Translate

30, అక్టోబర్ 2020, శుక్రవారం

ఉత్పత్తి -- ఉపాధి

  1. ఉత్పత్తి ---ఉపాధి. 
ప్రశ్నలు సమాధానములు .


.1.ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఏవి?

ఆర్థిక వ్యవస్థలో రంగాలను మూడు రకాలుగా విభజించారు. 1 ప్రాథమిక రంగం.
 2 పారిశ్రామిక రంగం 
3 సేవా రంగం .

 2.స్థూల జాతీయోత్పత్తి అనే భావనను వివరించండి ?

ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తువుల సేవల విలువను లెక్క కట్టడాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు.


 3. అంత్య వస్తువులు అనగా నేమి ?

పూర్తిగా తయారయ్యి వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంత్య వస్తువులు అం టారు.

4.ప్రాథమిక రంగం అనగా నేమి? 

వ్యవసాయం దాని అనుబంధ రంగాలను కలిపి ప్రాథమిక రంగం అంటారు.

 .5.పారిశ్రామిక రంగం అనగానేమి ?

యంత్రాలను ఉపయోగించి వస్తువులను తయారుచేసే రంగాన్ని పారిశ్రామిక రంగం అంటారు.

6. సేవా రంగం అనగానేమి?

 వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను అందించే రంగాన్ని సేవా రంగం అంటారు ఉదా బ్యాంకులు, రైల్వేలు , విద్య వైద్యం, భీమా సంస్థలు, బీమా సంస్థలు మొదలగునవి .

7.వినియోగ వస్తువుల కు రెండు ఉదాహరణలు ?

వినియోగ వస్తువుల కు ఉదాహరణలు బియ్యం సైకిల్ పెన్ను పుస్తకం కారు మొదలగునవి .

8.ఉత్పాదక వస్తువులకు రెండు ఉదాహరణలు? 

ఉత్పాదక వస్తువులకు ఉదాహరణలు ట్రాక్టరు వ్యవసాయ పంపుసెట్లు మోటార్లు. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తికి దోహదం చేయును.

9.మాధ్యమిక వస్తువులు అనగా నేమి ?

పూర్తిగా తయారుకాని లేదా వినియోగానికి వీలుగా లేక ఉత్పత్తి మధ్యలో ఉండే .వస్తువులను మాధ్యమిక వస్తువు అని అంటారు


10.వ్యవస్థీకృత రంగం అనగానేమి ?

స్థిరమైన ఉపాధిని కల్పించే రంగాన్ని వ్యవస్థీకృత రంగం ఉంటారు ఈ రంగంలో క్రమపద్ధతిలో విధానాలు ,నిర్ధారిత పని గంటలు ,ఉద్యోగ భద్రత ,వంటివి  ఉంటాయి

11.అవ్యవస్థీకృత రంగం అనగానేమి?

అస్థిరమైన ఉపాధిని కల్పించే రంగాన్ని అవ్యవస్థీకృత రంగం అంటారు. ఇందులో లో ఉద్యోగలకు నియమ నిబంధనలు కానీ, ఉద్యోగ భద్రత గాని ,క్రమబద్ధమైన విధానాలు గాని ఉండవు.

12.అల్ప ఉపాధి అనగానేమి?

 సామర్థ్యానికి తగ్గ పని లభించని స్థితిని అల్ప ఉపాధి అంటారు.
Ex.. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి వ్యవసాయం చేయడం.

 13.ప్రచ్ఛన్న నిరుద్యోగం అనగా నేమి?

 అవసరాని కంటే  అధిక శాతం మంది శ్రామికులు పనిచేసే స్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.
Ex. భారత దేశ వ్యవసాయ రంగంలో ప్రత్యేక నిరుద్యోగం అధికం.

 14.స్థూల దేశీయోత్పత్తిలో వస్తున్న నా మార్పులను రంగాల వారీగా వివరించండి ?

భారతదేశంలో లో జాతీయ దేశీయోత్పత్తి ని మూడు భాగాలుగా  లెక్కించడం జరుగుతుంది . 1.ప్రాథమిక రంగం 2.పారిశ్రామిక రంగం 3.సేవా రంగం.
ప్రాథమిక రంగం లో 1972 -73 సంవత్సరంలో 43% ఆదాయం రాగా 2011వ సంవత్సరం నాటికి 16 %శాతానికి ఆదాయం   తగ్గిపోయింది. పారిశ్రామిక రంగంలో 71 -72 సంవత్సర కాలంలో 23% ఆదాయం  రాగా 2011 సంవత్సరం నాటికి 26% శాతానికి పెరిగింది .  సేవారంగం వాటా 71 -72 సంవత్సరం లో 35% శాతం నుండి ఇ
2011నాటికి58 %శాతానికి పెరిగింది. ఈ విధంగా  వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గి ,పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరిగింది.

12, అక్టోబర్ 2020, సోమవారం

2 అభివృద్ధి భావనలు

2 .అభివృద్ధి భావనలు. 

ప్రశ్న సమాధానాలు.

1.తలసరి ఆదాయం అనగానేమి ?

Ans.

 జాతీయ ఆదాయాన్ని దేశం  యొక్క జనాభా చే భా గి స్తే వచ్చేది ఆదేశ తలసరి ఆదాయం.

2.మానవ అభివృద్ధి అనగానేమి ?

ans.

తలసరి ఆదాయం, జీవన ప్రమాణం, అక్షరాస్యత ,ప్రజారోగ్యం, జీవన ప్రమాణం శిశు మరణాలు . జనన రేటు వంటి అంశాలలో ప్రగతి సాధించడాన్ని మానవాభివృద్ధి అంటారు.

3.ప్రజా సదుపాయాలు వివరించుము?

Ans.

ప్రజలు జీవించడానికి అవసరమైన  వస్తు సేవలు , భౌతిక సేవలు ,ప్రజా ఆరోగ్య సేవలు, మౌలిక వసతులు ,విద్యా సౌకర్యాలు, వంటివి ప్రజా సదుపాయా లు అంటారు.

4. అభివృద్ధి  అనే భావనను వివరించండి?

Ans.

అభివృద్ధి అనేది  ఒక భావన దీనిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. దేశంలో లోప్రజలు  సామాజిక ,ఆర్థికంగా ,రాజకీయ పర్యావరణ సంబంధిత అంశాలలో ప్రగతి సాధించడాన్ని. అభివృద్ధి అంటారు.


5 జాతీయ ఆదాయం అనే భావనను వివరించండి ?

Ans.

ఒక దేశంలో లో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంత్య వస్తు సేవల వస్తువు యొక్క విలువని ఆదేశ జాతీయాదాయం అంటారు.?

         (or)

దేశ ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం అంటారు.

6.అక్షరాస్యత శాతం అనగా నేమి ?

ans. 

దేశ జనాభాలో ఏడు సంవత్సరాలు అంతకుమిం

చి వయసు ఉన్న వాళ్ళలో అక్షరాస్యతను తెలిపేది అక్షరాస్యత శాతం అంటారు.

7.సుస్థిర అభివృద్ధి అనగానేమి?

Ans.

భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతినకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు.

8.లింగ వివక్షత అనగానేమి ?

Ans.

సమాజంలో పురుషులు స్త్రీలను చిన్న చూపు చూడడాన్ని లింగ వివక్షత అంటారు.

9.లింగ నిష్పత్తి అనగానేమి ?

ans.

దేశ జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసే దానిని లింగ నిష్పత్తి అంటారు.

10.ఆయు :ప్రమాణం అనగానేమి?

Ans.

 వ్యక్తి యొక్క జీవించే సగటు జీవన కాలాన్ని తెలియ చేసేదానిని ఆయు: ప్రమాణం అంటారు.

 11.శిశు మరణాల రేటు ఉ అనగానేమి ?

Ans.

సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది మరణిస్తున్నారు తెలియజేసే దానినే "శిశు మరణాల రేటు "అంటారు.


 12.హిమాచల్ ప్రదేశ్ పాఠశాల విద్యా విప్లవం పై మీ అభిప్రాయం ను వివరించుము ?

Ans.

*పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా  ప్రభుత్వం చూసింది .విద్యార్థులకు కు ఉపాధ్యాయులకు తరగతి గదులు, మరుగుదొడ్లు , త్రాగు నీరు, ఆటస్థలం, వంటి కనీస సదుపాయాలు ఉండేలా చేశారు .

ఉపాధ్యాయుల నియామకం క్రమం తప్పకుండా చేశారు .

ప్రభుత్వం తన బడ్జెట్ లో సగటు విద్యార్థి పై సుమారు 2005వ రూపాయలు ఖర్చు పెడుతూ పాఠశాల మెరుగైన సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేసింది. ఈ వసతులు వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా సంతోషదాయకం పాఠశాలలో చదువు నేర్చుకోవడం జరిగింది.

 ఈ నమూనాను అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తే దేశ విద్యాభివృద్ధిలో గణనీయమైన మార్పులు వస్తాయి.

13.  దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు యొక్క ప్రామాణికాలు ఏవి?

Ans.


ప్రపంచ బ్యాంకు 2017వ సంవత్సరంలో అమెరికా కరెన్సీ డాలర్ ను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ దేశాలను మూడు రకాలుగా వర్గీకరించింది.

  అవి ఏవి అనగా 

1.అధిక ఆదాయ దేశాలు(or) ధనిక దేశాలు . ఏ దేశ తలసరి ఆదాయం అయితే 12055 అమెరికా డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న దేశాలు ధనిక దేశాలు.

2.మధ్య ఆదాయ దేశాలు .

ఆదాయం 12054 అమెరికా డాలర్ల నుండి 996 అమెరికా డాలర్ ల మధ్య ఆదాయం ఉంటే ఆ దేశాలను మధ్య ఆదాయ దేశాలు అంటారు.

3.తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు.

ఏ దేశ తలసరి ఆదాయం 995 అమెరికా డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉంటే ఆదేశాలను పేద దేశాలు లేదా తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు అని ప్రపంచ బ్యాంకు ప్రామాణిక రించింది.

14.లింగ వివక్షత ను రూపుమాపడానికి నీవు ఇచ్చే సూచనలు ఏమిటి?

Ans.

భారతదేశం తరతరాలుగా పురుషాధిక్య సమాజం నెలకొని ఉంది .కాబట్టి మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

 మహిళలకు అన్ని రంగాలలో విద్య వైద్యం రాజకీయం ఆర్థిక సామాజిక రంగాలలో సమానత్వ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలి .

బాలికలకు విద్య అవకాశాలను మెరుగుపరచాలి .

పౌష్టికాహారాన్ని అందజేయాలి.

 శిశు సంరక్షణ చర్యలను చేపట్టాలి .

మహిళలకు ప్రత్యేకించి వైద్యరంగంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి .

తల్లిదండ్రులు బాల బాలికలను సమానంగా చూడాలి.

కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

 గృహ హింస చట్టాలను మరింత కఠినం చేయాలి .

పనిచేసే ప్రదేశాలలో ఇబ్బందులు ఎదురు కాకుండా సరైన సదుపాయాలు కల్పించాలి.

15. మానవ అభివృద్ధిని కొలవటానికి మీ దృష్టిలో ఇంకా ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?

Ans.

మానవ అభివృద్ధి ని కొలవడానికి తీసుకోవలసిన అంశాలు 1 వాస్తవిక తలసరి ఆదాయం .2విద్య వైద్యం pఆరోగ్యం .

3ఆయు ప్రమాణం 4.పర్యావరణం సాంకేతిక అభివృద్ధి.

5 జీవన ప్రమాణాలు 6.పంపిణీలో సమన్యాయం 7.సామాజిక న్యాయం .

8 రవాణా వ్యవస్థ ,విద్యుత్ సౌకర్యం త్రాగునీరు ,సాగునీరు,  మౌలిక వసతులు బ్యాంకులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు .మొదలగునవి.

16.కుడంకులం అను విద్యుత్ ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు ఎందువల్ల?

1.స్థానికులకు జీవన ఉపాధి కోల్పోతామని భయం .

2.పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని భావన .3.రేడియోధార్మిక పదార్ధాలు  వెలువడుతాయి . ఈ పదార్థాలు  జీవావరణ వ్యవస్థ కు  నష్టాన్ని కలుగజేస్తాయి..

5.ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోకపోవడం .అను విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం . 

6.అనేక దేశాలలో జరిగిన అను విద్యుత్ ఉత్పత్తి లో జరిగిన దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకోకపోవడం

7.తీర ప్రాంత రక్షణ భద్రత పర్యావరణ అంశాలు పరిగణలోకి తీసుకోకపోవడం ఈ కారణాల చేత స్థానిక ప్రజలు భయాందోళనకు లోని లోనై విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకించారు.



ప్రపంచ యుద్ధాలు -ప్రపంచం

ప్రపంచ యుద్ధాలు --ప్రపంచం .

1.రష్యన్ విప్లవం సమాజంలో లో తెచ్చిన మార్పులు ఏమిటి వివరించండి?

భూస్వాములు రాజులు పెట్టుబడిదారులు దోపిడీదారులు లేని దేశం అన్ని నిర్మించడం  లక్ష్యంగా కార్యక్రమం  మొదలయ్యింది

.ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

 ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు .

 భూముల అన్నింటిని జాతీయం చేసి పంచి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు .

బ్యాంకు జాతీయకరణ వంటి చర్యలను సోవియట్ లో డిమాండ్ చేశారు .

1924లో యు ఎస్ ఎస్ ఆర్  ఏర్పాటు చేసుకున్నారు.

 ఉమ్మడి క్షేత్రాలలో వ్యవసాయానికి  నిర్ణయం అందరూ కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తిని పంచుకునేవారు.

అందరికీ అక్షరాస్యత ప్రాథమిక విద్యను అందించే ప్రయత్నం మొదలయ్యింది .

మహిళా కార్మికుల సంక్షేమం కోసం ఫ్యాక్టరీలలో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు .

తక్కువ ఖర్చుతో ప్రజారోగ్యం సంక్షేమ కార్యక్రమాలు గృహవసతి కార్మికుల కు కార్మికులకు ఏర్పాటు చేశారు.

2.ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి పాత్రను పేర్కొనండి?

ప్రపంచ దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి తీవ్రంగా గా కృషి చేస్తోంది.

సూయజ్ కాలువ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించింది.

 భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ నివారణకు తీవ్రంగా కృషి చేస్తోంది .

గ్రీక్ టర్కీ దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేసింది.

 ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించింది .

కువైట్ ను స్వాతంత్రం పొందేలా కృషి చేసింది .

నమీబియా దేశం స్వాతంత్ర్యం పొందడానికి సమితిలో సభ్యత్వం పొందడానికి కృషి చేసింది.

 ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య వివాదాన్ని పరిష్కరించింది.

 ప్రత్యేకించి మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా నివారించగలుగుతుంది .

అంతేకాకుండా మానవతా దృక్పథంతో వివిధ అంతర్జాతీయ సంస్థల ద్వారా విద్య, వైద్య ,పేదరిక ,కార్మిక సమస్యల పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించింది.

3.తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిణామాలను తెలపండి ?

తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల కర్మాగారాలు మూతబడి లక్షలాది కార్మికులు  తమ ఉపాధి ఉద్యోగ అవకాశాలను కోల్పోయారు .

 కర్మాగారాలు మూతపడడంతో తమ ఉత్పత్తులకు  డిమాండ్ లేక వేలాది మంది రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.

కరెన్సీ విలువ పడిపోవడంతో మధ్య తరగతి ప్రజలు ఉద్యోగస్తులు పింఛనుదారులు సమస్యలు ఎదుర్కొన్నారు .

వ్యాపారస్తులు తమ వ్యాపారాలు దెబ్బతినడంతో తమ ఉపాధిని కోల్పోయారు .

స్వయం ఉపాధి ఉన్న వాళ్లు కూడా ఎన్నో కష్టాలకు లోనయ్యారు .

కార్మికుల పరిస్థితి దారుణంగా తయారయింది .

ఉన్నత వర్గాల వారు తాము కూడా పేద వారిగా  మారుతామని భయపడ్డారు.

 మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

 ఆర్థిక సంక్షోభం ప్రజలకు తీవ్ర ఆందోళనలను కలిగించింది..

4.ఐక్యరాజ్యసమితి   ప్రపంచ ప్రభుత్వం లాంటిది అని తెల్పు నాలుగు సిద్ధాంతాలను వివరించండి?

ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్ప డింది.

1. ప్రపంచ శాంతిని నెలకొల్పటం.

 2 మానవ హక్కులను కాపాడటం .

3 అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం.

 4 సామాజిక ప్రగతికి ప్రోత్సహించటం.

ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఐక్యరాజ్యసమితి అనేక అంతర్జాతీయ సంస్థలు అనుబంధంగా ఏర్పాటు చేసింది .

అందులో   యూనిసెఫ్ (U N I C E F 0,)యునెస్కో. (U N E S C O.) డబ్ల్యు.హెచ్.ఓ.W H O 

 ఐ ఎల్ ఓ (I L O. )ఇలాంటివి ప్రధానమైనవి.

5.శాంతిని పెంపొందించే నినాదాలను పేర్కొనండి?

యుద్ధం వద్దు _శాంతి ముద్దు.

పోరు నష్టం_ పొందు లాభం.

6 ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి?

1.సాధారణ సభ( జనరల్ అసెంబ్లీ)

2. భద్రతామండలి (సెక్యూరిటీ కౌన్సిల్)

3. ఆర్థిక  మరియు సామాజిక మండలి (ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ )

4.ధర్మకర్తృత్వ మండలి (ట్రస్ట్ షిప్ కౌన్సిల్ )

5.అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ జస్టిస్)

6. సచివాలయం (సెక్రటరియేట్).

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు.

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్U.N.I.C.E.F.

 యునైటెడ్  నేషన్స్ ఎడ్యుకేషన్  అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ .U.N.E.S.C.O.

 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.W.H.O.

 ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్.F.A.O.

అంతర్జాతీయ కార్మిక  సంస్థ I.L.O.

ప్రపంచ  వాతావరణ  సంస్థI.M.O.

 విశ్వ  తపాలా  సంఘం U.P.U.

అంతర్జాతీయ  atomic శక్తి  సంస్థ I.A.E.A .etc.

5, అక్టోబర్ 2020, సోమవారం

ప్రపంచ యుద్ధాలు-- ప్రపంచం

ప్రపంచ యుద్ధాలు-- ప్రపంచం.
ప్రశ్నలు సమాధానములు.

1. ఆయుధ పోటీ అనగానేమి?

ప్రపంచంలోనే వివిధ దేశాలు ఆయుధాల ఉత్పత్తిలో పోటీపడి ఆయుధాలు తయారు చేయడాన్ని ఆయుధ పోటీ అంటారు.

2. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?

ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ అతని సతీమణి సోఫియా  ను బోస్నియా రాజధాని అయిన సరయివో  లో సెర్ప్ యువకుడు దంపతులిద్దరి ని కాల్చిచంపాడు.
 ఈ హత్యకు కారణం సెర్బియా నేనని 48 గంటల లోపు సమాధానం ఇవ్వాలని ఆస్ట్రియా ఆదేశించింది .
కానీ సెర్బియా సమాధానం ఇవ్వలేదు.
 దీంతో 1914 జూలై 28 న సెర్బియా పై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది.
ఫెర్డినాండ్ హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం అయ్యింది.

3.కేంద్ర  రాజ్యాలు ఏవి ?

జర్మనీ    ఆస్ట్రియా  ఇటలీ..

4.మిత్ర రాజ్యాలు లు ఏవి?

ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ,రష్యా ,అమెరికా.

5. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణాలు  ఏవి?

1.వర్సైల్స్ సంధి లోని అవమానకరమైన షరతులు.
 2.జర్మనీ తన గత వైభవాన్ని సంపదను కోల్పోవడం. 
3.జర్మనీ రెండు భాగాలుగా విడిపోవడం.
4 జర్మనీ ఆర్థికంగా సైనికంగా బలహీన పడడం వంటి కారణాల వల్ల జర్మనీ తిరుగుబాటు చేసింది.
 
6. వర్సైల్స్ సంధి షరతులు ఏవి?

1. ప్రాదేశిక ఏర్పాట్లు .
జర్మనీ ఆల్ సై సె   లో రైన్ ప్రాంతాలను ప్రాన్స్ కు అప్పగించడం.

2సైనిక పరమైన నిబంధనలు .

జర్మనీ దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ రద్దు చేయటం.
 యుద్ధ సామాగ్రి యుద్ధం పై పై పరిమితులు విధించడం .
చిన్న నౌకా దళం ఏర్పాటు.

3.ఆర్థిక పరమైన నిబంధనలు. 

యుద్ధ నష్ట పరిహారానికి సంబంధించిన ఏర్పాట్లు. చేయడ0.
 ఆయుధాలు లేకుండా చేయడం
..
రాజకీయపరమైన పునః పరిష్కారం .
నానాజాతి సమితి ఏర్పాటు వంటివి .

7. నానాజాతి సమితి లక్ష్యాలు వివరించుము?

 1అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడడం .

2.వివిధ దేశాల మధ్య స్నేహ పూర్వక సహకారాన్ని పెంపొందించడం.

3 నిరాయుధీకరణ చేపట్టడం .

4.అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం .

5.అంతర్జాతీయ అనుసరించి న్యాయాన్ని అందించడం


.8. నానాజాతి సమితి వైఫల్యాలకు 2 కారణాలు రాయండి?

1 అగ్రదేశాలు సభ్యులుగా లేకపోవడం.
 2.సభ్య దేశాలు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడం.3
 3.జర్మనీ జపాన్ ఇటలీ లను ఇతర దేశాలపై యుద్ధం చేయకుండా నివారించ లేకపోవడం. 4.మంచూరియా భూభాగాన్ని ఖాళీ చేయమని ఆదేశాలను జారీ చేస్తే జపాన్ పట్టించుకోకపోవడం.
 ఈ కారణాలు సమితి వైఫల్యానికి దారితీశాయి

9.జార్ లు అనగా ఎవరు?

Ans.
 రష్యాను పరిపాలించిన రాజులను జార్ లు అంటారు.

10న్యూ డీల్ విధానం అనగా నేమి ?

Ans.
అమెరికా అధ్యక్షుడు అయినా రూజ్వెల్ట్ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాన్ని నూడిల్ అంటారు

1.1.రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణాలు ఏవి ?

●హిట్లర్ పోలెండ్ పై దాడి చేయడం
●జర్మనీని రెండు భాగాలుగా విభజించడం .●డాన్ జింగ్ ఓడరేవును అంతర్జాతీయం చేయడం. 

12.మార్షల్ ప్రణాళిక అనగా నేమి?
Ans.

 అమెరికా చేపట్టిన ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం ఇది ఇది ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టిన కార్యక్రమo. 

13. మాల్తోవు ప్రణాళిక అనగా నేమి?

Ans. 
అమెరికా చేపట్టిన మార్షల్ ప్రణాళిక కు వ్యతిరేకంగా రష్యా చేపట్టిన ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ. ఈయన రష్యా విదేశాంగ మంత్రి .

14. ఫిబ్రవరి విప్లవం అంటే ఏమిటి ?
 ans.

1917 మార్చి 15 నా విప్లవకారులు రష్యా జార్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు .ఈ విప్లవాన్ని..ఫిబ్రవరి లేదా( మార్చి)విప్లవం అంటారు. ఎందుకనగా రష్యా క్యాలెండర్ అంతర్జాతీయ క్యాలెండర్ కు 13 రోజులు ముందు ఉంటుంది.

15. అక్టోబర్ విప్లవం అనగా నేమి ?

1917 nov . లో లెనిన్ నాయకత్వంలో రష్యాలో చేసిన తిరుగుబాటును అక్టోబర్ విప్లవం అంటారు.

Cont...nxt

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

ప్రపంచ యుద్ధాలు ప్రపంచం

ప్రపంచ యుద్ధాలు ప్రపంచం ప్రశ్నలు సమాధానాలు

1 సైనికవాదం అనగా నేమి?
Ans.

భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మడానికి సైనికవాదం అంటారు.

2. నాజీజం అనగా? 
Ans.

జాతీయత వాదం అనే భావజాలం ఆధారంగా హిట్లర్ జర్మనీలో కొనసాగించిన విధానాలను నాజీజం అంటారు ఇది ఇది తమ జాతి పట్ల గర్వాన్ని ఇతర జాతుల పట్ల దేశాన్ని కలిగించింది. 
                Or
జర్మనీలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ విస్తరింపజేసిన భావజాలాన్ని నాజీయిజం అంటారు .


3. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అనగా నేమి?

Ans.

 పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పరిశ్రమలను స్థాపించి ఉత్పత్తి సరఫరా సేవలను అధికంగా లాభాలు ఆశించే ఉద్దేశంతో నిర్వహించే విధానాన్ని పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ఉంటారు.

4. సోషలిజం (సామ్యవాదం) అనగా నేమి?.
Ans.

పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల ఏర్పడిన (సామాజిక  రాజకీయ ఆర్థికఅక్రమాలు))అసమానతలకు వ్యతిరేకంగా ఏర్పడింది సోషలిజం.
సమ సమాజాన్ని స్థాపించడమే సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం.

5.  కమ్యూనిజం అనగా నేమి?
Ans.

సామ్యవాదం లో కమ్యూనిజం ఒక ఒక భాగం లక్ష్య సాధనకు విప్లవ మార్గాన్ని హింసా పద్ధతులను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం.

7. ఫాసిజం అనగానేమి?
"Ans.

"పాసియో ""  అనే  రోమన్ పదం నుంచి  ఫాసిజం  అనే పదం  ఏర్పడింది  ఫాసిజం అనగా  కడ్డీల కట్ట  లేదా  కట్టెలమోపు  అని అర్థం ఇది . దీనిని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు .ఇది ఇటలీలో  ముస్సోలిని  నాయకత్వంలో  ఏర్పడిన  పార్టీ .

8.విప్లవం అనగా నేమి?
Ans.

మార్పు విప్లవం అనగా మార్పు.
 శాంతియుత పద్ధతుల ద్వారా గాని హింసాయుత పద్ధతుల ద్వారా గాని సమాజంలో లో జరిగే మార్పును విప్లవం అంటారు.

 9.సామ్రాజ్య వాదం అనగా నేమి?

వలసరాజ్యాల స్థాపనలో ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన విభేదాలను సామ్రాజ్య వాదం అంటారు.

10. దురహంకార పూరిత జాతీయత వాదం అనగా నేమి?
Ans.
 స్వ జాతి పట్ల గర్వాన్ని ఇతరుల (జాతులు) పట్ల  ద్వేషాన్ని  కలిగి ఉండడాన్ని దురహంకార పూరిత జాతీయవాదం అంటారు.

11. బోల్షివిక్   అనగా   ఎవరు?
Ans.
రష్యాలో శ్రామిక నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అనుకున్నవారు బోల్షివిక్ లు.

12. ప్రజాస్వామ్యం అనగానేమి?
Ans.

ప్రజల చేతిలో అధికారం ఉండే ప్రభుత్వ వ్యవస్థను ప్రజాస్వామ్యం అంటారు.

13. ఆర్థిక మాంద్యం అనగా నేమి?
Ans.
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పడిపోయి ఆర్థిక వ్యవస్థ క్షీణించిన పరిస్థితిని ఆర్థిక మాంద్యం అంటారు.

14.    త్రీ రాజ్య సంధి ఏ ఏ దేశాలు కుదుర్చుకున్నాయి?
Ans.

జర్మనీ , ఆస్ట్రియా ,ఇటలీ .దేశాలు సైనిక ఒప్పందం కుదుర్చుకున్నాయి . వీటినే తర్వాత కేంద్ర రాజ్యాలుగా వ్యవహరించారు.

15.ట్రై పాక్షిక ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది?

 ఇంగ్లాండ్  ఫ్రాన్స్ రష్యా ,దేశాల మధ్య జరిగింది వీటిని తర్వాత మిత్ర రాజ్యాలు వ్యవహరించారు.


16. బాల్కన్ రాజ్యాలు ఏవి ?

బోస్నియా ,సెర్బియా ,రొమేనియా, అల్బేనియా మాంటెనెగ్రో  లు బాల్కన్ రాజ్యాలు. ఇవి టర్కీ సుల్తాన్ ఆధ్వర్యంలో ఉండేవి.

Cont..

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

భారతదేశం భౌతిక ఆమరిక

భారతదేశం భౌతిక అమరిక.

1 భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది?

== భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చింది.

2 ఇండియా అనే పదానికి మూలమైననది మూలమైన నది ఏది

సింధూ నది దీనిని ఆంగ్లంలో ఇండస్ నదిగా పిలుస్తారు ఇండస్ నది ప్రాంతంలో నివసించే ప్రజలను గ్రీకులు  ఇండో యి గా పిలుస్తారు.

3. భారత కాలమాన రేఖ ఏది?

821/2° తూర్పు రేఖాంశము దీనినే ఇండియన్ స్టాండర్డ్ టైం [ఐ ఎస్ టి.]

4. గ్రీనిచ్ భారత కాలమానానికి గల వ్యత్యాస సమయం.

☆  5 గంటల 30 నిమిషములు ముందు

5 భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయం సంభవించే రాష్ట్రం

☆  అరుణాచల్ ప్రదేశ్

6. భారతదేశంలో సూర్యోదయం ఆలస్యంగా సంభవించే రాష్ట్రం

☆ గుజరాత్

7. హిమాలయ రాజ్యం అని దేనిని పిలుస్తారు

 ☆నేపాల్

8. భారత్-చైనా మధ్య గల సరిహద్దు రేఖ

☆ మెక్ మోహన్ రేఖ

9.  ఇండియా పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ  

☆రెడ్ క్లిప్ రేఖ

10. ఇండియా శ్రీలంక మధ్య గల జలసంధులు

☆ పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ

11. మినికాయ్ దీవి ఏ డిగ్రీ ఛానల్ మధ్య కలదు 

☆8 డిగ్రీలు 

12.భారతదేశం శ్రీలంకల మధ్య గల దీవి దీవి

 పాంబన్ దీవి.

13.భారత దేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు 

1 పాకిస్తాన్ 2ఆఫ్ఘనిస్తాన్  3.చైనా నా 4.నేపాల్  5.భూటాన్ట  6.బంగ్లాదేశ్ 7.మయన్మార్



8, జనవరి 2020, బుధవారం

21.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.( ప్రశ్నల నిధి.)

.
1. పోలీస్ చర్య అనగా నేమి?

2. ముల్కీ నిబంధనలు తెలుపండి?

3.రజాకార్లు  దుశ్చర్యలు  వివరించండి?

4.భారత దేశం లో హైదరాబాద్ రాష్ట్ర కలయిక ఎలా జరిగింది  ?పేర్కొనండి?

5.తెలంగాణ సమాజ, భౌగోళిక, చారిత్రక నేపథ్యం  గురించి  వ్యాఖ్యానించండి?

 6.పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు వివరించండి?

జవాబు.  పరిపాలన పై ఖర్చును రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి తెలంగాణలోని రెవిన్యూ తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టాలి.

2. తెలంగాణలో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి.

3. 12 సంవత్సరాల పాటు తెలంగాణలో నివసిస్తే విద్య ఉద్యోగాలకు అర్హత నిచ్చే ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి నిబంధనలు కొనసాగించడానికి అంగీక రించారు.

4. తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభలో 20 మందితో కూడిన చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

5. తెలంగాణ వ్యవసాయ భూమి అమ్మకాన్ని ప్రాంతీయ సంఘం నియంత్రించే విధంగా ఏర్పాట్లు చేశారు .

6.ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40 శాతం సభ్యులు తెలంగాణ నుంచి 60 శాతం మంది ఆంధ్రా నుండి ఉండే విధంగా ఏర్పాటు చేశారు.
 
7.ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఉండే విధంగా ఏర్పాటు చేశారు.


7.పెద్ద మనషుల ఒప్పందం లో పాల్గొన్న తెలంగాణ వ్యక్తులు  తెలుపండి?

8.తెలంగాణ లోని రైతులు  సమస్యలు పేర్కొనండి?

9.తెలంగాణ లో అక్షరాస్యత  తక్కువుగా ఉండటానికి గల కారణాలు ఏమిటి?

10. స్థూల సాగు విస్తీర్ణం అనగానేమి?

11. తెలంగాణ నీటి వనరులు పు నరుద్ధరణ కు  నీ సూచనలు ఏమిటి?

12.తెలంగాణ ఉద్యమం లో వివిధ కార్యక్రమాలు తెలపండి?

13.తెలంగాణ రాష్ట్ర సాధన లో తెలంగాణ రాష్ట్ర సమితి కృషి ని వివరించండి?

14.తెలంగాణ ఉద్యమం లోని నిరసన రూపాలు వ్రాయండి?

15.తెలంగాణ సాధన లో జె ఏ సి,మరియు రాజకీయ పార్టీల పాత్రలను వివరించండి?

 16.తెలంగాణ పటం గీసి  క్రింది వాటిని గుర్తించండి?

1.వనపర్తి,2.భద్రాద్రి3.సిరిసిల్ల.4.నిర్మల్. 5.కొమురంభీమ్. 6.హైదరాబాద్    7.వరంగల్ 8.సిద్ధిపేట.
💐💐💐💐💐💐💐💐.

20. 💐 సమకాలీన సామాజిక ఉద్యమాలు..💐 ప్రశ్నల నిధి.

             💐ప్రశ్నల నిధి.💐
=======================

1.పౌర హక్కుల ఉద్యమం అనగానేమి?

2.అర్థవలస దేశాలకు ఉదా .లివ్వండీ?

3.అమెరికా లో పౌర హక్కుల ఉద్యమం గూర్చి వివరించండి?

4.ఆఫ్రో-అమెరికన్లు (or)నల్ల జాతి అమెరికన్లు  ప్రధాన డిమాండ్ లు ఏమిటి?

5.U.S.S.R. లో మానవ హక్కుల ఉద్యమం
గురించి  పేర్కొనండి?

6.అణు, యుద్ధ వ్యతిరేక ఉద్యమo యొక్క ఫలితాలు వివరించండి?

7.S.A.L.T.  విస్తరించుము?

8.S.T.A.R.T. ను విస్తరించుము?

9.చేర్నో బిల్ అణు ప్రమాదం ఫలితాలు ఏమిటి?

10.నయా ఉదారవాదం  అంటే ఏమిటి?

11.గ్రీన్ పీస్ ఉద్యమం అంటే ఏమిటి?

12.గ్రీన్ పీస్ ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటీ?

13.గ్రీన్ పీస్ ఉద్యమం ఏ భావనను ముందుకు తెచ్చింది?

14.భోపాల్ గ్యాస్ దుర్ఘటన  ప్రభావం ను వివరించండి?

15.నర్మదా ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటీ? వివరించండి?

16.సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్  ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

17. సై లెంట్ వ్యాలీ ఉద్యమం గురించి వ్యాఖ్యానించండి?

18.సామాజిక న్యాయం, మానవ హక్కుల ఉద్యమాల లో మహిళల పాత్ర గురించి వ్యాఖ్యానించండి?

19.మణిపూర్ చారిత్రక నేపథ్యం ను పేర్కొనండి?

20.మైరా పైబీ ఉద్యమం గురించి  వివరించండి?

21.సామాజిక ఉద్యమాలలోని సారూప్య అంశాలు తెలుపండి?

22.మైరా పైబీ అనగా?

23.సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏమి తెలియచేస్తుంది?

24.మానవ హక్కులు గురించి  తెలిపే ఏ వై నా రెండు అధికరణలు  వ్రాయండి?.
💐💐💐💐💐💐💐💐💐


19 .ప్రపంచ యుద్దాల తర్వాత ప్రపంచం , భారతదేశం.

ప్రశ్నల నిధి.

1.N. A. T. O. ను విస్తరించుము?

2.S.E.A.T.O.  ను విస్తరించుము?

3.C.E.N.T.O. ను విస్తరించుము?

4. సై నిక ఒప్పందం అనగానేమి?

5.P.L.O. ను విస్తరించుము?

6.పరోక్ష యుద్ధం అంటే ఏమిటి?

7.ప్రచ్ఛన్న యుద్ధం అనగానేమి?

8.అలీ న విదానం అంటే ఏమిటి?

9.వీటో అనగానేమి?


10. వలస పాలన నుండి విముక్తి అంటే ఏమిటి?

11.(U. N. O). ఐక్యరాజ్య సమితి లో  శాశ్విత సభ్య దేశాలు ఏవి?

12. ఐక్యరాజ్య సమితి లోగో (  పతాకం) ను వివరించండి?

13.సైనిక ఒప్పందం వల్ల అగ్రరాజ్యాల కు  అందుబాటులో కి వచ్చిన కీలక  వనరులు ఏవి?

14.ఆయుధ, అంతరిక్ష పోటీ వల్ల జరిగిన పరిణామాలు ఏమిటీ?

15.బాoడుoగ్ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

16.మధ్య ప్రాచ్యం అనగానేమి?

17.పశ్చి మ ఆసియా సంక్షోభo అనగానేమి?

18.జియోనిస్ట్ ఉద్యమం అనగానేమి?

19.అలీన ఉద్యమం ముఖ్య లక్షణాలు ఏవి?

20.మూడవ ప్రపంచ దేశాలు  అని అలీన దేశాలను ఎందుకంటారు?

21.వాగ్దత్త భూమి అనగా?

22.ఆరబ్బులు,యూదులు  మధ్య  ఘర్షణలకు కారణాలు ఏంటి?

23.పంచశీ ల ఒప్పందం ను వివరించండి?

24.గోర్బచేవ్ పరిపాలన  విధానాలు  తెల్పుము?

25 గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, అంటే ఏమిటి?

26.ఏక ధ్రువ ప్రపంచం అంటే ఏమిటి?

27.ద్విద్రువ ప్రపంచం అంటే ఏమిటి?

28.U. S. S. R. పతనానికి గల కారణాలు వ్రాయండి?

29.మెక్ మోహన్ రేఖ అనగానేమి?

30.భారత దేశం, చైనా, సంబంధాలను వ్యాఖ్యానిo చుము?

31.పాకిస్థాన్,భారత్ దేశం సంబంధాలను వివరించండి?

32. బంగ్లాదేశ్, భారత దేశం సంబంధాలు ను వివరించండి?

33.శ్రీలంక భారత దేశం మధ్య సంబంధాలు ను వివరించండి?

34. తాష్కెంట్  ఒప్పందం లోని అంశాలు వ్రాయండి?

35.సిమ్లా ఒప్పందం గురించి వ్యాఖ్యానించండి?

36."ముక్తి బాహిని" అనగా💐
💐💐💐💐💐💐💐💐

6, జనవరి 2020, సోమవారం

18.రాజకీయ ధోరణులు ఆవిర్భావం. (1977--2000,)

          ప్రశ్నలనిధి
     💐  ×××××××××💐
1.సరళీ కృత ఆర్ధిక విధానం అంటే ఏమిటి?

2.సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి?

3.మతతత్వ వాదం అనగానేమి?

4.జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి?

5.ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానేమి?

6.అల్ప సంఖ్యాకులు అంటే ఏమిటి?

7.అధిక సంఖ్యా కులు అనగానేమి?

8. అత్యావసర పరిస్థితి లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏమిటి?

9. 1970 లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తెల్పుము?

10.పార్టీ ఫిరాయింపులు అనగానేమి?

11.రాష్ట్ర పతి పాలన అనగానేమి?

12.తెలుగుదేశం పార్టీ  స్థాపనకు దారితీసిన కారణాలు ఏవి?

13(.N. T. R. ) తెలుగుదేశం పార్టీ  పెట్టిన సంక్షేమ పథకాలు ఏవి?

14.అస్సాం ఉద్యమం యొక్క  ప్రాముఖ్యత ఏమిటి?

15.అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ఏవి?

16. ఈశాన్య   ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించటానికి మూడు ముఖ్య కారణా లు ఏవి?

17.పంజాబ్ ఆందోళన కు గల కారణాలు వ్యాఖ్యానిo చండి?

18. అస్సాం ,పంజాబ్ ఉద్యమా ల పోలిక, తేడా లను వ్రాయండి?

19.ఆంద్రప్రదేశ్ అస్సాం ఉద్యమాల మధ్య పోలిక ,తేడాలను వివరించండి?

20.టెలికాం విప్లవము వల్ల  జరిగిన మార్పులు ఏమిటి?

21. సంకీర్ణ ప్రభుత్వా ల( U.P A.,N .D .A. జనతాదళ్)  శకం లో జరిగిన పరిణామాలు వివరించండి?

22.బెంగాల్ లో వామపక్ష విధానాలు ను వ్యాఖ్యానిo చండి?

23.ఆపరేషన్ బ ర్గా అంటే ఏమిటి?

24.73,74 వ రాజ్యాంగ సవరణ లను  వ్యాఖ్యానిo చండి?

25.స్థానిక స్వపరిపాలన గురించి  వివరించoడి?

26.ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రధాని p. v. నరసింహారావు చర్యలు పేర్కొనండి?

27.సామాజిక, ఆర్ధిక,అసమానతలు తగ్గించడానికి  సూచనలు తెల్పుము?
💐💐💐💐💐💐💐💐💐💐💐💐.

17 . స్వతంత్ర భారతదేశం.( ప్రశ్నల నిధి).

      💐ప్రశ్నల నిధి💐
         _______//______
1.జాతీయీకరణ అంటే ఏమిటి?

2.అత్యవసర పరిస్థితి ని వ్యాఖ్యానిoచండి?

3.సార్వత్రిక ఎన్నికలు అనగానేమి?

4.వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి?

5.రాజకీయ పార్టీ అంటే ఏమిటి?

6.ప్రతిపక్ష పార్టీ అంటే ఏమిటి?

7.ఏక పార్టీ వ్యవస్థ అంటే ఏమిటి?

8.బహుళ పార్టీ వ్యవస్థ  అంటే ఏమిటి?

9.స్వతoత్ర అభ్యర్థులు అంటే ఎవరు?

10.జాతీయ పార్టీ అంటే ఏమిటి?.

11.ప్రాంతీయ పార్టీలు అంటే ఏమిటి?

12.రాష్ట్రాల    పు నర్ వ్యవస్టీకృత చట్టం అంటే ఏమిటి?

13.ఇటీవల ఏర్పడిన కొత్త రాష్టాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి?

14.మొదటి ప్రణాళిక  దేనికి ప్రాధాన్యత ఇచ్చింది?

15. మొదటి ప్రణాలిక లో నెహ్రూ ప్రాధాన్యత చూపిన మూడు అంశాలు ఏవి?

16.భూ సం స్కరణ లు అంటే ఏమిటి?

17.వ్యవసాయ సహకార సంఘాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

18.స్థానిక స్వపరిపాలన అనగానేమి?

19. జమీందారు వ్యవస్థ అనగానేమి?

20.వెట్టిచాకిరి అనగానేమి?

21. విదేశాంగ విధానం అంటే ఏమిటి?

22.ప్రచ్ఛన్న యుద్ధం అనగానేమి?

23.అలీన విధానం అంటే ఏమిటి?

24.U. S. S. R. ను విస్తరించుము?

25.పాకిస్తాన్ భారత దేశం తో ఏ ఏ సం"" లలో యుద్దాలు చేసింది?

26.హిందీ వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో తీవ్రంగా జరిగింది ఎందువల్ల?

27."ప్రాంతీయ ఉద్యమా లు"  ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి  కారణమా? ఎందువల్ల?

28.ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు కు కారణం తెల్పుము?

29.ప్రాంతీయ పార్టీలు కు ఉదా లివ్వండీ?

30.జాతీయ పార్టీ లకు ఉదా లివ్వండీ?

31.370 వ అధికరణం ఏమి తెలియచేస్తుంది?

32.బంగ్లాదేశ్ విముక్తి  సాధించడం లో భారత్ నిర్మాణా త్మ క పాత్ర ను వ్యాఖ్యానిo చండి?

33."గరీభీ హ టావో  "వాగ్దానం  లక్ష్యం ఏమిటి?

34.రాజ భరణా లు అంటే ఏమిటి?

35.జయప్రకాష్ నారాయణ ( J. P) ఉద్యమం  ను వివరించండి?

36.42 వ రాజ్యాంగ సవరణ  ఉద్దేశా లు ఏమిటీ?

37.భారత దేశంలో అత్యవసర పరిస్థితుల్లో జరిగిన వ్యవస్థాగత మార్పులు ఏమిటి?

38.బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

,

31, డిసెంబర్ 2019, మంగళవారం

15స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం.

ప్రశ్నల నిధి.

1.రాజ్యాంగ సభ అంటే ఏమిటి?

2.రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి?

3.ఏక పౌర సత్వం అంటే ఏమిటి?

4.సమాఖ్య వాదం అనగానేమి?

5.పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏమిటి?

6.అధ్యక్ష తరహా విధానం అనగానేమి?

7.భారత రాజ్యాంగం లో అధికారాలు ఎన్ని 
జాబితా లు గా విభజించారు?అవి ఏవి?

8.ముసాయిదా రాజ్యాంగ o లో అధికరణాలు ,షెడ్యూళ్లు ఎన్ని?

9.ప్రస్తుత రాజ్యాంగ o లో అధికరణా లు షెడ్యూళ్లు  ఎన్ని?

10.అఖిల భారత సర్వీసులు అంటే ఏమిటి?

11. రాజ్యాంగ o లోని మౌలిక సూత్రాలు వివరించండి?.

12.భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య  సూత్రాలు పేర్కొనండి?

13.రాజ్యాంగ ప్రవేశిక లో కొత్తగా చేర్చిన పదాలు ఏవి?

14 రిజర్వేషన్లు అంటే ఏమిటి?

15.పార్లమెంటరి ,  అధ్యక్ష తరహా విధానం మధ్య వ్యత్యాసాలు తెల్పుము?

16."సమానత్వం" భావన ను తెల్పే కరపత్రం తయారు చేయండి?

17.ఉమ్మడి జాబితా లోని రెండు అంశాలు  ఉదా లివ్వండీ?

18.మానవతా విశ్వసూత్రం  ఆధారంగా ఏ దేశ రాజ్యాంగం రూపకల్పన  చేశారు?

19.రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాలు ఏవి? తెల్పుము?.

20. దేశఐక్యత కాపాడటానికి ముసాయిదా రాజ్యాంగ మూడు ముఖ్య విధానాలు ఏవి?

14.భారత దేశ జాతీయోద్యమం --దేశ విభజన, స్వాతంత్ర్యం.1939-1947.

               ప్రశ్నల నిధి.

1.జాతీయోద్యమం  అంటే ఏమిటి?

2. ముస్లిం లీగ్  పార్టీ గురించి తెల్పుము?

3.క్యాబినెట్ మిషన్  లోని సభ్యులు ఎవరు?

4.బ్రిటీష్ ఇండియా లో  మొదటి ఎన్నికలు ఎన్ని రాష్ట్రాలలో ,ఎప్పుడు నిర్వహించారు?

5.వ్యక్తిగత సత్యాగ్రహం అంటే ఏమిటి?

6.స్వాతంత్య్ర ఉద్యమం లో హిందూ మహాసభ,  (R. S. S). రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ఏమిటీ?

7." విభజించు పాలించు"అన్న విధానాన్ని వ్యాఖ్యానిo చండి?

8.ముస్లిం లీగ్ పార్టీ వల్ల జరిగిన రాజకీయ పరిణామాల ఏమిటి?

9.ప్రత్యేక నియోజకవర్గాల ప్రాముఖ్యత ఏమిటి?

10.క్రిప్స్ రాయబారo విశేషాలు ఏమిటి?

11.క్విట్ ఇండియా ఉద్యమం గురించి వ్యాఖ్యానిo చండి?

12. జాతీయోద్యమం లో భారత జాతీయ సైన్యం పాత్ర ( I.N.A.)ను పేర్కొనుము?

13. స్వాతంత్ర్యం తర్వాత బా రత దేశం లో విలీనం ఐన సంస్థానాలు ఏవి,?

14."తెభాగ" ఉద్యమం అంటే ఏమిటి?

15. సంస్థానాలు విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ను పేర్కొనండి?

16.భా రత దేశ విభజన కు దారి తీసిన వివిధ కారణాలు  తెలపండి?

17.స్వాతంత్ర్య ఉద్యమం లో గాంధీజీ పాత్ర ఏమిటి?

18.సుభాష్ చంద్రబోస్ లో మీకు నచ్చిన  గుణాలు ఏవి? ఎందుకు?

19(.డొమినియన్) రాజ్య ప్రతిపత్తి అంటే ఏమిటి?

20.దేశ విభజన ప్రజల ను ఏ విదంగా ప్రభావితం చేసింది? పేర్కొనండి?

21. జాతీయోద్యమం లో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఏమిటి?

22.దేశవిభజన లో వావేల్, మౌంట్ బాటెన్ విధానాలు పేర్కొనండి?

💐💐💐💐💐💐💐💐💐
            💐💐💐💐.

13.వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

               ప్రశ్నల నిధి.

1 వలస పాలిత దేశాలు అంటే ఏమిటి?

2.జాతీయత భావం అంటే ఏమిటి?

3.ప్రజాస్వామ్యo అంటే ఏమిటి?

4.సోషలిజం అంటే ఏమిటి?

5.సన్ యేట్ సేన్ మూడు సిద్దాంతాలు ఏవి?

6.యుద్దప్రభువులు అంటే ఎవరు?

7.".మే నాలుగు ఉద్యమం "ను వివరించండి?

8."సియావో షిమిన్" అనగానేమి?

9.సోవియట్లు అంటే ఏమిటి?

10.లాంగ్ మా ర్చ్ అనగానేమి?

11.భూసంస్కరణలు అంటే ఏమిటి?

12.వియత్నాం వలస పాలన అను భవం వివరించండి?

13. వియత్నాం భూ స్వామ్యవాదం తెలుపండి?

14 .వియత్నాం ప్రధాన ఎగుమతులు ఏవీ?

15.వియత్నాం రైతాంగం  సమస్యలు పేర్కొనండి?

16.వియత్నాం లో జాతీయతావా దం ఎలా విస్తరించింది? వివరించండి?

17 .ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏమిటి?

18.నై జీరియా గిరిజన జాతులు ఏవి?

19.ఖండాం త ర ఆఫ్రికా వాదం అంటే ఏమిటి?

20.వియత్నాం నూతన గణతంత్ర వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్ల ను పేర్కొనండి?

21.చైనా, వియత్నాం, భారత దేశాలలో ని భూ సంస్కరణలు ను పోల్చండి?

22.వియత్నాం లో అమెరికా జోక్యం యొక్క ప్రభావాన్ని  పేర్కొనండి?

23.నాపాలం బాంబు అంటే ఏమిటి?

24.నైజీరియాలో చమురు, పర్యావరణo,రాజకీయాల  ప్రభావాన్ని  తెల్పుము?.
💐💐💐💐💐💐💐💐

30, డిసెంబర్ 2019, సోమవారం

11.సుస్థిర అభివృద్ధి- - సమానత.( ప్రశ్నల నిధి)

        సుస్థిర అభివృద్ధి.
1. స్థూల జాతీయ ఉత్పత్తి(G.N.P) అనగానేమి?

2 .స్థూల దేశయోత్పత్తి( G.D.P)  అనగానేమి?

3.మానవా భివృద్ది సూచిక H.D.I.  అనగానేమి?

4.సుస్థిరాభివృద్ది అనగానేమి?

5.అభివృద్ధి, పర్యావరణం,ప్రజలు మధ్య సంబంధం తెల్పుము?

6.అభివృద్ధి కి దోహదం చేసే విభిన్న నమూనా లను తెల్పుము?

7.పర్యావరణ వనరుల సరఫరా విధి  అంటే ఏమిటి?

8.భూగర్భ జలాల రక్షణ చర్యలు  పేర్కొనండి?

9.రసాయన ఎరువులు, మందులు, పర్యావరణా నికి కలుగచేసే దుష్పరిణామాలు  తెల్పo డి?

10.పర్యావరణాన్ని"" సహజపెట్టుబడి"అని ఎందుకు అంటారు?వివరించండి?

11.నర్మదా లోయ ప్రాజెక్ట్ వల్ల గిరిజనులు ఎదుర్కోన్నా సమస్యలు వివరించండి?

12".నర్మదా బచావో ఆందోళన్"ఉద్యమం గురించి వ్యాఖ్యానించండి?

13.చిప్కో ఉద్యమం అనగానేమి?

14.""కాలుష్య కారకాలు జీవించే హక్కు కు ఆటంకం కలుగచేస్తున్నాయి "" ఎలా  వ్యాఖ్యానించండి?

15.సేంద్రియ వ్యవసాయం అనగానేమి?

16.వాతావరణం మార్పు ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై  ఎటువంటి ప్రభావాన్ని కలుగచేస్తుంది? తెల్పుము?

17. సిక్కిం రాష్ట్రంలో( సేంద్రియ) వ్యవసాయ విధానాలు పేర్కొనుము?

18. తెలంగాణ లో డెక్కన్ డెవలప్మెంట్  సొసైటీ వ్యవసాయ విధానాలు తెలుపండి?

19.చిరు ధాన్యాల సాగు లో డెక్కన్  డెవలప్ మెంట్  సొసైటీ  విధానాలు  పేర్కొనండి?

20.సేంద్రియ వ్యవసాయ రంగం పై నినాదాలు వ్రాయండి?
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

10.ఆహార భద్రత ( ప్రశ్నల నిధి)

        .ఆహారభద్రత.

1.ఆహరదాన్యాలు అంటే ఏమిటీ?

2.పోషకాహారం అంటే ఏమిటి?

3.ప్రజాపంపిణీ వ్యవస్థ అనగానేమి?

4.బపర్ నిల్వలు అనగానేమి?

5.ఆహారభద్రత అనగానేమి?

6.ఆహార ధాన్యాల లభ్యత ఎలా లెక్క కడుతారు?

7.ఆహార. దాన్యాల  ఉత్పత్తి పెంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో పేర్కొనుము?

8.ఉత్పత్తి అంటే ఏమిటి?

9.సమతుల ఆహారం అనగానేమి?

10.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో, ప్రజలు ఎన్ని కాలరీల ఆహారం తీసుకోవాలి?

11.భారత దేశం లో ఆహారపదార్థాలు లభ్యత తక్కువగా ఉంది ఎందువల్ల వివరించండి?

12.F.C.I.  ను విస్తరించుము? 

13.కనీస మద్దతుధర (M.S.P)అనగానేమి?

14.ఆహర భద్రత చట్టాన్ని వివరించుము?

15.ఆహార ధాన్యాలు కొరతఉండగా ఆహారాధాన్యాలు ఎగుమతి చెయ్యడం  లాభామా, నష్టమా వివరించండి?

16.ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగు పరచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వ్యాఖ్యానిoచండి?

17.జాతీయ పోషకాహార సంస్థ సర్వేలో ఏమి తెలియచేసింది?

18.N.I.N. ను విస్తరించుము?

19.శ రీర బరువు సూచిక (B.M.I.).ను వివరించండి?

20.ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహారభ ద్రత కు మధ్య గల సంబంధాన్ని వివరించండి?

21.ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహారభద్రత ను కల్పిస్తుందా,? వ్యాఖ్యానించండి?

22.ఆహారభద్రత గురించి ఒక పోస్టర్ తయారు చేయండి?

23.పోషకాహారం లోపాలను నివారణకు సూచనలను పేర్కొనండి?.

24.వ్యవసాయ వైవిధ్యం ద్వారా దేశ ప్రజలకు ఆహారభద్రత కల్పించ వచ్చా వివరించండి?

28, డిసెంబర్ 2019, శనివారం

9.ప్రపంచీకరణ .(ప్రశ్నల నిధి)

💐💐ప్రపంచీకరణ💐💐
-----------------/-------------
1విదేశీ వాణిజ్యo అనగానేమి?
2.బహుళ జాతి సంస్థలు అంటే ఏమిటి ఉదా.లివ్వండీ?
3.విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి?
4.సరళీకృత ఆర్థిక విధానo అంటే ఏమిటి?
5.జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
6.W.T.O . విస్తరించుము?
7.I.M.F.విస్తరించుము?
8.S .E.Z.అనగానేమి?
9.ప్రపంచీకరణ అనగానేమి?
10.ప్రపంచీకరణ పై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని వివరించండి?
11.ప్రపంచీకరణ ప్రక్రియ లో బహుళ జాతి సంస్థల పాత్ర ఏమిటి?
12భారత దేశo పై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి?
13.బహుళ జాతి భారతీయ కంపెనీలు ఏవి ఉదా. లివ్వండి?
14.కార్మిక చట్టాల సడలింపు కంపెనీలు కు ఏ విదంగా ఉపయోగ పడుతుంది   వివరించండి?
15.ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల పై ఒకే విదంగా ఉంటుందా వివరించండి?
16.విదేశీ పెట్టుబడులు, వాణిజ్యాల పై అవరోధాలు  కల్పించడానికి గలా కారణాలు ఏమిటి? వీటిని ఎందుకు సరళికరించాలనుకుంటుంది?
17.ప్రపంచ వాణిజ్య సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు  పేర్కొనండి?
18.స్వదేశీ కంపెనీలకు ,బహుళ జాతి సంస్థలకు మధ్య తేడాలను తెలుపండి?
19.అంతర్జాతీయ ఆర్థిక మార్పిడి లో ముఖ్య ప్రవాహాలు పేర్కొనండి?
20.అరబ్ వసంతం అనగానేమి?
21.ప్రపంచ పటం లో క్రింది దేశాలను గుర్తించుము?

8.రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ .. (ప్రశ్నల నిధి)

రాంపురం:గ్రామ ఆర్థిక వ్యవస్థ .
💐💐💐💐💐💐💐💐💐💐💐.


1.ఉత్పత్తి కారకాలు  పేర్కొనండి?

2.స్థిర పెట్టుబడి అనగానేమి?

3.రాంపురం లో వ్యవసాయేతర  కార్యకలాపాలు ఏమిటీ?

4.నిర్వాహణ పెట్టుబడి అంటే ఏమిటి?

5.బౌతిక పెట్టుబడి అంటే ఏమిటి?

6.బహుళ పంటల సాగు అంటే ఏమిటి?

7.చిన్న కారు రైతులు అంటే ఏమిటి?

8.M.G.N.R.E.G.A. ను విస్తరించుము?

9.మిగులు ఉత్పత్తి అంటే ఏమిటి?

1౦.రాంపురం లోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలి లభిస్తుంది ఎందుకు?

11. రాంపురం గ్రామంలో ఉత్పత్తి పెంచడానికి వివిధ పద్ధతులు ఏమిటీ?

12.ఒక  హెక్టార్ అంటే ఏమిటి?

13.రాంపురం లో ఆధునిక వ్యవసాయ విధానాల ను పేర్కొనండి?


7.. నివాస ప్రాంతాలు-- వలసలు. (ప్రశ్నలనిధి)

నివాస ప్రాంతాలు- - వలసలు.

1.నివాసప్రాంతం అంటే ఏమిటి?

2.విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి?

3.పట్టణీ కరణ అనగానేమి?

4.వలస అనగా నేమి?

5.నివాస ప్రాంతాలు యొక్క మౌలిక విషయాలు ఏవి?

6.మహా నగరాలు అంటే ఏమిటి?

7.మెట్రో పాలిటన్ సిటీ అంటే ఏమిటి?

8.క్లాస్ 1 నగరాలు అంటే ఏమిటి?

9.పట్టణం అనగానేమి?

10.రెవెన్యూ గ్రామము అంటే ఏమిటి?

11.ఆవాస ప్రాంతం అంటే ఏమిటి?

12.అంతర్గత వలస అంటే ఏమిటి?

13.అంతర్జాతీయ వలస అంటే ఏమిటి?

14.అంతరాష్ట్ర వలస అంటే ఏమిటి?

15.కాలానుగుణ వలస అంటే ఏమిటి?

16.ఏరోట్రోపొలిస్  నగరాలు(విమానశ్రయ నగరాలు) అంటే ఏమిటి?

17.వలసలు గుర్తింపు ప్రామాణికాలు ఏంటి?

18.పట్టణీకరణ వలన ఏర్పడే సమస్యలు ఏమిటి?

19.తాత్కాలిక వలస అంటే ఏమిటి?

20. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల? వివరించండి?

21.పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో ఉపాది అవకాశా లు ఎక్కువ? కారణాలు పేర్కొనండి?

22.గ్రామీణ ప్రాంతాల్లో ని వలసల వల్ల ఏ రంగం ఆర్థికం గా దెబ్బ తింటుంది? ఎందువల్ల?

23.వలస  వెళ్ళిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?

24.వలస వెళ్ళిన ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టాలి?పేర్కొనండి?

25."పట్టణీకరణ అభివృద్ధికి చిహ్నం గా భావిస్తున్నారు"కారణం ఏమిటి? వివరించండి?

26.భారత దేశ పటం లో నగరాలను గుర్తిచండీ?
1.చెన్నై 2.బెంగళూరు.3.హైదరాబాద్4.ఢిల్లీ 5.కలకత్తా,6భోపాల్ 7.ముంబై 8.కొచ్చిన్.

27 అంతర్గత ,అంతర్జాతీయ వలసల ప్రభావాలు మధ్య తేడాలను పేర్కొనండి?

28.అంతర్జాతీయ వలసలు వల్ల లాభమా ,నష్టమా , వివరించండి?

💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
  

27, డిసెంబర్ 2019, శుక్రవారం

6.జనాభా. ( ప్రశ్నలు నిధి)

జనాభా (ప్రశ్నలు నిధి)

1.జనసాంద్రత అనగానేమి?

2.లింగనిష్పత్తి అనగానేమి?

3.ఫెర్టిలిటీ శాతం అంటే ఏమిటి?

4 .భౄణహత్య అనగానేమి?

5.శ్రా మిక జనాభా అనగానేమి?

6.జనాభా మార్పు ను  తెలియచేసే అంశాలను వివరించండి?

7.దేశ జనాభా ను ప్రధాన o గా ఎన్ని వర్గాలు గా విభజిస్తారు?

8.జన నాల రేటు అంటే ఏమిటి?

9.మరణాలు రేటు అంటే ఏమిటి?

10.జనాభా విస్తరణ అనగానేమి?

11.జనాభా పెరుగుదల అంటే ఏమిటి?

12.జన గణన ద్వారా ఏమి తెలుసుకుంటారు?

13.వివిధ రాష్ట్రాల జనసాంద్రత లో తేడాలకు గల కారణాలు ఏంటి?

14.జనాభా పెరుగుదల కు గల  కారణాలు ఏంటి?

15.జనాభా పెరుగుదల అరికట్టేందుకు నీ సూచనలు తెల్పుము?

16.జనాభా సమస్య నివారణకు నినాదాలు వ్రాయండి?

17. లింగనిష్పత్తి లో అసమానతలు ఏ విదంగా తగ్గించవచ్చు?తెల్పుము?

18.వృద్ధులు అని ఎవరిని అంటారు?

19.అంతర్గత వలసలు అనగానేమి?

20.అంతర్జాతీయ వలసలు అనగానేమి?

21.తెలంగాణలోని ఏ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ ఉంది దానికి గల కారణం ఏమిటి?

22.లింగనిష్పత్తి లో ఎక్కువ ,తక్కువ, ఉంటే సమాజం పై పడే ప్రభావం ను పేర్కొనండి?.
💐             💐                   💐


26, డిసెంబర్ 2019, గురువారం

5.భారత దేశ నదులు, నీటి వనరులు. ( ప్రశ్నల నిధి)

భారత దేశ నదులు, నీటి వనరులు. 

1.అంతర్భుజలం అనగానేమి?

2.పరివాహక ప్రాంతం అంటే ఏమిటి?

3.ప్రవాహ వనరులు అనగానేమి?

4."" భూగర్భనీటి  వనరుల"" ను   పెంపొందించే  నినాదాలు వ్రాయండి?

5. భారత దేశ నది వ్యవస్థ యొక్క మూడు భౌతిక అంశాలు తెల్పుము?

6. నీటి వనరులు ఎక్కువగా కలుషితమవుతున్నాయి కారణాలు ఏంటి?

7.వరద అంటే ఏమిటి?

8.భారత దేశ నదీ జల వ్యవస్థ ను వివరించండి?

9.హిమాలయ నదీ వ్యవస్థ ను వర్ణించoడి?

10.ద్వీపకల్ప నదీ వ్యవస్థను వివరించండి?

11.సింధూ నది ప్రధాన ఉపనదులు తెల్పుము?

12. V ఆకారపు లోయలు ఏర్పర్చు నదులు ఏవి?

13.గంగానది  ఉపనదులు తెల్పుము?

14.ద్వీపకల్పపీఠభూమి లో పుట్టే గంగానది వ్యవస్థ కు చెందిన నదులు ఏవి?

15.బ్రహ్మపుత్ర నది కి అస్సాం లోయలో కలిసే ఉపనదులు ఏవి?

16.అరే బియా సముద్రం లో కలిసే నదులు ఏవి?

17.భారత.ద్వీపకల్పo లో ప్రధాన నదులు తెల్పుము?

18.తుంగభద్ర నదీ నీటి వినియోగ తీరు తెన్నులు తెల్పుము?

19.తుంగ భద్ర నది జలాశయం పూ డికకు గల కారణాలు వివరించండి?

20.మహారాష్ట్ర ఆదర్శ గ్రామ  పథకం షరతులు ఏవి?

21.హివారే బజారు లో నీటి సంరక్షణ చర్యలు వివరించండి?

22.భూగర్భ జలాలు సంరక్షణ కు నీ సలహా లు వ్రాయండి?

23. కేరళ పెరుమట్టి గ్రామ పంచాయితీ కి,కోకాకోలా , కoపెనికి తలెత్తిన వివాదంద్వారాభూగర్భ జలాలను   వినియోగాన్ని సమర్థించే వ్యతిరేకించే వాదనలు పేర్కొనo డి?.

24. భూగర్భ జలాలు తగ్గి పోకుండా తీసుకోవాల్సిన చర్యలను పేర్కొనండి?

25.త్రాగు నీరు కొనుగోలు అమ్మకం పై ఎటువంటి నియంత్రణ వుండాలి?
వ్యాఖ్యానిo చండి?

26.నీటి వనరులు సంరక్షణ, కార్యాచరణ, చట్టాల  ప్రాముఖ్యత ఏమిటీ? వివరించండి?
  

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐.

24, డిసెంబర్ 2019, మంగళవారం

4 భారత దేశం- -శీతోష్ణస్థితి. ( ప్రశ్నల నిధి).

     💐  భారత దేశ శీతోష్ణస్థితి. 💐
           ----------------------------

1.శీతోష్ణస్థితి   అంటే ఏమిటి?

2.క్లై మాటోగ్రాఫ్ అంటే ఏమిటి ?

3.వాతావరణం అనగానేమి?

4.ఋతుపవనాలు ( మాన్ సూన్)  అనగానేమి?

5.వాయుగుండం  అనగానేమి?

6.I.P.C.C. ను విస్తరించుము?

7.A.G.W.  ను విస్తరించుము?

8.హరితగృహ వాయువులు(green house gases )ఏవి?

9. అక్టోబర్ వేడిమి అనగానేమి?

10.మామిడి జల్లులు అనగానేమి?


11. వ్యాపార పవనాలు ( trade winds) అనగానేమి

12.అధిక పీడనం అనగానేమి?

13.అల్పపీడనo అనగానేమి?

14.పశ్చిమ  విక్షోభాలు ఆంటే ఏమిటి?

15.నై రు తి రుతుపవనాలు అనగానేమి?


16.ఈశాన్య రుతుపవనాలు అనగానేమి?

17.భారత దేశం లో గల "సాంప్రదాయ కాలాలు" ఏవి? 

 18. భారత దేశం లో గల పంట కాలాలు ఎన్ని  అవిఏవి?

19.శీతోష్ణ స్థితి  కారకాలు ఏవి?

20.మా న్ సూన్ అనగానేమి?

21.ఋతు పవనాలు ఆరంభం అనగానేమి?

22 వర్షచ్చా యా ప్రాoతం అనగానేమి?

23.అడవుల నిర్మూలన అంటే ఏమిటి?

24.భూగోళం వేడి ఎక్కడానికి గల కారణాలు తెల్పుము?

25.భారత దేశ శీతోష్ణస్థితి ని ప్రభావితం చేసే అంశాలను వివరించండి?

26.భూగోళం వేడెక్కడం లో మానవుని పాత్ర తెలుపండి?

27.భూగోళం వేడి తగ్గడానికి కొన్ని చర్యలు సూచించండి?

28.భూగోళం  వేడెక్కడం లో అభివృద్ధి చెందిన  ,అభివృద్ధి చెందుతున్న దేశాల  మధ్య ఉన్న అభిప్రాయా భేదా లేమిటి?

29.గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి  నినాదాలు వ్రాయండి?

30.ఉష్ణోగ్రత, వర్షపాతం లలో మార్పులు కు కారణం అయ్యే అంశాలు పేర్కొనండి?

31."" లూ" పవనాలు అంటే ఏమిటి?

32.జెట్ ప్రవాహం అనగానేమి?.

                💐 💐 💐.

23, డిసెంబర్ 2019, సోమవారం

3.ఉత్పత్తి ,ఉపాధి.( ప్రశ్నల నిధి.)

💐💐💐ఉత్పత్తి. ,ఉపాధి. 💐💐💐



1.ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలను తెలుపండి?

2.స్థూల జాతీయ ఉత్పత్తి  భావన ను వివరించండి?

3.స్థూల దేశయోత్పత్తి భావన ను వివరించండి?

4.అంత్యవస్తువులు అనగానేమి?

5.ప్రాథమికరంగం అంటే ఏమిటి?

6.పారిశ్రామిక రంగానికి చెందిన అంశా లను తెల్పుము?

7.సేవా రంగంలో ని అంశాలు పేర్కొనండి?

8.వినియోగ వస్తువు లకు 2 ఉదా " ఇవ్వండి?

9ఉత్పాదక వస్తువు లకు  2 ఉదా"ఇవ్వండి?

10.మాధ్యమిక వస్తువు అనగానేమి?



11.ఉపాధి అనగానేమి?

12.వ్యవస్టీకృత రంగం అనగానేమి?

13.అ వ్యవస్టీ కృత రంగం అనగానేమి?

14.ఉపాధి అవకాశాలు ను ఎలా మెరుగుపరచవచ్చు నీ సలహా వ్రాయండి?

15.స్థూల దేశీయోత్పతి  లో వస్తున్న మార్పులు  రంగాల వారీగా వివరించండి?

16.అల్ప ఉపాది ఆంటేఏమిటి?

17. వ్యవసాయ రంగం లో  ఉపాది ,    ఉత్పత్తి ,తక్కువ గా వుంటుంది కారణాలు తెలుపండి?

18. సేవా రంగంలో  ఉపాధి   అవకాశాలు పెంచడానికి మీ సూచన లు  తెలపండి?

19.ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏమిటి?

20.చిన్న,  సన్న,కారు రైతు ల సమస్యలు పరిష్కరించడాని కి నీ సూచనలు ఏమిటీ?

21 ఆ వ్యవసస్టీకృత రంగ కార్మికులు  సమస్యలు ఎలా పరిష్కరించవచ్చు?



21, డిసెంబర్ 2019, శనివారం

2.అభివృద్ధి భావనలు (ప్రశ్నల నిధి)

 2.అభివృద్ధి - భావనలు.

ప్రశ్నల నిధి



1.తలసరి ఆదాయం  భావన ను వ్యాఖ్యానిచండి?
దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభా చే భాాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది దీనినే మరో విధంగాా దేశ జాాతీయ ఆదాయం మొత్తం ఆ దేేశ జనాభా చే భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.

2మానవాభివృద్ధి అనగానేమి?

3.ప్రజాసదుపాయాలు  ను వివరించండి?

4.అభివృద్ధి అనగానేమి?

5.సుస్థిరాభి వృద్ధి అనగానేమి?

6.జాతీయ ఆదాయం  భావనా ను వ్యాఖ్యానించండి?

7. అక్షరాస్యత శాతం ను వివరించండి?

8.జీవన ప్రమాణం  అనగానేమి?

9.లింగ వివక్షత అనగానేమి?

10. వివిధ దేశాల వర్గీకరణ కు ప్రపంచ బ్యాంక్ 2012 సం" ప్ర్రా మాణికాలనూ తెలపండి?


11.శిశుమరణాలు  రేటు అంటే ఏమిటి?

12.హిమాచల్ ప్రదేశ్  విద్యా విధానం పై నీ అభిప్రాయం తెల్పుము?

13.ప్రపంచ బ్యాంకు,ప్రామాణికాలకు  ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాలు లో ఉపయోగించే ప్రామాణికాలకు గల తేడాలు ఏమిటి?

14.హిమాచల్ ప్రదేశ్ లో ఏ ఏ కారకాలు    పాఠశాల విద్యా అభివృద్ధి కి  తోడ్పడాయి?

15.మానవాభివృద్ధి ని కొలవడానికి  ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?

16.లింగవివక్షత  రూపుమాపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో  మీ అభిప్రాయాలను తెలియజేయండి?

17.మన దేశంలో అమ్మాయి ల చదువుకు తక్కువ  ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు వివరించండి?

18.తలసరి ఆదాయానికి ,అక్షరాస్యత కు  గల సంబంధం వివరించండి?

19.అక్షరాస్యత  "మానవా భివృద్దిని" ఎలా ప్రభావితం చేస్తుంది వ్యాఖ్యానించoడి?

20.అణు విద్యుత్ ఉత్పత్తి ని స్థానికులు వ్యతిరేకిస్తూన్నారు ఎందువల్ల?

💐💐💐💐💐💐💐💐💐💐💐💐


12. ప్రపంచ యుద్దాలు - ప్రపంచం.1914--1945( ప్రశ్నలు నిధి)

ప్రపంచ యుద్దాలు --- ప్రపంచం.
--------------------------------------
1.పెట్టుబడి దారి విదానం అనగానేమి?
2.నాజీజంఅనగానేమి?
3.సై నికవాదం అనగానేమి?
4.జాతీయ తా వాదం అనగానేమి?
5.సామ్రాజ్య వాదం అనగానేమి?
6.ఫాసిజం అనగానేమి?
7.సోషలిజం అనగానేమి?
8.కమ్యూనిజం అనగానేమి?
9.విప్లవం అనగానేమి?
10.అధికార  కేంద్రీకరణ  అనగానేమి?


11 ప్రజాస్వామ్యo అనగానేమి?
12.ఆర్ధిక మాంద్యం అనగానేమి?
13.వలసవాద దేశాలు  అనగానేమి?
14.త్ర్రీ రాజ్య సంధి ఏ ఏ దేశాలు కుదుర్చుకున్నాయి.?
15.మిత్రదేశాలు కూటమి గా ఏ ఏ దేశాలు ఏర్పడ్డాయి?
16.సాయుధ శాంతి అనగానేమి?
17.బాల్కన్ రాజ్యాలు ఏవి?
18.ఆయుధ పోటీ అనగానేమి?
19.మొదటి ప్రపంచ యుద్దా నికి తక్షణ కారణం ఏమి?
20.కే o ద్ర రాజ్యాలు ఏవి?


21మిత్రరాజ్యాలు ఏవి?
22.వర్సయిల్స్స్ ఒప్పందం  గురించి వివరించుము?
23.నానాజాతి సమితి గురించి వివరించుము?
24.నానాజాతి సమితి వైఫల్యం గురించి  వ్యాఖ్యానించుము?
25.జార్ అనగానేమి?
26.ఫిబ్రవరి విప్లవము  లేదా (మా ర్చ్)  విప్లవము అనగానేమి?                  27.అక్టోబర్ విప్లవము అనగానేమి?
28.భోల్సి విక్కులు అనగానేమి?
29.మెన్షి విక్కులు అనగానేమి?
30.న్యూ డీల్ విదానం అనగానేమి?


31.కాన్సెంట్రేషన్ క్యాంప్ లను ఎవరు నిర్వహించారు?
32.గెస్టా పో అనగానేమి?
33.అషివిట్జ్ ( గ్యాస్ చాంబర్స్) అనగానేమి?
34.రెండవ ప్రపంచ యుద్దా నికి తక్షణ కారణం?
35.మార్షల్ ప్రణాలికను వివరించండి?
36.మాల్తోవ్  ప్రణాళికను వివరించండి?
37.రెండవ ప్రపంచ యుద్దం  తర్వాత ఏర్పడిన ప్రపంచ శాంతి సంస్థ ఏది?
38".ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రభుత్వo లాంటిది".అని తెలిపే నాలుగు సిద్దాo తాలను పేర్కొనండి?
39.U  N.IC.E.F.
40.U.N.E.S.C.O

41.W.H.O
42.I.L.O.

43. రెండవ ప్రపంచ యుద్ధం కారణా లను,ఫలితాలు ను వ్రాయండి?
44.రెండు ప్రపంచ యుద్దాల కారణాలను వివరించండి?
45.రష్యా విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులు ను తెచ్చింది అవి ఏమిటి? వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ?
46.తీవ్ర ఆర్ధిక మాంద్యానికి గలా కారణాలు తెలుపండి?
47 ఆర్ధిక మాంద్యం సమాజం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఏ వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతారు?
48.జర్మనీ చేతిలో యూదులు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు?
49.ఆర్ధిక.మాంద్య పరిస్థితులు అధిగమించ డానికి  ఏ చర్యలు తీసుకోవాలని  మీరు సూచిస్తారు?
50 ప్రపంచ శాంతి ని  నె లకొల్పుటకు  నినాదాలు  వ్రాయండి?
51.ప్రపంచ పటం లో ఈ క్రింది దేశాలను గుర్తించండి.
a.జర్మనీ b. ఇటలీ c. ఆస్ట్రియా. d.U.S.A. E చైనా.F. రష్యా G. బ్రిటన్.H. జపాన్.
I టర్కీ J. పోలాండ్ .K. ఫ్రాన్స్.





1..భారత దేశం భౌగోళిక స్వరూపాలు.( ప్రశ్నలు నిధి)

 
           . వివరణాత్మక సమాధానములు.   

1.భారత దేశభౌగోళిక స్వరూపాలు ను వివరించoడి.?
Ans.

1##   హిమాలయాలు 
2##  గంగా సింధు నది మైదానం 
3##  దీపకల్ప పీఠభూమి 
4##  తీరప్రాంత మైదానాలు 
5## ఎడారి ప్రాంతం 
6.## దీవులు


2.భారత దేశ నదులు ఎన్ని రకాలు గా  వర్గీకరణ  చేశారు .నదీ వ్యవస్థ లను వివరించండి.
Answer 

భారతదేశ నది జల వ్యవస్థను రెండు రకాలుగా వర్గీకరణ చేశారు

 1.హిమాలయ నదులు దీని జీవనదులు 2.ద్వీపకల్ప నదులు (  వర్షాధార నదులు)
జీవనదులు ముఖ్యంగా 

1.సింధూ నది వ్యవస్థ : 
టిబెట్ లోని కైలాస పర్వతాలు లో జన్మించి  భారత్లోని జమ్ము కాశ్మీర్ లో ప్రవేశిస్తుంది సింధు నది ప్రధాన ఉపనదులు జీలం ,చీనాబ్ ,రావి ,బియాస్ సట్లెజ్.

2గంగానది నది వ్యవస్థ :
ఈ నది గర్వాల్ టిబెట్ సరిహద్దు వద్ద అలక్ నందా మరియు భగీరథ అనూ రెండు ప్రధాన సెలయేళ్ల కలయిక .
దీని పొడవు 2525 కిలోమీటర్లు .
.ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ వద్ద యమునాా ,సరస్వతి  నదులు గంగానదిలో కలియు చున్నవి. .
ఈ  ఈ నదులు కలిసి ఇ ది త్రివేణి సంగమంగా ఏర్పడును ఈ నది యొక్క ఉపనదులు యమునా, గండక్ ,సోన్ ,కోసి మొదలగునవి.
3బ్రహ్మపుత్రా నది వ్యవస్థ;
 ఈ నది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలు లోని     చమయుంగ్ డంగ్ నుండి పుడుతుంది. దీని ఉపనదులు  టుగ్రీ  ,పద్మా.

 4.ద్వీపకల్ప నదులు :

మహానది : చత్తీస్ ఘడ్ లోని మహదేవ్ కొండలు 
5.గోదావరి నది : మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద 
6.కృష్ణా నది :  మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ 7.కావేరి నది కర్ణాటకలోని బ్రహ్మగిరి 
8.నర్మదా నది :అమర్ కంటక్ మధ్యప్రదేశ్లోని జన్మించును.


 3.భారత దేశ "ద్వీపకల్పం" ను వివరించండి?.
Ans.
మూడు వైపులా నీటిచే ఆవరించబడి ఉన్నా భూభాగాన్ని ద్వీపకల్పం అంటారు .

భారతదేశానికి తూర్పు బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం ఉండడంవల్ల భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు.


4.భారత దేశ శీతోష్ణ స్థితి వైవిధ్యం ను  వివరించండి?
Ans.
1.  సముద్ర ప్రభావిత  శీతోష్ణ స్థితి  .

2.ఖండఅంతర్గత గత  శీతోష్ణస్థితి .

1.మనదేశo అత్యుష్ణ అతిశీతల ప్రదేశాలను కలిగి ఉష్ణోగ్రత వైవిధ్యత లను కలిగి ఉండడం .
2.రుతుపవన వర్షపాతం వర్షపాతం కలిగి ఉండడం .
3.సముద్రానికి గల దూరాన్ని బట్టి భారతదేశం వైపు వీచే పవనాలు ఒక ప్రదేశం యొక్క ఉనికి, ఎత్తు మొదలగునవి వర్షపాత విస్తరణ లో శీతోష్ణస్థితిలో వైవిధ్యతను కలిగి ఉన్నాయి .

5.అక్షాంశ, రేఖా oశాల ఆధారంగా భారత దేశం ను వర్ణించుము?
Ans.
భారతదేశం ఉత్తరార్థ ,పూర్వార్ధ గోళం,
లలో ఆసియా ఖండానికి దక్షిణాన ఉంది 

భౌగోళికంగా 8 °4`- 37°6` డిగ్రీల ఎనిమిది ఉత్తర అక్షాంశాల మధ్య 68°7`-97°25' తూర్పు రేఖాంశాల మధ్య భారత దేశం కలిగి ఉంది 
దీని విస్తీర్ణం 3. 28 మిలియన్ చదరపు కిలోమీటర్లు ప్రపంచంలో భారతదేశం విస్తీర్ణంలో  ఏడవ స్థానంలో ఉంది.


6.భారత దేశ  భూగర్భ నేపథ్యం ను  వివరించండి.?
Ans.
భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగం భూభాగంలోని ది .
20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం విడిపోయి భారతదేశ ద్వీప కల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి angaara భూ మీ ఢీకొంది 
తీవ్ర ఒత్తిడి వల్ల  లక్షల సంవత్సరాల క్రమంలో  ఈ ప్రక్రియ వల్ల  ప్రస్తుతమున్న  హిమాలయాలు  ఏర్పడ్డాయి  
ద్వీపకల్ప  పీఠభూమిలో  ఉత్తర అంచులు  పగిలిపోవడం వల్ల పెద్ద లోయ ఏర్పడింది .

కాలక్రమంలో ఉత్తరాది నుంచి హిమాలయ నదులు దక్షిణం నుంచి దీపకల్ప నదులు తెచ్చిన మట్టితో మేట వేయబడినది.
 దీని ఫలితం భారత భూభాగం ఎంతోో తో వైవిద్యత తో కూడుకుని ఉంది.

7.హిమాలయ, ద్వీపకల్ప నదులు ఉత్తర మైదానాలు ఏర్పాటుకు ఏ విదంగా దోహదపడ్డాయి.తెలుపండి?
Ans.
సింధూ నది దాని ఉపనదులైన జీలం ,చీనాబ్, రావి  బియాస్  సట్లెజ్ నదులు ,తెచ్చిన ఒండ్రు మట్టితో పంజాబ్ హర్యానా ప్రాంతంలో సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి .

గంగా నది దాని ఉపనదులైన  గగ్గర్ నుండి తీస్తా నది వరకు ఉత్తర ప్రదేశ్ బీహార్ హర్యానా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సారవంతమైన మైదానాలు ఏర్పడ్డానికి దోహదపడ్డాయి.

 ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరభాగంలో పుట్టే చంబల్, సింద్, కెన్' బెట్వా ,సొన్ నదులు గంగా నది వ్యవస్థ చెందుతాయి ఈ నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గంగా సింధు మైదానాలు ఏర్పడ్డాయి

8.భారత దేశ హిమాలయ ప్రాముఖ్యతను ను వర్ణించుము.?
Ans.
1హిమాలయాలు మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల 2.పవనాలను భారతదేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి 
3.భారత దేశంలో వర్షపాతం మరియు రుతుపవన శీతోష్ణస్థితి ప్రధాన కారణం హిమాలయాలు.
 4.హిమాలయాలు జీవనదులు లకు జన్మస్థానం గా ఉన్నాయి.
 5.హిమాలయాలు వినోద్ పర్యటన అభివృద్ధికి లోయలు వేసవి విడిది విధులు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి దోహదం చేస్తున్నాయి.
 6.విలువైన అటవీ సంపద హిమాలయాల నుండి లభిస్తున్నాయి 
7.హిమాలయాలలో లభించే  మూలికలు  భారత ఔషధ పరిశ్రమకు ఉపయోగపడు తున్నాయి .
8.హిమాలయాలలో ఉండే కనుమల ద్వారా సహజ రవాణా మార్గాలుగా విదేశీమారక అభివృద్ధికి దోహదం చేయును .అలాగే పర్వతారోహకులు అభిలాష తీరుస్తున్నాయి.
 9.జల విద్యుత్ శక్తి కి అనుకూలంగా ఉన్నాయి.

9.గంగా సింధూ నదీ మైదాన  వ్యవస్థ    ఏ విదంగా ఏర్పడింది,  వర్ణించుము?
మద్య మహాయుగ కాలంలో టెథిస్ అనే పెద్ద సముద్రం ఉండేది ఆ సముద్రం సంపీడనం  కు లోను కావడం వల్ల అక్కడ అ అనేక అవక్షేప పాలు నిక్షేపింపబడినవి .

పూర్వము టెథిస్ సముద్రం ఉన్నచోట హిమాలయాలు ఏర్పడిన అందువల్ల అక్కడ పెద్ద అఖాతము ఏర్పడింది.
ఈ ప్రాంతంలో హిమాలయ నదులు తెచ్చిన ఒండ్రు మట్టి నిక్షిప్తం చేయడం వల్ల అక్కడ గంగా సింధు మైదానం ఏర్పడింది

10.ద్వీపకల్ప పీఠభూమి  గురించి వివరించుము?
Ans.
భారతదేశ పీఠభూమిని దానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు 

ఇక్కడ  ప్రధానంగా పురాతన 
స్పటిక కారకారా కఠినమైన అగ్ని శిలలు రూపాంతర శిలలు లు ఉన్నాయి ఈ పీఠభూమిలో లోహ అలోహ ఖనిజ వనరులు పెద్ద మొత్తంలో కలవు .

ఈ పీఠభూమికి పడమటి పడమటి కనుమలు తూర్పు తూర్పు కనుమలు దక్షిణాన కన్యాకుమారి ఉంది.

దీపకల్ప పీఠభూమి పూర్వం గోండ్వానా భూమిలో భాగంగా ఉండేది .
గోండ్వానా భూమిలో కదలికలు రావడం వల్ల పురాతన స్పటిక  శిలలు  తో కూడిన ఈ భూమి సముద్ర మట్టం పైకి నెట్టబడింది .
ఫలితంగా ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడింది.

11.తూర్పు తీర, పశ్చిమ తీర మైదానాల మధ్య  వ్యత్యాసాలు ఏమిటీ?
Ans.

 తూర్పు తీర మైదానాలు
 1.ఇవి బంగాళాఖాతానికి తూర్పు కనుమలు  మధ్యన ఉన్నది.
2. ఈ మైదానాలు బల్లపరుపుగా వెడల్పుగా ఉన్నాయి.
3. తూర్పు తీర మైదానాలు వెడల్పు 100 -150 కిలోమీటర్లు వరకు ఉంటుంది.
4.మైదానాలలో మహానది ,గోదావరి ,కృష్ణ కావేరి ,వంటి నదులు ప్రవహించును.
పశ్చిమ తీరా మైదానాలు .
1ఇవి అరేబియా సముద్రం నకు పశ్చిమ కనుమలకు ఈ మధ్యన వ్యాపించి ఉన్నాయి .
2పశ్చిమ తీర మైదానాలు గుజరాత్, కొంకణ
 తీరం  ,కెనరతీరం ,malabar  పేర్లతో తో పిలుస్తారు .
పశ్చిమ తీరాన 50 -km 80 కిలోమీటర్ల వెడల్పుతో గలవు.
 ఇక్కడ నర్మద తపతి  సబర్మతి మహి వంటి నదులు ప్రవహించి సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి .
గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి.

12.భారత దేశ  థార్ ఎడారి గురించి వర్ణించుము.?
Ans.
 ఆరావళి పర్వతాలు వర్షచ్చాయా ప్రాంతంలో  తార్ ఎడారి కలదు.

  ఇక్కడ సాంవత్సరిక వర్షపాతం 100 మిల్లీ మీటర్లు నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది .

ఎడారిలో ఎత్తుపల్లాల తో ఇసుక మైదానాలు కలవు.
 
ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది .

ఈ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో అధిక భాగం కలదు

13.భారతదేశ విశిష్టత లో దీవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాఖ్యానించండి?
Ans

భారతదేశంలో  2  ద్వీప సమూహాలు కలవు బంగాళాఖాతంలో 1.అండమాన్ నికోబార్ దీవులు 2.అరేబియా సముద్రంలో లక్షదీవులు కలవు.

 నికోబార్ దీవి లో ఇందిరా పాయింట్ (భారతదేశ  దక్షిణ  చివరి  అoచు )కలదు.

 లక్షదీవుల లో ప్రవాళ భిత్తికలు కలవు .
వీటిని (కోరల్ రీఫ్) పగడపు దీవులు అంటారు .

ఈ దీవులలో నీ నార్ కొండం ,బారెన్ దీవులు ,అగ్నిపర్వతం వల్ల ఏర్పడ్డాయి.

లక్షదీవుల కు దక్షిణంగా మినికాయ్ దీవి ఉన్నది.

 ఇక్కడ రకరకాల వృక్ష జీవజాతుల కలవు ఇవి ఎంతో వైవిద్యత తో ఉన్నాయి 

14.భారత దేశం అభివృద్ధి లో హిమాలయాల  పాత్ర ను వ్యాఖ్యనించండి?
Ans.

 1.మధ్య ఆసియా నుండి వీ చే శీతల పవనాల ను భారతదేశంలోకి రాకుండా  అడ్డుకుంటున్నాయి .

2 భారతదేశంలో రుతుపవన శీతోష్ణస్థితి కి వర్షపాత విస్తరణ కు కారణం హిమాలయా లే . 

3.హిమాలయాలలో జీవనదులు ఉండడంవల్ల ఉత్తర భారతదేశం సారవంతమైన ఒండ్రు నేలలు ఏర్పడి వ్యవసాయాభివృద్ధికి ఉపయోగ పడుతుంది .
4.హిమాలయాలలోని లోయలు వేసవి విడుదులు విదేశీ యాత్రికుల ఆకర్షిస్తూ  విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నాయి .

5.ఇక్కడి కలప ఫైన్ దేవదారు వెదురు మొదలగు అటవీ సంపదఆర్థిక అభివృద్ధికి ఔషధ పరిశ్రమకు ఉపయోగపడుతుంది .

6.ఇక్కడ ఖనిజ సంపద రాగి ,జింక్ , నికెల్ బంగారు  ,వెండి లభించును .

 7.ఖైబర్ bolan  కనుమలు సహజ మార్గాలు గా విదేశీ వాణిజ్య అభివృద్ధి కి తోడ్పడును.


15.భారత దేశ మైదానంలలో వ్యవసాయ రంగం  ప్రాముఖ్యత ను  తెలుపండి?
Ans.

1. మైదానాలలో సారవంతమైన ఒండ్రు మట్టి ఉండడంవల్ల వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేయును .

 2.మైదానాల లో నేలలు సహజంగా బంకమన్ను తో ఉంటాయి . సున్నపురాయి  ఫొటోస్ సమృద్ధిగా ఉండును.

3.మైదానాలలో పత్తి ,మిరప, గోధుమ, చెరకు చెరకు వంటి వాణిజ్య పంటలు అధిక ఉత్పత్తి తో సాగవుతున్నాయి.

4. దేశ వ్యవసాయ సంపదలో అధిక భాగం ఈ మైదానాల నుండి లభించును.

5. వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏర్పాటుకు  మైదానాలు దోహదం జేయును .
6.ఒండ్రు మృత్తికలు ఉన్నచోట గొప్ప నాగరికతలు వెల్లివిరిశాయి .

7వ్యవసాయం వ్యాపారం గా మారిన  నా ఈ రోజుల్లో  మంచి మృత్తికలు వ్యవసాయదారుడు చేసే వ్యాపారానికి కావలసిన మంచి ముడిసరుకు.

16.వ్యవసాయరంగాన్ని హిమాలయాలు ఏ విదంగా ప్రభావితం చేస్తున్నాయి..వివరించండి.?
Ans.

హిమాలయాలు లు ఉత్తర భారతదేశం నుంచి వీచే చలి గాలులను అడ్డుకుని భారతదేశ ఋతు పవన శీతోష్ణస్థితి కి కారణం అవుతున్నాయి. .

హిమాలయాలలో ప్రవహించే జీవనదులు ఉత్తర భారతదేశం మైదానాలలో వ్యవసాయ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

 హిమాలయాలు వేసవికాలంలో లో మైదానాలలో వర్షం కురవడానికి నైరుతి రుతుపవనాలు దేశం దాటి పోకుండా అడ్డగించి రుతుపవన శీతోష్ణస్థితి కి కారణం అవుతున్నాయి.
హిమాలయాలు లో ఆల్పైన్  ఉద్ది జాలు or అటవీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంది

17. హిమాలయాలు లేకపోతే భారత ఉపఖండ శీ తోష్ణ స్థితి ఎలా ఉంటుంది వ్యాఖానించండి.?
Ans.

1.ఉత్తర భారతదేశం మంచు ఎడారిగా మారి ఉండేది.

 2.వేసవిలో వర్షపాతం ఉండేది కాదు .

.3.హిమాలయాలు లేకపోతే ఉత్తర భారతదేశంలో జీవనదులు ఉండేవి కాదు .

4.హిమాలయాలు లో అందమైన లోయలు వేసవిలో ఉండేవి కాదు .
5ప్రాచీన వాణిజ్య సంస్కృతి కారకమైన ఖైబర్ bolan కనుమలు ఉండేవి కాదు 

6.అటవీ ఆధార పరిశ్రమ అభివృద్ధి చెందేది కాదు

18.హిమాలయ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితి ద్వీపకల్ప పీఠభూమి కి మధ్య గల తేడా లు వ్రాయండి?
Ans.
హిమాలయ ప్రాంతం భోగోళికస్థితి .
========================
*హిమాలయాలు మూడు భాగాలుగా విభజించి ఉన్నాయి 1 హిమాద్రి 2 హిమాచల్  3.శివాలిక్ పర్వత శ్రేణులు .

*హిమాద్రి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఎత్తయిన పర్వత శిఖరాల తో కూడుకొని ఉంది .
* హిమాచల్ పర్వత శ్రేణి శ్రేణిలో సిమ్లా ముస్సోరి నైనిటాల్ రానిఖేట్ వంటి వేసవి  విశ్రాంతి  స్థావరాలు ఉన్నాయి .

శివాలిక్  పర్వత  శ్రేణి అవక్షేప శిలల తో  ఏర్పడ్డాయి  ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో జమ్ము కొండలు మిసిమి కొండలు అని పిలుస్తారు.

హిమాలయాలలో గంగ సింధు బ్రహ్మపుత్ర నదులు ముఖ్యమైనవి.

దీపకల్ప పీఠభూమి  భౌగోళిక స్థితి .
========================
__ద్వీపకల్ప పీఠభూమి గంగా సింధు మైదానం కు దక్షిణంగా ఉంది .
ఈ పీఠభూమి వైశాల్యం సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు.

 ద్వీపకల్ప పీఠభూమి కఠినమైన అగ్ని శిలలు రూపాంతర  శిలలు తో ఉంది .
.
 ఈ పీఠభూమి కి ఉత్తరాన మాల్వా పీఠభూమి దక్షిణాన ఉన్న దక్కన్ పీఠభూమి గలవు.
 ద్వీపకల్ప పీఠభూమి లో గోదావరి కృష్ణ మహానది కావేరి నదులు ముఖ్యమైనవి.

19.హిమాద్రి అనగా నేమి?
Ans.
1.హిమాలయాలలో ఉత్తరాన ఎత్తయిన పర్వత శ్రేణి ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు .

ఇవి సముద్ర మట్టం నుండి సుమారు 6100 సగటు ఎత్తును కలిగి ఉంటాయి.

 .హిమాద్రి పర్వత శ్రేణులు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి  ఉంటాయి

20.హిమాచల్ శ్రేణులు అనగా నేమి?
Ans.

హిమాద్రి కి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణి నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ అని పిలుస్తారు .
ఈ పర్వతాలు సగటు ఎత్తు 3,700 ఉండి 4వేల 500 మీటర్లు వరకు ఉంటుంది నిమ్న హిమాలయాలలో కులు కాంగ్రా కాశ్మీర్ లోయ లు  ఉన్నాయి

21.శివాలి క్ శ్రేణి అనగా నేమి?
Ans.

 హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి శివాలిక్ పర్వత శ్రేణి అంటారు దీన్ని సగటు ఎత్తు 900 మీటర్ల నుండి 1100 మీటర్లు ఉంటుంది.

22.సింధూ నదీ ఉపనదులు ఏవి?.
Ans.
సింధూ నది ఉపనదులు
జీలం చీనాబ్, రావి  బియాస్ ,సట్లెజ్ . 

23.అంతర్వేది అనగానేమి?
Ans.

 రెండు నదుల మధ్య సారవంతమైన భూభాగాన్ని అంతర్వేది అంటారు.

24.డూ న్ అనగానే మి?
Ans.

హిమాచల్ పర్వతాలు శివాలిక్ కొండలు వేరు చేస్తూ ఉన్న సన్నని సమతల భూతలం గలధైర్య  లోయలను dune లు అంటారు అంటారు.

25.భా బర్ అనగానే మి? 
Ans.

శివాలిక్ కొండల దగ్గర గులకరాళ్ళ తో కూడి ఉన్న సన్నని భూభాగాలను బాబర్ అంటారు. 

26.టెరాయి .అనగానేమి?
Ans.

 చిత్తడి మైదానాల తో కూడి ఉన్న భూభాగాలను  teరాయి అంటారు అంటారు
27.రే  or kallar మైదానం అంటే ఏమిటి?
Ans.

చౌడు లవణాలు స్పటికాలు తో కలిసి ఉన్న భూభాగాలను రే లేదా kallar మైదానాలు అంటారు.

28.ఖాదర్ అనగానేమి?
Ans.

నూతనంగా ఏర్పడిన ఒండ్రు మైదానాన్ని ఖాదర్ అంటారు

బంగర్ అనగా నేమి ?
Ans.

ప్రాచీన కాలంలో  ఏర్పడిన మైదానాన్ని ఒండ్రు మైదానాన్ని బంగర్ అంటారు

29.డెక్కన్ పీఠభూమి అనగానేమి?
Ans.

భారతదేశ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని దక్కన్ పీఠభూమి అంటారు

30.కోరల్ రీఫ్ అనగానేమి?
Ans.

సాంకేతిక భాషలో ప్రవాళ భిత్తికలు గా పిలువబడే పగడపు దిబ్బ కోరల్ రీఫ్ అంటారు

31.తూర్పు తీ రప్రాంత  స్థానిక నామములు (పేర్లు) ఏవి?
Ans. 

ఉత్కల్ తీరం (ఒడిస్సా) సర్కార్ తీరం (ఆంధ్ర ప్రదేశ్ )కోరమాండల్ తీరం (తమిళనాడు)

2.పశ్చిమ తీర ప్రాంత స్థానిక పేర్లు  ఏవి?
Ans.

 గుజరాత్ తీరం( గుజరాత్ )కొంకణ  తీరం (మహారాష్ట్ర   గోవా ),కెనరా తీరం (కర్ణాటక )మలబార్ తీరం. (కేరళ)

33.కర్కటరేఖ  ఏ   ఏ  రాష్ట్రాల గుండా వెళ్తుంది?
Ans.

గుజరాత్ ,రాజస్థాన్, మధ్యప్రదేశ్  , చత్తీస్ ఘడ్ jharkhand  పశ్చిమ బెంగాల్. త్రిపుర మిజోరాం.


34.అంగారభూమి అనగానేమి?
Ans.

 టెథస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న angara భూమి అంటారు

35.గోండ్వానాభూమి అనగానేమి?  
Ans


 టెథిస్స ముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి అంటారు

36. జీవనది అనగానేమి?
Ans.

సంవత్సరం పొడవునా  ప్రవహించే నదిని జీవనది అంటారు వీటికి ఉదాహరణలు హిమాలయాలలో ప్రవహించే సింధు నది గంగా నది వాటి ఉపనదులు

37.దీ వులు అనగానేమి?
Ans.

నాలుగు వైపులా నీటిచే ఆక్రమించబడిన మధ్యలో భూ భాగం ఉన్న స్థితిని దీవులు అంటారు ఉదాహరణలు అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు

38.భారత దేశ కేంద్రపాలిత ప్రాంతాలు  ఏవి?
Ans.

1.అండమాన్ నికోబార్ దీవులు 2.చండీగర్ 3.దాద్రా నగర్ హవేలీ 4.డామన్ డయ్యు 5
పాండిచ్చేరి 6.లక్షదీవులు7ఢిల్లీ 8.జమ్ము 9.లడక్

39.అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడ్డ దీవులు ఏవి?
Ans.


Narkondam దీవులు ,బారెన్ దీవులు

40.భారత దేశ  దక్షిణ చివరి పాయింట్  ఏది.?
Ans.
ఇందిరా పాయింట్

41తూర్పున.అరుణాచల్ ప్రదేశ్  నుండి   పశ్చిమాన గుజరాత్ మధ్య  2గ౦"వ్యత్యాసం ఉంటుంది  .ఎందుకు? వివరించుము.? 
Ans.

తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు  దూరం 30 డిగ్రీల రేఖాంశాలు ఉన్నందున రెండు గంటలు వ్యత్యాసం నమోదు అవుతుంది.

42.అంతస్తలీయ ప్రవాహం అనగానేమి? 
Ans.

ఎడారులలో ప్రవహించే నదులు సముద్రాన్ని చేరకుండా భూభాగంలో  అంతమయ్యే  ప్రవాహాలను  అంతస్థలియా    ప్రవాహంం అంటారు.

43.శు ష్క వాతావరణం అనగానేమి?
Ans.
సంవత్సరిక వర్షపాతం తక్కువగా ఉన్నా స్థితిని  సుష్క   వాతావరణం అంటారు. 

44 .కనుమ అనగానేమి?
Ans.

పర్వతాల మధ్య ఉన్న దారులు (సహజ మార్గాలను) కనుమ అంటారు ex. కైబర్,  bolan కారకోరం.

45.మాక్ డో క్, డింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలవు?
Ans.

మేఘాలయ రాష్ట్రం 

46.హిమాచల్  శ్రేణిలో గల ముఖ్య పర్వత శ్రేణలు ఏవి?
Ans.

 pir panjal మహాభారత పర్వత శ్రేణులు.

47.హిమాచల్ శ్రేణీ లో గల లోయలు ఏవి?
Ans.

కాశ్మీరు లోయ ,కాంగ్రా లోయ ,కులు లోయ లు మొదలగునవి.

48 హిమాచల్ శ్రేణీ లో గల వేసవి విడిది కేంద్రాలు ఏవి?
Ans.

సిమ్లా ముస్సోరి నైనిటాల్ రానిఖేట్ వంటి వేసవి విడిది కేంద్రాలు గలవు.

49.హిమాచల్ శ్రేణి లో గల అరణ్యాలు ఏవి?
Ans.

సతత  హరిత అరణ్యాలు .

50.భారత దేశ (కాలమాన రేఖ)
 ప్రామాణిక రేఖాంశం ఏది?
Ans.

82 1/2° తూర్పు రేఖాంశం.

51.I. S. T. అనగానే మి? విస్తరించు ము?
Ans.

Indian standard  time భారత ప్రామాణిక సమయము.

52.G. M. T. ను విస్తరించుము?
Ans.

గ్రీనిచ్ ప్రామాణిక సమయము ( greenwich mean time)

53.ఇండియా భూభాగంతో  సరిహద్దు కలిగిన దేశాలు ఏవి?
Ans.

పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్ ,చైనా  నేపాల్  ,భూటాన్ బంగ్లాదేశ్ ,మయన్మార్.


54.భారత దేశం తో జలాభాగ  సరిహద్దు గల దేశం ఏది?
Ans.

 శ్రీలంక.

56.పూర్వాంచల్ పర్వతాల  ప్రాంతీయ నామా లు (పేర్లు) ఏవి?
Ans.

పాట్ కాయ్ కొండలు, నాగ కొండలు ,మణిపురి కొండలు  కాశీ కొండలు ,మిజో కొండలు అంటారు.

   
......