Translate

12, అక్టోబర్ 2020, సోమవారం

2 అభివృద్ధి భావనలు

2 .అభివృద్ధి భావనలు. 

ప్రశ్న సమాధానాలు.

1.తలసరి ఆదాయం అనగానేమి ?

Ans.

 జాతీయ ఆదాయాన్ని దేశం  యొక్క జనాభా చే భా గి స్తే వచ్చేది ఆదేశ తలసరి ఆదాయం.

2.మానవ అభివృద్ధి అనగానేమి ?

ans.

తలసరి ఆదాయం, జీవన ప్రమాణం, అక్షరాస్యత ,ప్రజారోగ్యం, జీవన ప్రమాణం శిశు మరణాలు . జనన రేటు వంటి అంశాలలో ప్రగతి సాధించడాన్ని మానవాభివృద్ధి అంటారు.

3.ప్రజా సదుపాయాలు వివరించుము?

Ans.

ప్రజలు జీవించడానికి అవసరమైన  వస్తు సేవలు , భౌతిక సేవలు ,ప్రజా ఆరోగ్య సేవలు, మౌలిక వసతులు ,విద్యా సౌకర్యాలు, వంటివి ప్రజా సదుపాయా లు అంటారు.

4. అభివృద్ధి  అనే భావనను వివరించండి?

Ans.

అభివృద్ధి అనేది  ఒక భావన దీనిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. దేశంలో లోప్రజలు  సామాజిక ,ఆర్థికంగా ,రాజకీయ పర్యావరణ సంబంధిత అంశాలలో ప్రగతి సాధించడాన్ని. అభివృద్ధి అంటారు.


5 జాతీయ ఆదాయం అనే భావనను వివరించండి ?

Ans.

ఒక దేశంలో లో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంత్య వస్తు సేవల వస్తువు యొక్క విలువని ఆదేశ జాతీయాదాయం అంటారు.?

         (or)

దేశ ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం అంటారు.

6.అక్షరాస్యత శాతం అనగా నేమి ?

ans. 

దేశ జనాభాలో ఏడు సంవత్సరాలు అంతకుమిం

చి వయసు ఉన్న వాళ్ళలో అక్షరాస్యతను తెలిపేది అక్షరాస్యత శాతం అంటారు.

7.సుస్థిర అభివృద్ధి అనగానేమి?

Ans.

భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతినకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు.

8.లింగ వివక్షత అనగానేమి ?

Ans.

సమాజంలో పురుషులు స్త్రీలను చిన్న చూపు చూడడాన్ని లింగ వివక్షత అంటారు.

9.లింగ నిష్పత్తి అనగానేమి ?

ans.

దేశ జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసే దానిని లింగ నిష్పత్తి అంటారు.

10.ఆయు :ప్రమాణం అనగానేమి?

Ans.

 వ్యక్తి యొక్క జీవించే సగటు జీవన కాలాన్ని తెలియ చేసేదానిని ఆయు: ప్రమాణం అంటారు.

 11.శిశు మరణాల రేటు ఉ అనగానేమి ?

Ans.

సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది మరణిస్తున్నారు తెలియజేసే దానినే "శిశు మరణాల రేటు "అంటారు.


 12.హిమాచల్ ప్రదేశ్ పాఠశాల విద్యా విప్లవం పై మీ అభిప్రాయం ను వివరించుము ?

Ans.

*పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా  ప్రభుత్వం చూసింది .విద్యార్థులకు కు ఉపాధ్యాయులకు తరగతి గదులు, మరుగుదొడ్లు , త్రాగు నీరు, ఆటస్థలం, వంటి కనీస సదుపాయాలు ఉండేలా చేశారు .

ఉపాధ్యాయుల నియామకం క్రమం తప్పకుండా చేశారు .

ప్రభుత్వం తన బడ్జెట్ లో సగటు విద్యార్థి పై సుమారు 2005వ రూపాయలు ఖర్చు పెడుతూ పాఠశాల మెరుగైన సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేసింది. ఈ వసతులు వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా సంతోషదాయకం పాఠశాలలో చదువు నేర్చుకోవడం జరిగింది.

 ఈ నమూనాను అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తే దేశ విద్యాభివృద్ధిలో గణనీయమైన మార్పులు వస్తాయి.

13.  దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు యొక్క ప్రామాణికాలు ఏవి?

Ans.


ప్రపంచ బ్యాంకు 2017వ సంవత్సరంలో అమెరికా కరెన్సీ డాలర్ ను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ దేశాలను మూడు రకాలుగా వర్గీకరించింది.

  అవి ఏవి అనగా 

1.అధిక ఆదాయ దేశాలు(or) ధనిక దేశాలు . ఏ దేశ తలసరి ఆదాయం అయితే 12055 అమెరికా డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న దేశాలు ధనిక దేశాలు.

2.మధ్య ఆదాయ దేశాలు .

ఆదాయం 12054 అమెరికా డాలర్ల నుండి 996 అమెరికా డాలర్ ల మధ్య ఆదాయం ఉంటే ఆ దేశాలను మధ్య ఆదాయ దేశాలు అంటారు.

3.తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు.

ఏ దేశ తలసరి ఆదాయం 995 అమెరికా డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉంటే ఆదేశాలను పేద దేశాలు లేదా తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు అని ప్రపంచ బ్యాంకు ప్రామాణిక రించింది.

14.లింగ వివక్షత ను రూపుమాపడానికి నీవు ఇచ్చే సూచనలు ఏమిటి?

Ans.

భారతదేశం తరతరాలుగా పురుషాధిక్య సమాజం నెలకొని ఉంది .కాబట్టి మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

 మహిళలకు అన్ని రంగాలలో విద్య వైద్యం రాజకీయం ఆర్థిక సామాజిక రంగాలలో సమానత్వ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలి .

బాలికలకు విద్య అవకాశాలను మెరుగుపరచాలి .

పౌష్టికాహారాన్ని అందజేయాలి.

 శిశు సంరక్షణ చర్యలను చేపట్టాలి .

మహిళలకు ప్రత్యేకించి వైద్యరంగంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి .

తల్లిదండ్రులు బాల బాలికలను సమానంగా చూడాలి.

కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

 గృహ హింస చట్టాలను మరింత కఠినం చేయాలి .

పనిచేసే ప్రదేశాలలో ఇబ్బందులు ఎదురు కాకుండా సరైన సదుపాయాలు కల్పించాలి.

15. మానవ అభివృద్ధిని కొలవటానికి మీ దృష్టిలో ఇంకా ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?

Ans.

మానవ అభివృద్ధి ని కొలవడానికి తీసుకోవలసిన అంశాలు 1 వాస్తవిక తలసరి ఆదాయం .2విద్య వైద్యం pఆరోగ్యం .

3ఆయు ప్రమాణం 4.పర్యావరణం సాంకేతిక అభివృద్ధి.

5 జీవన ప్రమాణాలు 6.పంపిణీలో సమన్యాయం 7.సామాజిక న్యాయం .

8 రవాణా వ్యవస్థ ,విద్యుత్ సౌకర్యం త్రాగునీరు ,సాగునీరు,  మౌలిక వసతులు బ్యాంకులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు .మొదలగునవి.

16.కుడంకులం అను విద్యుత్ ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు ఎందువల్ల?

1.స్థానికులకు జీవన ఉపాధి కోల్పోతామని భయం .

2.పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని భావన .3.రేడియోధార్మిక పదార్ధాలు  వెలువడుతాయి . ఈ పదార్థాలు  జీవావరణ వ్యవస్థ కు  నష్టాన్ని కలుగజేస్తాయి..

5.ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోకపోవడం .అను విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం . 

6.అనేక దేశాలలో జరిగిన అను విద్యుత్ ఉత్పత్తి లో జరిగిన దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకోకపోవడం

7.తీర ప్రాంత రక్షణ భద్రత పర్యావరణ అంశాలు పరిగణలోకి తీసుకోకపోవడం ఈ కారణాల చేత స్థానిక ప్రజలు భయాందోళనకు లోని లోనై విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకించారు.



కామెంట్‌లు లేవు: