.ఆహారభద్రత.
1.ఆహరదాన్యాలు అంటే ఏమిటీ?
ప్రజలు ఆహారంగా వినియోగించే ధాన్యాలను ఆహార ధాన్యాలు అంటారు .వరి ,జొన్న ,సజ్జలు ,గోధుమలు ,రాగులు పప్పు ధాన్యాలు వంట నూనెలు.మొదలగునవి
2.పోషకాహారం అంటే ఏమిటి?
ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకపదార్థాలను( ప్రోటీన్లు ,కార్బోహైడ్రేట్లు , లిపిడ్స్ ,)అన్నీ కూడా తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని పోషకాహారం అంటారు.
3.ప్రజాపంపిణీ వ్యవస్థ అనగానేమి?
ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించడాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ అంటారు.
4.బపర్ నిల్వలు అనగానేమి?
కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేసి నిలువచేసేఆహారధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు..
5.ఆహారభద్రత అనగానేమి?
ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో 2400 క్యాలరీలు పట్టణాలలో 2100 క్యాలరీలు శక్తినిచ్చే ఆహారం దేశ ప్రజలందరికీ అందుబాటులో అవసరమైన ఆహారధాన్యాలు ఉండగలిగితే అటువంటి దానిని ఆహార భద్రత అంటారు.
6.ఆహార ధాన్యాల లభ్యత ఎలా లెక్క కడుతారు?
సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి (ఉత్పత్తి --విత్తనం, దాన, వృధా)+, నికర దిగుమతులు (దిగుమతులు -- ఎగుమతులు )-ప్రభుత్వ నిల్వలో తేడా సంవత్సరం ముగిసేనాటికి ఉన్న నిల్వలు -ప్రారంభ నిల్వలు.
7.ఆహార. దాన్యాల ఉత్పత్తి పెంచడానికిఎటువంటి చర్యలు చేపట్టాలో పేర్కొనుము ?
వ్యవసాయం లో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం.
మేలుజాతి సంకరజాతి హైబ్రిడ్ విత్తనాలను వాడడం .
రసాయనిక ఎరువుల వినియోగం .
పురుగు మందుల వినియోగం .
సాగునీటి సదుపాయాలు కల్పించడం ఆధునిక యంత్ర సామాగ్రి వాడడం.
చీడపీడలను నివారించడం .
యాంత్రికత వ్యవసాయా సౌకర్యాలను కల్పించడం .
మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడడం
మార్కెట్లో పంటకు సరైన ధర లభించే విధంగా చూడడం .
మధ్యవర్తులను నివారించడం చర్యల ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచవచ్చు
8.ఉత్పత్తి అంటే ఏమిటి?
ముడి సరుకులను ఉపయోగించి ప్రయోజనకరమైన వస్తువులను సేవలను తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటారు.
9.సమతుల ఆహారం అనగానేమి?
ప్రజల ఆహారంలో చిరుధాన్యాలు తృణధాన్యాలు పప్పు ధాన్యాలు వంట నూనెలు కాయగూరలు గుడ్లు పాలు మాంసం విటమిన్లు తో కూడిన ఆహారాన్ని సమతులాహారం అంటారు.
10.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో, ప్రజలు ఎన్ని కాలరీల ఆహారం తీసుకోవాలి?
గ్రామీణ ప్రాంత ప్రజలు ఆహారంలో 2,400 కిలో కేలరీలు పట్టణ ప్రాంత ప్రజలలో ఆహారంలో 2100కిలో కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.
11.భారత దేశం లో ఆహారపదార్థాలు లభ్యత తక్కువగా ఉంది ఎందువల్ల వివరించండి?
11.భారత దేశం లో ఆహారపదార్థాలు లభ్యత తక్కువగా ఉంది ఎందువల్ల వివరించండి?
దేశంలో లో ఆహార ధాన్యాల లభ్యత తక్కువగా ఉండడానికి కారణం రైతులు వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేయడం
ఆహార పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం . పండిన పంటకు ఎగుమతులు సక్రమంగా లేకపోవడం వాణిజ్య పంటల ధరలు తో పోలిస్తే ఆహార ధాన్యాల యొక్క మార్కెట్ విలువ ధాన్యాలు తక్కువ గా ఉండడం.
12.F.C.I. ను విస్తరించుము?
భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
13.కనీస మద్దతుధర (M.S.P)అనగానేమి?
13.కనీస మద్దతుధర (M.S.P)అనగానేమి?
రైతులు పంట వేయకముందే పంటలకు ముందుగా ప్రకటించిన ధరలను కనీస మద్దతు ధరలు అంటారు
14.ఆహర భద్రత చట్టాన్ని వివరించుము?
14.ఆహర భద్రత చట్టాన్ని వివరించుము?
భారత ప్రభుత్వం 2013వ సంవత్సరంలో జాతీయ ఆహార భద్రత చట్టం చేసింది .
ఇది దేశ ప్రజలకు అవసరమైన ఆహారాన్ని పొందే హక్కును కల్పిస్తుంది .
దేశ జనాభాలో 2/3 వంతు ప్రజలకు ఇది వర్తిస్తుంది .
ఇందులో పేదవాళ్లకు సబ్సిడీ ధరలకు 5 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తారు .
గ్రామీణ ప్రాంత ప్రజలలో 75 శాతానికి పట్టణ ప్రాంత ప్రజలలో 50 శాతానికి ఈ ఆహార భద్రత చట్టం వర్తిస్తుంది.
15.I.C.D.S. అనగా నేమి?
15.I.C.D.S. అనగా నేమి?
సమగ్ర శిశు అభివృద్ధి పథకం .
(ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ స్కీం.)
16.ప్రజా పంపిణీ వ్యవస్థ మెగు పరచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వ్యాఖ్యానిoచండి?
16.ప్రజా పంపిణీ వ్యవస్థ మెగు పరచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వ్యాఖ్యానిoచండి?
ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు అన్ని వేళల్లో తెరచి ఉండేలా చూడడం .
రికార్డులు మరియు తూకం సక్రమంగా అమలు అయ్యే టట్లు చూడడం.
నాణ్యత గల వస్తువులను ప్రజలకు పంపిణీ చేయడం .
బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం.
పౌష్టిక ఆహారాన్ని అందించే ఆహార ధాన్యాలను సరఫరా చేయడం ఇలాంటి చర్యలు చేపట్టాలి.
17.జా తీయ పోషకాహార సంస్థ సర్వేలో ఏమి తెలియచేసింది?
దేశంలో ఎక్కువ శాతం మంది పిల్లలు వారి వయసుకు తగిన బరువు లేరు వారికి సరి అయిన పౌష్టికాహారం లభించక తక్కువ బరువు కలిగి ఉన్నారు.
దేశంలోని పిల్లల్లో 45 శాతం బరువు తక్కువ గల పిల్లలు ఉన్నారు .
మరియు 41% పిల్లలలో పోషకాహార లోపానికి గురై వారి శారీరక పెరుగుదల కుచించుకు పోయింది .
21 శాతం మంది పిల్లలు పూర్తిగా బరువు కోల్పోవడానికి సూచిస్తుంది మీరు బక్క చిక్కి పోయారు.
18.N.I.N. ను విస్తరించుము?
(నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ).
జాతీయ పోషకాహార సంస్థ
19.శ రీర బరువు సూచిక (B.M.I.).ను వివరించండి?
19.శ రీర బరువు సూచిక (B.M.I.).ను వివరించండి?
వయోజనులైన స్త్రీ పురుషులలో పోషకాహార స్థాయిని సూచించే సూచిక శరీర బరువు సూచిక బీఎంఐ గా పిలుస్తారు.
పురుషులలో తీవ్ర శక్తి లోపం బిఎంఐ(B.M.I. <18.5) 35% అధిక బరువు/ ఊబకాయం 25 >10% గా ఉంది.
B.M.I.= బరువు కిలోల లో/ మీటర్లలో ఎత్తు
20.ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహారభ ద్రత కు మధ్య గల సంబంధాన్ని వివరించండి?
ప్రజలకు అవసరమైన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయగలిగితే ఆహార భద్రత చేకూరుతుంది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగితే సరఫరా కూడా మెరుగవుతుంది .
సరఫరా పెరగడం వల్ల వస్తువుల యొక్క ధరలు కూడా తగ్గి సామాన్య ప్రజలకు ఆహార భద్రత చేకూరుతుంది.
21.ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహారభద్రత ను కల్పిస్తుందా,? వ్యాఖ్యానించండి?
సామాన్య ప్రజలకు తక్కువ ఆదాయం గల వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరలకు ఆహారధాన్యాలు అందుతాయి .
పేదల లో అత్యంత పేద వారికి కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ పథకం ద్వారా 35 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తున్నారు .కావున పేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ లాభదాయకం .
.పోషకాహార స్థాయిని పేదవారు సాధించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ దోహదం చేస్తుంది ..
భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు పేదరికంలో ఉండడంవల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదవారికి సబ్సిడీ ధర లో ఆహార ధాన్యాలు సక్రమంగా పంపిణీ చేయగలం .
జాతీయ ఆహార భద్రత చట్టం ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కును కూడా కల్పిస్తోంది.
ఇవన్నీ కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారానే ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
22.ఆహారభద్రత గురించి ఒక పోస్టర్ తయారు చేయండి?
23.పోషకాహారం లోపాలను నివారణకు సూచనలను పేర్కొనండి?.
శరీరం అన్ని విధులను నిర్వహించడానికి శక్తిిిిిిి ఎదుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి రోగాలతో పోరాడడానికి మంచి శక్తినిచ్చే ఆహారం కావాలి అందులో లో పిండి పదార్థాలు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజ లవణాలు లభ్యమయ్యే చూడాలి
తక్కువ ధరకు లభ్యమయ్యే ఆకుకూరలు ఎక్కువగా వినియోగించాలి .
చిరుధాన్యాలు రాగుల వినియోగం వల్ల కూడా క్యాల్షియం ఇనుము ఇలాంటి సూక్ష్మపోషకాలు శరీరానికి లభిస్తాయి
24.వ్యవసాయ వైవిధ్యం ద్వారా దేశ ప్రజలకు ఆహారభద్రత కల్పించ వచ్చా వివరించండి?
24.వ్యవసాయ వైవిధ్యం ద్వారా దేశ ప్రజలకు ఆహారభద్రత కల్పించ వచ్చా వివరించండి?
వ్యవసాయ వైవిద్య కరణ ఆహారధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది రైతులు వాణిజ్య పంటలకు లేదా ఆహారేతర పంటల కు వనరులను మళ్లించడం ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే భారతదేశ ఆహారధాన్యాల తలసరి లభ్యత తగ్గుతూ ఉండటం ఆహార భద్రత విషయంలో ఆందోళన కలిగించే విషయం .సరైన ప్రణాళికల ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తి తో పాటు వినియోగాన్ని పెంచే లా మన విధానాలు ఉండాలి .
అప్పుడే వ్యవసాయ రంగం కాపాడుకోవడం తోపాటు ఆహార భద్రతను కూడా కల్పించ వచ్చు .
****
A.జాతీయ ఆహార భద్రత చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
2013వ సంవత్సరం .
B.జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది ?
హైదరాబాద్.
C.అంత్యోదయ కార్డులు గలవారికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తుంది ?
.
35 .Kgs
D. స్త్రీలు ,పురుషుల,పోషకాహార స్థాయిని కొలిచే సూచిక ఏది ?
శరీర బరువు సూచిక.(B.M.I. బాడీ మాస్ ఇండెక్స్).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి