. వివరణాత్మక సమాధానములు.
1.భారత దేశభౌగోళిక స్వరూపాలు ను వివరించoడి.?
Ans.
1## హిమాలయాలు
2## గంగా సింధు నది మైదానం
3## దీపకల్ప పీఠభూమి
4## తీరప్రాంత మైదానాలు
5## ఎడారి ప్రాంతం
6.## దీవులు
2.భారత దేశ నదులు ఎన్ని రకాలు గా వర్గీకరణ చేశారు .నదీ వ్యవస్థ లను వివరించండి.
Answer
భారతదేశ నది జల వ్యవస్థను రెండు రకాలుగా వర్గీకరణ చేశారు
1.హిమాలయ నదులు దీని జీవనదులు 2.ద్వీపకల్ప నదులు ( వర్షాధార నదులు)
జీవనదులు ముఖ్యంగా
1.సింధూ నది వ్యవస్థ :
టిబెట్ లోని కైలాస పర్వతాలు లో జన్మించి భారత్లోని జమ్ము కాశ్మీర్ లో ప్రవేశిస్తుంది సింధు నది ప్రధాన ఉపనదులు జీలం ,చీనాబ్ ,రావి ,బియాస్ సట్లెజ్.
2గంగానది నది వ్యవస్థ :
ఈ నది గర్వాల్ టిబెట్ సరిహద్దు వద్ద అలక్ నందా మరియు భగీరథ అనూ రెండు ప్రధాన సెలయేళ్ల కలయిక .
దీని పొడవు 2525 కిలోమీటర్లు .
.ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ వద్ద యమునాా ,సరస్వతి నదులు గంగానదిలో కలియు చున్నవి. .
ఈ ఈ నదులు కలిసి ఇ ది త్రివేణి సంగమంగా ఏర్పడును ఈ నది యొక్క ఉపనదులు యమునా, గండక్ ,సోన్ ,కోసి మొదలగునవి.
3బ్రహ్మపుత్రా నది వ్యవస్థ;
ఈ నది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలు లోని చమయుంగ్ డంగ్ నుండి పుడుతుంది. దీని ఉపనదులు టుగ్రీ ,పద్మా.
4.ద్వీపకల్ప నదులు :
మహానది : చత్తీస్ ఘడ్ లోని మహదేవ్ కొండలు
5.గోదావరి నది : మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద
6.కృష్ణా నది : మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ 7.కావేరి నది కర్ణాటకలోని బ్రహ్మగిరి
8.నర్మదా నది :అమర్ కంటక్ మధ్యప్రదేశ్లోని జన్మించును.
3.భారత దేశ "ద్వీపకల్పం" ను వివరించండి?.
Ans.
మూడు వైపులా నీటిచే ఆవరించబడి ఉన్నా భూభాగాన్ని ద్వీపకల్పం అంటారు .
భారతదేశానికి తూర్పు బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం ఉండడంవల్ల భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు.
4.భారత దేశ శీతోష్ణ స్థితి వైవిధ్యం ను వివరించండి?
Ans.
1. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి .
2.ఖండఅంతర్గత గత శీతోష్ణస్థితి .
1.మనదేశo అత్యుష్ణ అతిశీతల ప్రదేశాలను కలిగి ఉష్ణోగ్రత వైవిధ్యత లను కలిగి ఉండడం .
2.రుతుపవన వర్షపాతం వర్షపాతం కలిగి ఉండడం .
3.సముద్రానికి గల దూరాన్ని బట్టి భారతదేశం వైపు వీచే పవనాలు ఒక ప్రదేశం యొక్క ఉనికి, ఎత్తు మొదలగునవి వర్షపాత విస్తరణ లో శీతోష్ణస్థితిలో వైవిధ్యతను కలిగి ఉన్నాయి .
5.అక్షాంశ, రేఖా oశాల ఆధారంగా భారత దేశం ను వర్ణించుము?
Ans.
భారతదేశం ఉత్తరార్థ ,పూర్వార్ధ గోళం,
లలో ఆసియా ఖండానికి దక్షిణాన ఉంది
భౌగోళికంగా 8 °4`- 37°6` డిగ్రీల ఎనిమిది ఉత్తర అక్షాంశాల మధ్య 68°7`-97°25' తూర్పు రేఖాంశాల మధ్య భారత దేశం కలిగి ఉంది
దీని విస్తీర్ణం 3. 28 మిలియన్ చదరపు కిలోమీటర్లు ప్రపంచంలో భారతదేశం విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉంది.
6.భారత దేశ భూగర్భ నేపథ్యం ను వివరించండి.?
Ans.
భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగం భూభాగంలోని ది .
20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం విడిపోయి భారతదేశ ద్వీప కల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి angaara భూ మీ ఢీకొంది
తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ఈ ప్రక్రియ వల్ల ప్రస్తుతమున్న హిమాలయాలు ఏర్పడ్డాయి
ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల పెద్ద లోయ ఏర్పడింది .
కాలక్రమంలో ఉత్తరాది నుంచి హిమాలయ నదులు దక్షిణం నుంచి దీపకల్ప నదులు తెచ్చిన మట్టితో మేట వేయబడినది.
దీని ఫలితం భారత భూభాగం ఎంతోో తో వైవిద్యత తో కూడుకుని ఉంది.
7.హిమాలయ, ద్వీపకల్ప నదులు ఉత్తర మైదానాలు ఏర్పాటుకు ఏ విదంగా దోహదపడ్డాయి.తెలుపండి?
Ans.
సింధూ నది దాని ఉపనదులైన జీలం ,చీనాబ్, రావి బియాస్ సట్లెజ్ నదులు ,తెచ్చిన ఒండ్రు మట్టితో పంజాబ్ హర్యానా ప్రాంతంలో సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి .
గంగా నది దాని ఉపనదులైన గగ్గర్ నుండి తీస్తా నది వరకు ఉత్తర ప్రదేశ్ బీహార్ హర్యానా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సారవంతమైన మైదానాలు ఏర్పడ్డానికి దోహదపడ్డాయి.
ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరభాగంలో పుట్టే చంబల్, సింద్, కెన్' బెట్వా ,సొన్ నదులు గంగా నది వ్యవస్థ చెందుతాయి ఈ నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గంగా సింధు మైదానాలు ఏర్పడ్డాయి
8.భారత దేశ హిమాలయ ప్రాముఖ్యతను ను వర్ణించుము.?
Ans.
1హిమాలయాలు మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల 2.పవనాలను భారతదేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి
3.భారత దేశంలో వర్షపాతం మరియు రుతుపవన శీతోష్ణస్థితి ప్రధాన కారణం హిమాలయాలు.
4.హిమాలయాలు జీవనదులు లకు జన్మస్థానం గా ఉన్నాయి.
5.హిమాలయాలు వినోద్ పర్యటన అభివృద్ధికి లోయలు వేసవి విడిది విధులు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి దోహదం చేస్తున్నాయి.
6.విలువైన అటవీ సంపద హిమాలయాల నుండి లభిస్తున్నాయి
7.హిమాలయాలలో లభించే మూలికలు భారత ఔషధ పరిశ్రమకు ఉపయోగపడు తున్నాయి .
8.హిమాలయాలలో ఉండే కనుమల ద్వారా సహజ రవాణా మార్గాలుగా విదేశీమారక అభివృద్ధికి దోహదం చేయును .అలాగే పర్వతారోహకులు అభిలాష తీరుస్తున్నాయి.
9.జల విద్యుత్ శక్తి కి అనుకూలంగా ఉన్నాయి.
9.గంగా సింధూ నదీ మైదాన వ్యవస్థ ఏ విదంగా ఏర్పడింది, వర్ణించుము?
మద్య మహాయుగ కాలంలో టెథిస్ అనే పెద్ద సముద్రం ఉండేది ఆ సముద్రం సంపీడనం కు లోను కావడం వల్ల అక్కడ అ అనేక అవక్షేప పాలు నిక్షేపింపబడినవి .
పూర్వము టెథిస్ సముద్రం ఉన్నచోట హిమాలయాలు ఏర్పడిన అందువల్ల అక్కడ పెద్ద అఖాతము ఏర్పడింది.
ఈ ప్రాంతంలో హిమాలయ నదులు తెచ్చిన ఒండ్రు మట్టి నిక్షిప్తం చేయడం వల్ల అక్కడ గంగా సింధు మైదానం ఏర్పడింది
10.ద్వీపకల్ప పీఠభూమి గురించి వివరించుము?
Ans.
భారతదేశ పీఠభూమిని దానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు
ఇక్కడ ప్రధానంగా పురాతన
స్పటిక కారకారా కఠినమైన అగ్ని శిలలు రూపాంతర శిలలు లు ఉన్నాయి ఈ పీఠభూమిలో లోహ అలోహ ఖనిజ వనరులు పెద్ద మొత్తంలో కలవు .
ఈ పీఠభూమికి పడమటి పడమటి కనుమలు తూర్పు తూర్పు కనుమలు దక్షిణాన కన్యాకుమారి ఉంది.
దీపకల్ప పీఠభూమి పూర్వం గోండ్వానా భూమిలో భాగంగా ఉండేది .
గోండ్వానా భూమిలో కదలికలు రావడం వల్ల పురాతన స్పటిక శిలలు తో కూడిన ఈ భూమి సముద్ర మట్టం పైకి నెట్టబడింది .
ఫలితంగా ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడింది.
11.తూర్పు తీర, పశ్చిమ తీర మైదానాల మధ్య వ్యత్యాసాలు ఏమిటీ?
Ans.
తూర్పు తీర మైదానాలు
1.ఇవి బంగాళాఖాతానికి తూర్పు కనుమలు మధ్యన ఉన్నది.
2. ఈ మైదానాలు బల్లపరుపుగా వెడల్పుగా ఉన్నాయి.
3. తూర్పు తీర మైదానాలు వెడల్పు 100 -150 కిలోమీటర్లు వరకు ఉంటుంది.
4.మైదానాలలో మహానది ,గోదావరి ,కృష్ణ కావేరి ,వంటి నదులు ప్రవహించును.
పశ్చిమ తీరా మైదానాలు .
1ఇవి అరేబియా సముద్రం నకు పశ్చిమ కనుమలకు ఈ మధ్యన వ్యాపించి ఉన్నాయి .
2పశ్చిమ తీర మైదానాలు గుజరాత్, కొంకణ
తీరం ,కెనరతీరం ,malabar పేర్లతో తో పిలుస్తారు .
పశ్చిమ తీరాన 50 -km 80 కిలోమీటర్ల వెడల్పుతో గలవు.
ఇక్కడ నర్మద తపతి సబర్మతి మహి వంటి నదులు ప్రవహించి సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి .
గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి.
12.భారత దేశ థార్ ఎడారి గురించి వర్ణించుము.?
Ans.
ఆరావళి పర్వతాలు వర్షచ్చాయా ప్రాంతంలో తార్ ఎడారి కలదు.
ఇక్కడ సాంవత్సరిక వర్షపాతం 100 మిల్లీ మీటర్లు నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది .
ఎడారిలో ఎత్తుపల్లాల తో ఇసుక మైదానాలు కలవు.
ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది .
ఈ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో అధిక భాగం కలదు
13.భారతదేశ విశిష్టత లో దీవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాఖ్యానించండి?
Ans
భారతదేశంలో 2 ద్వీప సమూహాలు కలవు బంగాళాఖాతంలో 1.అండమాన్ నికోబార్ దీవులు 2.అరేబియా సముద్రంలో లక్షదీవులు కలవు.
నికోబార్ దీవి లో ఇందిరా పాయింట్ (భారతదేశ దక్షిణ చివరి అoచు )కలదు.
లక్షదీవుల లో ప్రవాళ భిత్తికలు కలవు .
వీటిని (కోరల్ రీఫ్) పగడపు దీవులు అంటారు .
ఈ దీవులలో నీ నార్ కొండం ,బారెన్ దీవులు ,అగ్నిపర్వతం వల్ల ఏర్పడ్డాయి.
లక్షదీవుల కు దక్షిణంగా మినికాయ్ దీవి ఉన్నది.
ఇక్కడ రకరకాల వృక్ష జీవజాతుల కలవు ఇవి ఎంతో వైవిద్యత తో ఉన్నాయి
14.భారత దేశం అభివృద్ధి లో హిమాలయాల పాత్ర ను వ్యాఖ్యనించండి?
Ans.
1.మధ్య ఆసియా నుండి వీ చే శీతల పవనాల ను భారతదేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి .
2 భారతదేశంలో రుతుపవన శీతోష్ణస్థితి కి వర్షపాత విస్తరణ కు కారణం హిమాలయా లే .
3.హిమాలయాలలో జీవనదులు ఉండడంవల్ల ఉత్తర భారతదేశం సారవంతమైన ఒండ్రు నేలలు ఏర్పడి వ్యవసాయాభివృద్ధికి ఉపయోగ పడుతుంది .
4.హిమాలయాలలోని లోయలు వేసవి విడుదులు విదేశీ యాత్రికుల ఆకర్షిస్తూ విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నాయి .
5.ఇక్కడి కలప ఫైన్ దేవదారు వెదురు మొదలగు అటవీ సంపదఆర్థిక అభివృద్ధికి ఔషధ పరిశ్రమకు ఉపయోగపడుతుంది .
6.ఇక్కడ ఖనిజ సంపద రాగి ,జింక్ , నికెల్ బంగారు ,వెండి లభించును .
7.ఖైబర్ bolan కనుమలు సహజ మార్గాలు గా విదేశీ వాణిజ్య అభివృద్ధి కి తోడ్పడును.
15.భారత దేశ మైదానంలలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత ను తెలుపండి?
Ans.
1. మైదానాలలో సారవంతమైన ఒండ్రు మట్టి ఉండడంవల్ల వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేయును .
2.మైదానాల లో నేలలు సహజంగా బంకమన్ను తో ఉంటాయి . సున్నపురాయి ఫొటోస్ సమృద్ధిగా ఉండును.
3.మైదానాలలో పత్తి ,మిరప, గోధుమ, చెరకు చెరకు వంటి వాణిజ్య పంటలు అధిక ఉత్పత్తి తో సాగవుతున్నాయి.
4. దేశ వ్యవసాయ సంపదలో అధిక భాగం ఈ మైదానాల నుండి లభించును.
5. వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏర్పాటుకు మైదానాలు దోహదం జేయును .
6.ఒండ్రు మృత్తికలు ఉన్నచోట గొప్ప నాగరికతలు వెల్లివిరిశాయి .
7వ్యవసాయం వ్యాపారం గా మారిన నా ఈ రోజుల్లో మంచి మృత్తికలు వ్యవసాయదారుడు చేసే వ్యాపారానికి కావలసిన మంచి ముడిసరుకు.
16.వ్యవసాయరంగాన్ని హిమాలయాలు ఏ విదంగా ప్రభావితం చేస్తున్నాయి..వివరించండి.?
Ans.
హిమాలయాలు లు ఉత్తర భారతదేశం నుంచి వీచే చలి గాలులను అడ్డుకుని భారతదేశ ఋతు పవన శీతోష్ణస్థితి కి కారణం అవుతున్నాయి. .
హిమాలయాలలో ప్రవహించే జీవనదులు ఉత్తర భారతదేశం మైదానాలలో వ్యవసాయ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
హిమాలయాలు వేసవికాలంలో లో మైదానాలలో వర్షం కురవడానికి నైరుతి రుతుపవనాలు దేశం దాటి పోకుండా అడ్డగించి రుతుపవన శీతోష్ణస్థితి కి కారణం అవుతున్నాయి.
హిమాలయాలు లో ఆల్పైన్ ఉద్ది జాలు or అటవీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంది
17. హిమాలయాలు లేకపోతే భారత ఉపఖండ శీ తోష్ణ స్థితి ఎలా ఉంటుంది వ్యాఖానించండి.?
Ans.
1.ఉత్తర భారతదేశం మంచు ఎడారిగా మారి ఉండేది.
2.వేసవిలో వర్షపాతం ఉండేది కాదు .
.3.హిమాలయాలు లేకపోతే ఉత్తర భారతదేశంలో జీవనదులు ఉండేవి కాదు .
4.హిమాలయాలు లో అందమైన లోయలు వేసవిలో ఉండేవి కాదు .
5ప్రాచీన వాణిజ్య సంస్కృతి కారకమైన ఖైబర్ bolan కనుమలు ఉండేవి కాదు
6.అటవీ ఆధార పరిశ్రమ అభివృద్ధి చెందేది కాదు
18.హిమాలయ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితి ద్వీపకల్ప పీఠభూమి కి మధ్య గల తేడా లు వ్రాయండి?
Ans.
హిమాలయ ప్రాంతం భోగోళికస్థితి .
========================
*హిమాలయాలు మూడు భాగాలుగా విభజించి ఉన్నాయి 1 హిమాద్రి 2 హిమాచల్ 3.శివాలిక్ పర్వత శ్రేణులు .
*హిమాద్రి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఎత్తయిన పర్వత శిఖరాల తో కూడుకొని ఉంది .
* హిమాచల్ పర్వత శ్రేణి శ్రేణిలో సిమ్లా ముస్సోరి నైనిటాల్ రానిఖేట్ వంటి వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి .
శివాలిక్ పర్వత శ్రేణి అవక్షేప శిలల తో ఏర్పడ్డాయి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో జమ్ము కొండలు మిసిమి కొండలు అని పిలుస్తారు.
హిమాలయాలలో గంగ సింధు బ్రహ్మపుత్ర నదులు ముఖ్యమైనవి.
దీపకల్ప పీఠభూమి భౌగోళిక స్థితి .
========================
__ద్వీపకల్ప పీఠభూమి గంగా సింధు మైదానం కు దక్షిణంగా ఉంది .
ఈ పీఠభూమి వైశాల్యం సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు.
ద్వీపకల్ప పీఠభూమి కఠినమైన అగ్ని శిలలు రూపాంతర శిలలు తో ఉంది .
.
ఈ పీఠభూమి కి ఉత్తరాన మాల్వా పీఠభూమి దక్షిణాన ఉన్న దక్కన్ పీఠభూమి గలవు.
ద్వీపకల్ప పీఠభూమి లో గోదావరి కృష్ణ మహానది కావేరి నదులు ముఖ్యమైనవి.
19.హిమాద్రి అనగా నేమి?
Ans.
1.హిమాలయాలలో ఉత్తరాన ఎత్తయిన పర్వత శ్రేణి ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు .
ఇవి సముద్ర మట్టం నుండి సుమారు 6100 సగటు ఎత్తును కలిగి ఉంటాయి.
.హిమాద్రి పర్వత శ్రేణులు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి
20.హిమాచల్ శ్రేణులు అనగా నేమి?
Ans.
హిమాద్రి కి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణి నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ అని పిలుస్తారు .
ఈ పర్వతాలు సగటు ఎత్తు 3,700 ఉండి 4వేల 500 మీటర్లు వరకు ఉంటుంది నిమ్న హిమాలయాలలో కులు కాంగ్రా కాశ్మీర్ లోయ లు ఉన్నాయి
21.శివాలి క్ శ్రేణి అనగా నేమి?
Ans.
హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి శివాలిక్ పర్వత శ్రేణి అంటారు దీన్ని సగటు ఎత్తు 900 మీటర్ల నుండి 1100 మీటర్లు ఉంటుంది.
22.సింధూ నదీ ఉపనదులు ఏవి?.
Ans.
సింధూ నది ఉపనదులు
జీలం చీనాబ్, రావి బియాస్ ,సట్లెజ్ .
23.అంతర్వేది అనగానేమి?
Ans.
రెండు నదుల మధ్య సారవంతమైన భూభాగాన్ని అంతర్వేది అంటారు.
24.డూ న్ అనగానే మి?
Ans.
హిమాచల్ పర్వతాలు శివాలిక్ కొండలు వేరు చేస్తూ ఉన్న సన్నని సమతల భూతలం గలధైర్య లోయలను dune లు అంటారు అంటారు.
25.భా బర్ అనగానే మి?
Ans.
శివాలిక్ కొండల దగ్గర గులకరాళ్ళ తో కూడి ఉన్న సన్నని భూభాగాలను బాబర్ అంటారు.
26.టెరాయి .అనగానేమి?
Ans.
చిత్తడి మైదానాల తో కూడి ఉన్న భూభాగాలను teరాయి అంటారు అంటారు
27.రే or kallar మైదానం అంటే ఏమిటి?
Ans.
చౌడు లవణాలు స్పటికాలు తో కలిసి ఉన్న భూభాగాలను రే లేదా kallar మైదానాలు అంటారు.
28.ఖాదర్ అనగానేమి?
Ans.
నూతనంగా ఏర్పడిన ఒండ్రు మైదానాన్ని ఖాదర్ అంటారు
బంగర్ అనగా నేమి ?
Ans.
ప్రాచీన కాలంలో ఏర్పడిన మైదానాన్ని ఒండ్రు మైదానాన్ని బంగర్ అంటారు
29.డెక్కన్ పీఠభూమి అనగానేమి?
Ans.
భారతదేశ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని దక్కన్ పీఠభూమి అంటారు
30.కోరల్ రీఫ్ అనగానేమి?
Ans.
సాంకేతిక భాషలో ప్రవాళ భిత్తికలు గా పిలువబడే పగడపు దిబ్బ కోరల్ రీఫ్ అంటారు
31.తూర్పు తీ రప్రాంత స్థానిక నామములు (పేర్లు) ఏవి?
Ans.
ఉత్కల్ తీరం (ఒడిస్సా) సర్కార్ తీరం (ఆంధ్ర ప్రదేశ్ )కోరమాండల్ తీరం (తమిళనాడు)
2.పశ్చిమ తీర ప్రాంత స్థానిక పేర్లు ఏవి?
Ans.
గుజరాత్ తీరం( గుజరాత్ )కొంకణ తీరం (మహారాష్ట్ర గోవా ),కెనరా తీరం (కర్ణాటక )మలబార్ తీరం. (కేరళ)
33.కర్కటరేఖ ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది?
Ans.
గుజరాత్ ,రాజస్థాన్, మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్ jharkhand పశ్చిమ బెంగాల్. త్రిపుర మిజోరాం.
34.అంగారభూమి అనగానేమి?
Ans.
టెథస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న angara భూమి అంటారు
35.గోండ్వానాభూమి అనగానేమి?
Ans
టెథిస్స ముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి అంటారు
36. జీవనది అనగానేమి?
Ans.
సంవత్సరం పొడవునా ప్రవహించే నదిని జీవనది అంటారు వీటికి ఉదాహరణలు హిమాలయాలలో ప్రవహించే సింధు నది గంగా నది వాటి ఉపనదులు
37.దీ వులు అనగానేమి?
Ans.
నాలుగు వైపులా నీటిచే ఆక్రమించబడిన మధ్యలో భూ భాగం ఉన్న స్థితిని దీవులు అంటారు ఉదాహరణలు అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు
38.భారత దేశ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?
Ans.
1.అండమాన్ నికోబార్ దీవులు 2.చండీగర్ 3.దాద్రా నగర్ హవేలీ 4.డామన్ డయ్యు 5
పాండిచ్చేరి 6.లక్షదీవులు7ఢిల్లీ 8.జమ్ము 9.లడక్
39.అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడ్డ దీవులు ఏవి?
Ans.
Narkondam దీవులు ,బారెన్ దీవులు
40.భారత దేశ దక్షిణ చివరి పాయింట్ ఏది.?
Ans.
ఇందిరా పాయింట్
41తూర్పున.అరుణాచల్ ప్రదేశ్ నుండి పశ్చిమాన గుజరాత్ మధ్య 2గ౦"వ్యత్యాసం ఉంటుంది .ఎందుకు? వివరించుము.?
Ans.
తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు దూరం 30 డిగ్రీల రేఖాంశాలు ఉన్నందున రెండు గంటలు వ్యత్యాసం నమోదు అవుతుంది.
42.అంతస్తలీయ ప్రవాహం అనగానేమి?
Ans.
ఎడారులలో ప్రవహించే నదులు సముద్రాన్ని చేరకుండా భూభాగంలో అంతమయ్యే ప్రవాహాలను అంతస్థలియా ప్రవాహంం అంటారు.
43.శు ష్క వాతావరణం అనగానేమి?
Ans.
సంవత్సరిక వర్షపాతం తక్కువగా ఉన్నా స్థితిని సుష్క వాతావరణం అంటారు.
44 .కనుమ అనగానేమి?
Ans.
పర్వతాల మధ్య ఉన్న దారులు (సహజ మార్గాలను) కనుమ అంటారు ex. కైబర్, bolan కారకోరం.
45.మాక్ డో క్, డింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలవు?
Ans.
మేఘాలయ రాష్ట్రం
46.హిమాచల్ శ్రేణిలో గల ముఖ్య పర్వత శ్రేణలు ఏవి?
Ans.
pir panjal మహాభారత పర్వత శ్రేణులు.
47.హిమాచల్ శ్రేణీ లో గల లోయలు ఏవి?
Ans.
కాశ్మీరు లోయ ,కాంగ్రా లోయ ,కులు లోయ లు మొదలగునవి.
48 హిమాచల్ శ్రేణీ లో గల వేసవి విడిది కేంద్రాలు ఏవి?
Ans.
సిమ్లా ముస్సోరి నైనిటాల్ రానిఖేట్ వంటి వేసవి విడిది కేంద్రాలు గలవు.
49.హిమాచల్ శ్రేణి లో గల అరణ్యాలు ఏవి?
Ans.
సతత హరిత అరణ్యాలు .
50.భారత దేశ (కాలమాన రేఖ)
ప్రామాణిక రేఖాంశం ఏది?
Ans.
82 1/2° తూర్పు రేఖాంశం.
51.I. S. T. అనగానే మి? విస్తరించు ము?
Ans.
Indian standard time భారత ప్రామాణిక సమయము.
52.G. M. T. ను విస్తరించుము?
Ans.
గ్రీనిచ్ ప్రామాణిక సమయము ( greenwich mean time)
53.ఇండియా భూభాగంతో సరిహద్దు కలిగిన దేశాలు ఏవి?
Ans.
పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్ ,చైనా నేపాల్ ,భూటాన్ బంగ్లాదేశ్ ,మయన్మార్.
54.భారత దేశం తో జలాభాగ సరిహద్దు గల దేశం ఏది?
Ans.
శ్రీలంక.
56.పూర్వాంచల్ పర్వతాల ప్రాంతీయ నామా లు (పేర్లు) ఏవి?
Ans.
పాట్ కాయ్ కొండలు, నాగ కొండలు ,మణిపురి కొండలు కాశీ కొండలు ,మిజో కొండలు అంటారు.
......