Translate

7, డిసెంబర్ 2020, సోమవారం

ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం

 ప్రశ్నలు సమాధానాలు


1.N. A. T. O. ను విస్తరించుము?

 North Atlantic treaty organisation 


2.S.E.A.T.O.  ను విస్తరించుము?
South east Asian treaty organisation 

3.C.E.N.T.O. ను విస్తరించుము?
Central treaty organisation 


4. సై నిక ఒప్పందం అనగానేమి?

రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్న ఒప్పందం సైనిక ఒప్పందం అంటారు. ప్రపంచ యుద్ధాల సమయంలో అనేక దేశాలు ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి .Ex N.A.T.O. ,S.E.A.T.O..


5.P.L.O. ను విస్తరించుము?

పాలస్తీనా లిబ రేషన్ ఆర్గనైజేషన్.

6.పరోక్ష యుద్ధం అంటే ఏమిటి?

ఒక దేశం పై మరొక దేశం నేరుగా యుద్ధం చేయకుండా సాంకేతిక పద్దతుల ద్వారా ఉగ్రవాద చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను దేశాన్ని దెబ్బతీసే టువంటి చర్యలను పరోక్ష యుద్ధం అంటారు

7.ప్రచ్ఛన్న యుద్ధం అనగానేమి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యమైన అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధం అంటారు.

8.అలీ న విదానం అంటే ఏమిటి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా (ప్రజాస్వా మ్య) కూటమిలో గాని రష్యా (కమ్యూనిస్టు) కూటమి గాని చేరకుండా తటస్థ విధానాన్ని అవలంబించడానికి అలీన విధానం అంటారు .అయితే  వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సహకారాలను పెంపొందించుకునే ఉద్దేశ్యంతో నెహ్రూ  ఈ విధానాన్ని అనుసరించారు

9.వీటో అధికారం అనగానేమి?

ఐక్యరాజ్యసమితి లోని భద్రతామండలి  చేసే నిర్ణయాలను ను శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించే విధానాన్ని లేదా తిరస్కరించే విధానాన్ని వీటో అధికారం అంటారు ఈ అధికారం అమెరికా ,బ్రిటన్ ,చైనా ,ఫ్రాన్స్ ,రష్యా, దేశాలకు మాత్రమే కలదు.


10. వలస పాలన నుండి విముక్తి అంటే ఏమిటి?

ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించి పరిపాలన చేస్తూ ఉంటే అటువంటి దేశాలను ఆ పాలిత దేశాలనుంచి విముక్తి చేయడాన్ని వలస పాలన విముక్తి అంటారు .Ex. భారతదేశాన్ని బ్రిటన్ దేశం నుంచి విముక్తి చేయడం.


11.(U. N. O). ఐక్యరాజ్య సమితి లో  శాశ్విత సభ్య దేశాలు ఏవి?

అమెరికా ,బ్రిటన్, చైనా ,ఫ్రాన్స్, రష్యా  దేశాలకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కలదు.

12. ఐక్యరాజ్య సమితి లోగో (  పతాకం) ను వివరించండి?

ఐక్యరాజ్యసమితి పతాకం: నీలిరంగు పతాకంపై గ్లోబు, గ్లోబు కు ఇరువైపులా ఆలివ్ కొమ్మలు ఉంటాయి .
నీలిరంగు అభివృద్ధికి నిదర్శనం .
గ్లోబు ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాల ను సూచిస్తుంది .
 ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం.

13.సైనిక ఒప్పందం వల్ల అగ్రరాజ్యాల కు  అందుబాటులో కి వచ్చిన కీలక  వనరులు ఏవి?

సైనిక ఒప్పందంం వల్ల  అగ్ర రాజ్యాల ప్రభావం పెరిగి వాటికి క్రింది వనరులు అందుబాటులోకి వచ్చాయి.
: చమురు ఖనిజాలు వంటి కీలక వనరులు. :   ఉత్పత్తులకు మార్కెట్ .
:పెట్టుబడులుు పెట్టడానికి ప్రమాదకరం లేని ప్రదేశాలు .
తమ సైనికులను ఆయుధాలను ఉపయోగించడానికి సైనిక స్థావరాలు .
తమ భావజాల వ్యాప్తి .పెద్ద  మొత్తంలో ని ఖర్చుకి ఆర్థిక మద్దతు.

14.ఆయుధ, అంతరిక్ష పోటీ వల్ల జరిగిన పరిణామాలు ఏమిటీ?

1. ఆయుధాలు పైన ఖండాంతర క్షిపణుల విధ్వంసకర ఆయుధాలు పైన ప్రపంచ దేశాలు ఖర్చును పెంచాయి.

2. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ భయం వాతావరణం ఏర్పడింది.

3. వివిధ దేశాల మధ్య గూడ చర్యలు చోటుచేసుకున్నాయి.

4.వివిధ దేశాల మధ్య సైనిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం ,సైద్ధాంతిక విభేదాలు పెరిగాయి.



15.బాoడుoగ్ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ఆసియా ఆఫ్రికా ఖండాలలో ని 29 దేశాల ప్రతినిధులు 1955 ఏప్రిల్ 18 నుండి 24 వరకు ఇండోనేషియాలోని బాండుంగ్ లో సమావేశం అయ్యారు.

బాండుంగ్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు.

ఆసియా ఆఫ్రికా లో ఆర్థిక అభివృద్ధి పెంపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తించడం .

శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించడం.
 ఆఫ్రికా ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవడం .
వలసపాలకుల వైఖరిని ఖండిస్తూ ప్రాథమిక హక్కులు ప్రజలకు అందేలా చూడడం.

16.అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి?

అలీనోద్యమ మొదటి సమావేశం 1961 సెప్టెంబర్ లో యుగోస్లేవియా లోని బెల్గ్రేడ్ లో జరిగింది 2012నాటికి సభ్య దేశాల సంఖ్య 120 కి పెరిగింది .
దీని ముఖ్య ఉద్దేశాలు

 అలీనోద్యమ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్రాన్ని సంపాదించాయి.
 పెరుగుతున్న ప్రపంచ యుద్ధ తీవ్రతలు మిగిలిన ప్రపంచం పై దాని ప్రభావం పడకుండా చూడడం.
 వలస పాలన నుండి విముక్తి అయిన దేశాలు ఏ  సైనిక శిబిరంలో చేరకుండా చూడడం.

17.మధ్య ప్రాచ్యం అనగానేమి?

ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమాసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు.

18.పశ్చి మ ఆసియా సంక్షోభo అనగానేమి?

పశ్చిమాసియాలో అరబ్బులకు యూదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలను పశ్చిమాసియా సంక్షోభం అంటారు.

19.జియోనిస్ట్ ఉద్యమం అనగానేమి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి ఇ తమ మాతృభూమి అయినా పాలస్తీనాను తిరిగి పొందే ఉద్దేశంతో చేసిన ఉద్యమాన్ని  జియోనిస్ట్ ఉద్యమం అంటారు.


20.మూడవ ప్రపంచ దేశాలు  అని అలీన దేశాలను ఎందుకంటారు?

అప్పుడే స్వాతంత్రం పొందిన దేశాలను మూడో ప్రపంచ దేశాలు అంటారు. 
ఈ దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవి .
ఈ దేశాలలో పేదరికం ,అనారోగ్యం ,అసమానత్వం ,వలసవాదం వంటివి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
 కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావం తో కూడిన పరిస్థితులు నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. 
ఈ దేశాల యొక్క సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అలీన ఉద్యమం సరైనది అని భావించడం వల్ల ఇందులో చేరాయి. కాబట్టి ఈ దేశాలను అలీనోద్యమ దేశాలు అంటారు.


21.వాగ్దత్త భూమి అనగా?.

యూదులు పాలస్తీనా భూభాగాన్ని వాగ్దత్తభూమి అంటారు.


22.ఆరబ్బులు,యూదులు  మధ్య  ఘర్షణలకు కారణాలు ఏంటి?

అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది .
అక్కడ ఉన్న జెరూసలేం, యూదులు, క్రైస్తవులు ,ముస్లింలకు పవిత్ర స్థలం.
యూదులను  నిర్వాసితులు చేయడంతో వారు యూరప్ ,ఆసియా అంతటా వలస వెళ్లారు.   
 ఏసుక్రీస్తు  సిలువ  వేయడానికి యూదులను బాధ్యులను చేసి వారిని వేధింపులకు గురి చేశారు .
జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో లక్షలాది మంది యూదులను చంపటం దీనికి పరాకాష్ట.
 యూదుల తమ దేశాన్ని ని తిరిగి పొందాలని   జియోనిస్ట్ ఉద్యమం చేపట్టారు.
అదే సమయంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనడంతో అమెరికా, యు. ఎస్ .ఎస్ .ఆర్  . లు తమ ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాయి.
1947 లో లో ఐక్యరాజ్యసమితి ఇ పాలస్తీనాను రెండు భాగాలుగా చేసి  అరబ్బులకు ,మరొకటి యూదులకు కేటాయించింది.
అయితే ఇప్పటికి కూడా అరబ్బులకు యూదులకు సరైనటువంటి పరిష్కారం లభించక పోవడం వల్ల ఆ ప్రాంతం నిత్యం ఘర్షణ తో సతమతమవుతూ ఉంది.



23.పంచశీ ల ఒప్పందం ను వివరించండి?
1. ఒక దేశ సర్వసత్తాక తను భౌగోళిక తను మరొకరు గౌరవించడం.
2 ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం .
3.దాడులకు దిగడం వివాదాలను అవగాహనతో పరిష్కారం చేసుకోవడం..
4.అంతర్జాతీయ సంబంధాలు సహకారం కోసం కృషి చేయడం.
5. శాంతియుత సహజీవనానికి ప్రోత్సహించడం.


24.గోర్బచేవ్ పరిపాలన  విధానాలు  తెల్పుము?

రష్యాలో గోర్బచేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలు చేయడానికి రాజకీయ సంస్కరణలు చేయడానికి ప్రయత్నించాడు .
ఈయన ఉదార వాద సిద్ధాంతాలు కలవాడు.
 పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపర్చడానికి ప్రయత్నం చేశాడు.

గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

25 గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, అంటే ఏమిటి?

గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను  గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా అంటారు.

26.ఏక ధ్రువ ప్రపంచం అంటే ఏమిటి?

1991లో యు.ఎస్.ఎస్.ఆర్. పతనం కావడంతో తో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ప్రారంభమైంది . అమెరికా ఆర్థిక శక్తిగా  తయారైంది .అది ఏకధృవ ప్రపంచం గా మారింది.

27.ద్విద్రువ ప్రపంచం అంటే ఏమిటి?

వలస దేశాలు స్వాతంత్రం పొందిన తరువాత తర్వాత అమెరికా రష్యాలు రెండు  ప్రపంచ ఆర్థిక శక్తులుగా పరిణమించాయి. ఈ రెండు దేశాల ప్రపంచ ప్రాబల్యాన్ని ద్వి ధ్రువ ప్రపంచం అంటారు.

28.U. S. S. R. పతనానికి గల కారణాలు వ్రాయండి?


29.మెక్ మోహన్ రేఖ అనగానేమి?

భారతదేశం చైనా దేశాల మధ్య సరిహద్దురేఖ మెక్ మోహన్ రేఖ అంటారు.

30.భారత దేశం, చైనా, సంబంధాలను వ్యాఖ్యానిo చుము?

1949లో చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యం అయింది చైనా కమ్యూనిస్టు పార్టీ ని గుర్తించిన తొలి దేశాలలో భారత దేశం ఒకటి

భారతదేశం చైనా దేశానికి   ఐక్యరాజ్యసమితిలో శాశ్వత  సభ్య స్థానానికి మద్దతు తెలిపింది.
1954 april 29 న పంచశీల ఒప్పందం పై రెండు దేశాలు నాయకులు సంతకం చేశారు.
టిబెట్ భారతదేశాల సరిహద్దు అయిన మెక్ మోహన్ రేఖను చైనా అంగీకరించలేదు. 
ఆక్సాయ్చిన్ ప్రాంతం లో  సరిహద్దు వివాదం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది .
పంచశీల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ
1962 లో భారతదేశంపై చైనా దండెత్తింది.
 మూడో ప్రపంచ దేశాల్లో తన ఆధిపత్యానికి భారత్ అవరోధంగా ఉందని భావించింది.

రెండు దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగా గా కొనసాగిన కొన్నిసార్లు  ఘర్షణలకు కూడా కారణమవుతూ ఉన్నాయి


31.పాకిస్థాన్,భారత్ దేశం సంబంధాలను వివరించండి?

మత ప్రాతిపదికపై భారత దేశం రెండు రాజ్యాలు గా విడిపోయిన తర్వాత చెలరేగిన సంఘటనలు ప్రభావం ఇరుదేశాల సంబంధాలను శాసిస్తుంది .
కాశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య వివాదాలకు కారణమవుతోంది .
1966లో భారత్ పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం కుదిరింది .ఈ ఒప్పందాలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉంది .
1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో భారత జోక్యం చేసుకోవడంతో ఈ రెండు దేశాలు మరో సారి యుద్ధం చేసుకున్నాయి.
 1999లో కార్గిల్ సమస్య భారత్-పాక్ల మధ్య యుద్ధానికి కారణం అయింది .
అదే సమయంలో సంస్కృతి, నాగరికత ,వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, సౌహార్దం పర్యటనలు, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

32. బంగ్లాదేశ్, భారత దేశం సంబంధాలు ను వివరించండి?

బంగ్లాదేశ్  భారతదేశం రెండూ కూడా సరిహద్దు దేశాలు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత ప్రభుత్వం  కీలక పాత్ర పోషించింది .
బ్రహ్మపుత్ర నది గంగా నది జలాల పంపకంలో రెండు దేశాల మధ్య విభేదాలు  ఉన్నాయి.

అయినప్పటికీ రెండు దేశాలు ఆర్థిక రంగంలో సాంకేతికంగా సాంస్కృతికంగా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాయి.

33.శ్రీలంక భారత దేశం మధ్య సంబంధాలు ను వివరించండి?

భారతదేశం శ్రీలంక 2 ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక 1948లో స్వాతంత్రం పొందింది శ్రీలంక భారత్ దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయ తమిళం మాట్లాడే అల్పసంఖ్యాకుల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన విధానం భారతదేశం శ్రీలంక సంబంధాల పట్ల ఘర్షణలకు కారణం అయింది .
ప్రస్తుతం రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి

34. L.T.T.E ?

Libration  of Tamil Tigers Eelam

35.సిమ్లా ఒప్పందం గురించి వ్యాఖ్యానించండి?

1945లో అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్  వా  వేల్  కార్యనిర్వాహక మండలిలో భారతీయులను ప్రేమించే ఈ విషయమై చర్చించడానికి సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
 దీనినే సిమ్లా ఒప్పందం అంటారు .కార్యనిర్వాహక మండలి లో పదవులన్నీ భారతీయులతో భర్తీ చేయడం .
హిందువులకు ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం ఇస్తామని ప్రకటించడం.
  ముస్లిం లీగ్ సభ్యులను ముస్లింలకు మాత్రమే నామినేట్ చేస్తుందని మహమ్మద్ అలీ జిన్నా పట్టుపట్టడంతో  విఫలమయ్యాయి.

36."ముక్తి బాహిని" అనగా

 ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు చేసిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని mukti bahini అంటారు
💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: