్రపంచం

ప్రపంచ యుద్ధాలు-- ప్రపంచం.
ప్రశ్నలు సమాధానములు.

1. ఆయుధ పోటీ అనగానేమి?

ప్రపంచంలోనే వివిధ దేశాలు ఆయుధాల ఉత్పత్తిలో పోటీపడి ఆయుధాలు తయారు చేయడాన్ని ఆయుధ పోటీ అంటారు.

2. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?

ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ అతని సతీమణి సోఫియా  ను బోస్నియా రాజధాని అయిన సరయివో  లో సెర్ప్ యువకుడు దంపతులిద్దరి ని కాల్చిచంపాడు.
 ఈ హత్యకు కారణం సెర్బియా నేనని 48 గంటల లోపు సమాధానం ఇవ్వాలని ఆస్ట్రియా ఆదేశించింది .
కానీ సెర్బియా సమాధానం ఇవ్వలేదు.
 దీంతో 1914 జూలై 28 న సెర్బియా పై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది.
ఫెర్డినాండ్ హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం అయ్యింది.

3.కేంద్ర  రాజ్యాలు ఏవి ?

జర్మనీ    ఆస్ట్రియా  ఇటలీ..

4.మిత్ర రాజ్యాలు లు ఏవి?

ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ,రష్యా ,అమెరికా.

5. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణాలు  ఏవి?

1.వర్సైల్స్ సంధి లోని అవమానకరమైన షరతులు.
 2.జర్మనీ తన గత వైభవాన్ని సంపదను కోల్పోవడం. 
3.జర్మనీ రెండు భాగాలుగా విడిపోవడం.
4 జర్మనీ ఆర్థికంగా సైనికంగా బలహీన పడడం వంటి కారణాల వల్ల జర్మనీ తిరుగుబాటు చేసింది.
 
6. వర్సైల్స్ సంధి షరతులు ఏవి?

1. ప్రాదేశిక ఏర్పాట్లు .
జర్మనీ ఆల్ సై సె   లో రైన్ ప్రాంతాలను ప్రాన్స్ కు అప్పగించడం.

2సైనిక పరమైన నిబంధనలు .

జర్మనీ దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ రద్దు చేయటం.
 యుద్ధ సామాగ్రి యుద్ధం పై పై పరిమితులు విధించడం .
చిన్న నౌకా దళం ఏర్పాటు.

3.ఆర్థిక పరమైన నిబంధనలు. 

యుద్ధ నష్ట పరిహారానికి సంబంధించిన ఏర్పాట్లు. చేయడ0.
 ఆయుధాలు లేకుండా చేయడం
..
రాజకీయపరమైన పునః పరిష్కారం .
నానాజాతి సమితి ఏర్పాటు వంటివి .

7. నానాజాతి సమితి లక్ష్యాలు వివరించుము?

 1అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడడం .

2.వివిధ దేశాల మధ్య స్నేహ పూర్వక సహకారాన్ని పెంపొందించడం.

3 నిరాయుధీకరణ చేపట్టడం .

4.అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం .

5.అంతర్జాతీయ అనుసరించి న్యాయాన్ని అందించడం


.8. నానాజాతి సమితి వైఫల్యాలకు 2 కారణాలు రాయండి?

1 అగ్రదేశాలు సభ్యులుగా లేకపోవడం.
 2.సభ్య దేశాలు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడం.3
 3.జర్మనీ జపాన్ ఇటలీ లను ఇతర దేశాలపై యుద్ధం చేయకుండా నివారించ లేకపోవడం. 4.మంచూరియా భూభాగాన్ని ఖాళీ చేయమని ఆదేశాలను జారీ చేస్తే జపాన్ పట్టించుకోకపోవడం.
 ఈ కారణాలు సమితి వైఫల్యానికి దారితీశాయి

9.జార్ లు అనగా ఎవరు?

Ans.
 రష్యాను పరిపాలించిన రాజులను జార్ లు అంటారు.

10న్యూ డీల్ విధానం అనగా నేమి ?

Ans.
అమెరికా అధ్యక్షుడు అయినా రూజ్వెల్ట్ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాన్ని నూడిల్ అంటారు

1.1.రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణాలు ఏవి ?

●హిట్లర్ పోలెండ్ పై దాడి చేయడం
●జర్మనీని రెండు భాగాలుగా విభజించడం .●డాన్ జింగ్ ఓడరేవును అంతర్జాతీయం చేయడం. 

12.మార్షల్ ప్రణాళిక అనగా నేమి?
Ans.

 అమెరికా చేపట్టిన ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం ఇది ఇది ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టిన కార్యక్రమo. 

13. మాల్తోవు ప్రణాళిక అనగా నేమి?

Ans. 
అమెరికా చేపట్టిన మార్షల్ ప్రణాళిక కు వ్యతిరేకంగా రష్యా చేపట్టిన ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ. ఈయన రష్యా విదేశాంగ మంత్రి .

14. ఫిబ్రవరి విప్లవం అంటే ఏమిటి ?
 ans.

1917 మార్చి 15 నా విప్లవకారులు రష్యా జార్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు .ఈ విప్లవాన్ని..ఫిబ్రవరి లేదా( మార్చి)విప్లవం అంటారు. ఎందుకనగా రష్యా క్యాలెండర్ అంతర్జాతీయ క్యాలెండర్ కు 13 రోజులు ముందు ఉంటుంది.

15. అక్టోబర్ విప్లవం అనగా నేమి ?

1917 nov . లో లెనిన్ నాయకత్వంలో రష్యాలో చేసిన తిరుగుబాటును అక్టోబర్ విప్లవం అంటారు.

Cont...nxt

కామెంట్‌లు లేవు: