Translate

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

ప్రపంచ యుద్ధాలు ప్రపంచం

ప్రపంచ యుద్ధాలు ప్రపంచం ప్రశ్నలు సమాధానాలు

1 సైనికవాదం అనగా నేమి?
Ans.

భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మడానికి సైనికవాదం అంటారు.

2. నాజీజం అనగా? 
Ans.

జాతీయత వాదం అనే భావజాలం ఆధారంగా హిట్లర్ జర్మనీలో కొనసాగించిన విధానాలను నాజీజం అంటారు ఇది ఇది తమ జాతి పట్ల గర్వాన్ని ఇతర జాతుల పట్ల దేశాన్ని కలిగించింది. 
                Or
జర్మనీలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ విస్తరింపజేసిన భావజాలాన్ని నాజీయిజం అంటారు .


3. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అనగా నేమి?

Ans.

 పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పరిశ్రమలను స్థాపించి ఉత్పత్తి సరఫరా సేవలను అధికంగా లాభాలు ఆశించే ఉద్దేశంతో నిర్వహించే విధానాన్ని పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ఉంటారు.

4. సోషలిజం (సామ్యవాదం) అనగా నేమి?.
Ans.

పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల ఏర్పడిన (సామాజిక  రాజకీయ ఆర్థికఅక్రమాలు))అసమానతలకు వ్యతిరేకంగా ఏర్పడింది సోషలిజం.
సమ సమాజాన్ని స్థాపించడమే సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం.

5.  కమ్యూనిజం అనగా నేమి?
Ans.

సామ్యవాదం లో కమ్యూనిజం ఒక ఒక భాగం లక్ష్య సాధనకు విప్లవ మార్గాన్ని హింసా పద్ధతులను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం.

7. ఫాసిజం అనగానేమి?
"Ans.

"పాసియో ""  అనే  రోమన్ పదం నుంచి  ఫాసిజం  అనే పదం  ఏర్పడింది  ఫాసిజం అనగా  కడ్డీల కట్ట  లేదా  కట్టెలమోపు  అని అర్థం ఇది . దీనిని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు .ఇది ఇటలీలో  ముస్సోలిని  నాయకత్వంలో  ఏర్పడిన  పార్టీ .

8.విప్లవం అనగా నేమి?
Ans.

మార్పు విప్లవం అనగా మార్పు.
 శాంతియుత పద్ధతుల ద్వారా గాని హింసాయుత పద్ధతుల ద్వారా గాని సమాజంలో లో జరిగే మార్పును విప్లవం అంటారు.

 9.సామ్రాజ్య వాదం అనగా నేమి?

వలసరాజ్యాల స్థాపనలో ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన విభేదాలను సామ్రాజ్య వాదం అంటారు.

10. దురహంకార పూరిత జాతీయత వాదం అనగా నేమి?
Ans.
 స్వ జాతి పట్ల గర్వాన్ని ఇతరుల (జాతులు) పట్ల  ద్వేషాన్ని  కలిగి ఉండడాన్ని దురహంకార పూరిత జాతీయవాదం అంటారు.

11. బోల్షివిక్   అనగా   ఎవరు?
Ans.
రష్యాలో శ్రామిక నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అనుకున్నవారు బోల్షివిక్ లు.

12. ప్రజాస్వామ్యం అనగానేమి?
Ans.

ప్రజల చేతిలో అధికారం ఉండే ప్రభుత్వ వ్యవస్థను ప్రజాస్వామ్యం అంటారు.

13. ఆర్థిక మాంద్యం అనగా నేమి?
Ans.
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పడిపోయి ఆర్థిక వ్యవస్థ క్షీణించిన పరిస్థితిని ఆర్థిక మాంద్యం అంటారు.

14.    త్రీ రాజ్య సంధి ఏ ఏ దేశాలు కుదుర్చుకున్నాయి?
Ans.

జర్మనీ , ఆస్ట్రియా ,ఇటలీ .దేశాలు సైనిక ఒప్పందం కుదుర్చుకున్నాయి . వీటినే తర్వాత కేంద్ర రాజ్యాలుగా వ్యవహరించారు.

15.ట్రై పాక్షిక ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది?

 ఇంగ్లాండ్  ఫ్రాన్స్ రష్యా ,దేశాల మధ్య జరిగింది వీటిని తర్వాత మిత్ర రాజ్యాలు వ్యవహరించారు.


16. బాల్కన్ రాజ్యాలు ఏవి ?

బోస్నియా ,సెర్బియా ,రొమేనియా, అల్బేనియా మాంటెనెగ్రో  లు బాల్కన్ రాజ్యాలు. ఇవి టర్కీ సుల్తాన్ ఆధ్వర్యంలో ఉండేవి.

Cont..

కామెంట్‌లు లేవు: