💐💐ప్రపంచీకరణ💐💐
-----------------/-/-------------1విదేశీ వాణిజ్యo అనగానేమి?
ఒక దేశం మరొక దేశం తో చేసే వ్యాపార లావాదేవీలను విదేశీ వాణిజ్యం అంటారు.
2.బహుళ జాతి సంస్థలు అంటే ఏమిటి ఉదా.లివ్వండీ?
ఒక కంపెనీ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగిస్తూ చౌకగా ఉత్పత్తుల చేపట్టి నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు ఉదాహరణకు కోకో కోల , సాంసంగ్,. టాటా మోటార్స్,, ఇన్ఫోసిస్, ర్యాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్.
3.విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి?
విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు (భవనాలు యంత్రాలు భూమి ఇతర పరికరాలపై ) వ్యయాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు.
4.సరళీకృత ఆర్థిక విధానo అంటే ఏమిటి?
వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న అవరోధాలను తొలగించి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు ఈ విధానాన్ని భారతదేశం 1991 నుండి అమలు చేస్తూ వస్తుంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి ఎక్కువగా వచ్చాయి.
5.జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
బహుళజాతి కంపెనీలు ,స్థానిక కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని చేపడితే అటువంటి కంపెనీలను జాయింట్ వెంచర్లు అంటారు.
6.W.T.O . విస్తరించుము?
ప్రపంచ వాణిజ్య సంస్థ ( world trade organisation. )
7.I.M.F .
అంతర్జాతీయ ద్రవ్య నిధి.
8.ఎస్ ఈ జెడ్ అనగా నేమి?
.స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి.)
9.ప్రపంచీకరణ అనగానేమి?
విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానంవేగంగా పెరిగింది .పెరుగుతున్న ఈ దేశాల సంబంధాన్ని ఇది ప్రపంచీకరణ అంటారు.
10.ప్రపంచీకరణ పై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని వివరించండి?
ప్రపంచీకరణ వల్ల సేవలు ప్రత్యేకించి ఐటీ తో కూడిన సేవలందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
నిర్వహణ ఖర్చులు తగ్గాయి. పరిపాలనా సంబంధమైన పనులు ,ఇంజనీరింగ్ పనులు డేటా ఎంట్రీ, జమా ఖర్చులు లెక్కలు, సులభంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేయగలుగుతున్నారు.
వినియోగదారులకు కూడా నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి.
వినియోగదారులకు సాంకేతిక పరిజ్ఞానం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు అనుభవిస్తున్నారు. ఉత్పత్తిదారులు ,కార్మికులపై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం ఒకే రకంగా లేదు.
11.ప్రపంచీకరణ ప్రక్రియ లో బహుళ జాతి సంస్థల పాత్ర ఏమిటి?
బహుళజాతి కంపెనీలు నియంత్రణలో పెట్టుబడులు వాణిజ్యం ద్వారా మార్కెట్లు ఉత్పత్తి అనుసంధానం బహుళజాతి సంస్థల వల్లనే వేగవంతం అయ్యింది. బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసే ఎటువంటి వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అమ్మడం జరుగుతూ ఉంది .వివిధ దేశాల మధ్య దూరం తగ్గి అనుసంధానం పెరిగి ఆర్థిక ప్రక్రియ వేగవంతమైంది.
బహుళజాతి సంస్థల వల్లనే పెట్టుబడులు సేవలు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం మధ్య దిగువ తరగతి దేశాలకు సులభంగా అందుబాటులోకి వచ్చింది.
12భారత దేశo పై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి?
ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాల్లో ధనవంతులకు మేలు జరిగింది .
వివిధ వస్తువుల ఉత్పత్తులలో నాణ్యత పెరిగి ధరలు తగ్గాయి .
వినియోగదారులకు కు ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.
బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి .అవి వారికి లాభంగా పరిణమించాయి.
భారతదేశ అతి పెద్ద కంపెనీల మధ్య కూడా పోటీ పెరిగి సాంకేతిక పరిజ్ఞానం ,ఉత్పత్తి పద్ధతు లలో , ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తున్నారు .
బహుళజాతి సంస్థల వల్ల ప్రత్యేకించి ఐటీ రంగంలో అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి.
ప్రపంచీకరణ వల్ల కొన్ని భారతీయ కంపెనీలు కూడా బహుళజాతి సంస్థలు గా మార్పు చెందాయి.
13.బహుళ జాతి భారతీయ కంపెనీలు ఏవి ఉదా. లివ్వండి?
బహుళజాతి భారతీయ కంపెనీలు టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్ సుందరం ఫాస్ట న ర్ ,వంటి కంపెనీలు,.
14.కార్మిక చట్టాల సడలింపు కంపెనీలు కు ఏ విదంగా ఉపయోగ పడుతుంది వివరించండి?
కార్మిక చట్టాల వల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది.
కానీ కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి .కార్మికులను నియామకం చేసుకునేటప్పుడు డు కల్పించాల్సిన వసతులను పూర్తిస్థాయిలో అంద చేయరు ..
కార్మికులకు పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువ.
ఈ సంస్కరణల వల్ల కార్మికులకు నష్టదాయకం.
కంపెనీలకు లాభదాయకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ.
15.ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల పై ఒకే విదంగా ఉంటుందా?
ప్రపంచీకరణ ప్రభావం వల్ల అన్ని దేశాల మీద ఒకే విధంగా ఉండదు .సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి పేద మధ్య ఆదాయ దేశాలకు కు ఎగుమతి చేస్తారు. దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలకు లాభాలు వస్తాయి.
పేద , మధ్య ఆదాయ దేశాలు లో లో విదేశీ పెట్టుబడులు వాణిజ్యం పెరుగుతాయి. ప్రపంచమంతా సరిహద్దు లేని విస్తృత వ్యాపార కేంద్రంగా మారిపోతాయి.
వివిధ దేశాల సంబంధాలు పెరుగుతాయి.
వివిధ రకాల ఉత్పత్తుల్లో వివిధ రకాల దేశాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి .
16.విదేశీ పెట్టుబడులు, వాణిజ్యాల పై అవరోధాలు కల్పించడానికి గలాకారణాలు ఏమిటి? వీటిని ఎందుకు సరళికరించాలనుకుంటుంది?
స్వాతంత్రం తరువాత విదేశీ పెట్టుబడులు వాణిజ్య లపై అవరోధాలు కల్పించడానికి కారణం దేశీయ పరిశ్రమల అభివృద్ధి, విదేశీ పరిశ్రమల పోటీ నుండి రక్షణ కల్పించడం ప్రధాన ధ్యేయం.
అయితే కాలక్రమంలో భారతదేశంలో లో పెట్టు బడులు తగ్గిపోయి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగింది.
1991 సంవత్సరం భారతదేశం విదేశీ మారక ద్రవ్యం లోటు ఏర్పడింది.
దాంతో విదేశీ పెట్టుబడుల మీద ఆధార పడవలసి వచ్చింది.
కావున ఆర్థిక ఆంక్షలు తొలగించి ఆర్థిక వ్యవస్థను సరళీ కరించి విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడులకు అవరోధాలను తొలగించారు.
17.ప్రపంచ వాణిజ్య సంస్థ గూర్చి వివరించండి?
జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ స్థానంలో 1955 జనవరి 1న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు కాబడింది.
దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో కలదు .
ప్రస్తుతం ఈ సంస్థలో సభ్య దేశాల సంఖ్య 153.
ఈ సంస్థ యొక్క ఆశయం వివిధ దేశాల మధ్య వాణిజ్యపరమైన ఆటంకాలను తొలగించి ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం.
18. విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడుల మధ్యగల వ్యత్యాసాలు తెలపండి?
విదేశీ వాణిజ్యం:-
వివిధ దేశాల మధ్య జరిగే ఎగుమతులు ,దిగుమతులు, అమ్మకాలు ,కొనుగోళ్లను ,విదేశీ వాణిజ్యం అంటారు.
విదేశీ వ్యాపారం లో వస్తువులు సేవలు మార్పిడి చేసుకోవడం జరుగుతుంది.
విదేశీ వాణిజ్యం ని పెంచడానికి తగ్గించటానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాల ను (పన్ను))ఉపయోగించవచ్చు.
విదేశీ పెట్టుబడి. :- వివిధ దేశాలు తమ పెట్టుబడులను లాభదాయక కంపెనీలలో పెడతారు. వివిధ దేశాల మధ్య మూలధనం పెట్టుబడి బదిలీ జరుగుతుంది.
19. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడుల లో ముఖ్య ప్రవాహాలను తెలపండి?
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో మనం మూడు ముఖ్య ప్రవాహాలను గమనించవచ్చు.
.వస్తు సేవల ప్రవాహం.
. శ్రమ ప్రవాహం: ఉపాధి వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లడం.
.పెట్టుబడి ప్రవాహం స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూరప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడానికి పెట్టుబడి ప్రవాహం అంటారు
20.అరబ్ వసంతం అనగానేమి?
ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా ,తునీషియా ,ఈజిప్టు ,వంటి దేశాలలో ఉన్న నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటుచేసుకున్నాయి అటువంటి విప్లవాలను ప్రసార మాధ్యమాల్లో "అరబ్ వసంతం "గా పేర్కొన్నారు.
______________________________
"Education is the most power ful weapon which you can use to change the world ".
.🌹🌹🌺🌺🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి