Translate

12, నవంబర్ 2020, గురువారం

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

 

ప్రశ్నల సమాధానం నిధి.

1.రాజ్యాంగ సభ అంటే ఏమిటి?

భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన కోసం స్వాతంత్రానికి ముందు ఏర్పాటు చేసినటువంటి సభ్యుల సమూహాన్ని రాజ్యాంగ సభ అంటారు.
1946లో రాజ్యాంగ సభ సభ్యులు ను రాష్ట్ర శాసన సభలు పరోక్షంగా  ఎన్నుకున్నా యి

2.రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి?


భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, ,లక్షణాలను  మూల తత్వాలు లను, వివరించే ముందు భాగమే  రాజ్యాంగ ప్రవేశిక .దీనిని నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాలకు అనుగుణంగా రూపకల్పన చేశారు.

3.ఏక పౌర సత్వం అంటే ఏమిటి?

ఒక దేశానికి చెందిన నివాస పరమైన చట్టబద్ధమైన హక్కు ను ఏక పౌరసత్వం అంటారు. 
భారతదేశంలో ఒకే పౌరసత్వం అమలులో ఉంది.

4.సమాఖ్య వాదం అనగానేమి?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చేసుకుని ఎవరి పరిధిలో వారు చట్టబద్ధంగా పరిపాలన చేసుకోవడాన్ని సమాఖ్య విధానం అంటారు .

5.పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏమిటి?

లోక్ సభ , రాజ్య సభ ,మరియు రాష్ట్రపతి  కలిసి పార్లమెంట్ ఏర్పడుతుంది. 
పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు దేశానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు రాష్ట్రపతి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడం.

6.అధ్యక్ష తరహా విధానం అనగానేమి?

దేశానికంతటికీ పరిపాలన బాధ్యత వహించే విధానాన్ని అధ్యక్ష తరహా విధానం అంటారు .

.ఇందులో అధ్యక్షుడు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి గా వ్యవహరించి పరిపాలన బాధ్యత అంతా తన చేతిలో ఉంచుకుంటాడు .


7.భారత రాజ్యాంగం లో అధికారాలు ఎన్ని 
జాబితా లు గా విభజించారు?అవి ఏవి?

భారత రాజ్యాంగంలో అధికారాలను మూడు రకాలుగా మూడు జాబితాలు గా విభజించారు అవి .
1కేంద్ర జాబితా 
2. రాష్ట్ర జాబితా .
3ఉమ్మడి జాబితా

8.ముసాయిదా రాజ్యాంగ o లో అధికరణాలు ,షెడ్యూళ్లు ఎన్ని?

ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణ లు 8 షెడ్యూళ్ళు కలవు భారత దేశం ముసాయిదా రాజ్యాంగం అతి పెద్దది.

9.ప్రస్తుత రాజ్యాంగ o లో అధికరణా లు షెడ్యూళ్లు  ఎన్ని?

ప్రస్తుతం బారత రాజ్యాంగంలో 448అధికరణలు .
12 షెడ్యూళ్ళు 
25 భాగాలు కలవు.

10.అఖిల భారత సర్వీసులు అంటే ఏమిటి?

భారతదేశానికి అంతటికీ పరిపాలనా పరమైన సర్వీసులను అందించే అధికారులను అఖిల భారత సర్వీసులు అంటారు ఉదాహరణ ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్.(I.A.S.  I.P.S.)

11. రాజ్యాంగ o లోని మౌలిక సూత్రాలు వివరించండి?.

భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలు 1.పార్లమెంటరీ వ్యవస్థ 
2.సమాఖ్య వ్యవస్థ .
3.సర్వసత్తాక దేశం.
4. ఒకే న్యాయ వ్యవస్థ .
5.లిఖిత పూర్వక రాజ్యాంగం.
6. అఖిల భారత సర్వీసులు .
7.సంక్షేమ రాజ్యం మొదలగునవి

12.భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య  సూత్రాలు పేర్కొనండి?

13.రాజ్యాంగ ప్రవేశిక లో కొత్తగా చేర్చిన పదాలు ఏవి?

భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన అటువంటి పదాలు "సామ్యవాద"" లౌకిక "అనే పదాలను చేర్చడం జరిగింది.

14 రిజర్వేషన్లు అంటే ఏమిటి?

సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గానికి ముఖ్యంగా షెడ్యూలు కులాలు ,షెడ్యూల్ తెగలకు ,ఆర్థిక ,సామాజిక ,రాజకీయ య న్యాయాన్ని ,సమానత్వాన్ని  సాధించడానికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని చర్యలు  చేపట్టారు వాటిని రిజర్వేషన్లు అంటారు.

15.పార్లమెంటరి ,  అధ్యక్ష తరహా విధానం మధ్య వ్యత్యాసాలు తెల్పుము?

పార్లమెంటరీ విధానం:-
పార్లమెంటరీ విధానంలో అధ్యక్షుడు నామమాత్రం.
 ప్రధానమంత్రి యదార్థ పాలకుడు .
కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ లో అంతర్భాగం మంత్రులు అందరూ దీనిలో సభ్యత్వం కలిగి ఉంటారు 
పార్లమెంటరీ విధానంలో అధ్యక్షుడు మంత్రి మండలి సలహాలకు కట్టుబడి ఉండాలి .పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి మంత్రులకు అధిపతి గా వ్యవహరిస్తాడు.

అధ్యక్ష తరహా విధానం:-

అధ్యక్ష తరహా విధానం లో అధ్యక్షుడే సర్వాధికారి అన్ని నిర్ణయాలు అధ్యక్షుడే తీసుకుంటాడు.
 కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ లో అంతర్భాగం కాదు.
 అధ్యక్షులకు వివిధ సలహాదారులు సలహాలు అందిస్తారు .
శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖల మధ్య అధికార పంపిణీ ఉంటుంది.

16."సమానత్వం" భావన ను తెల్పే కరపత్రం తయారు చేయండి?

పాఠశాల సమాజపు ప్రతి రూపం.
 వివిధ  సమూహాల నుండి పిల్లలు పాఠశాలకు రావడం జరుగుతూ ఉంటుంది .
పాఠశాలలో లో పిల్లలకు పేద ధనిక అనే  భావనలు రాకుండా అందరికీ ఒకే రకమైన యూనిఫామ్స్ ఉంటాయి.
 అలాగే అందరూ కలిసి మెలిసి మధ్యాహ్న భోజన సమయంలో ఆహారాన్ని తీసుకుంటారు.

 చదువుకునే సమయంలో ఆటల సమయంలో అందరూ కలిసి మెలిసి ఆడుకోవడం సమానత్వ భావనను పెంపొందిస్తుంది.

17.ఉమ్మడి జాబితా లోని రెండు అంశాలు  ఉదా లివ్వండీ?

వివాహాలు . విడాకులు  పౌర విచారణ స్మృతి  శిక్షాస్మృతి  ,విద్య  మొదలగునవి.

18.మానవతా విశ్వసూత్రం  ఆధారంగా ఏ దేశ రాజ్యాంగం రూపకల్పన  చేశారు?

 మానవతా విశ్వ సూత్రం ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన దేశం జపాన్.

19.రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాలు ఏవి? తెల్పుము?.

రాజ్యాంగ సభ చేసుకున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా
 1.కేంద్ర అధికారుల సంఘం.
2 కేంద్ర రాజ్యాంగ సంఘం .
3.రాష్ట్ర రాజ్యాంగ సంఘం.
 4ప్రాథమిక హక్కులు .
5.అల్పసంఖ్యాక వర్గాలు.
 6.గిరిజన ప్రాంతాలు .
వంటివాటిపై సలహా సంఘాలను ఏర్పాటు చేశారు
20. దేశఐక్యత కాపాడటానికి ముసాయిదా రాజ్యాంగ మూడు ముఖ్య విధానాలు ఏవి?

భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం భారతదేశ ఐక్యతను కాపాడేలా రూపకల్పన చేశారు ఇందుకుగాను రాజ్యాంగంలో మూడు విధానాలు అనుసరించారు 

1 ఒకే   న్యాయవ్యవస్థ .
2 పౌర నేర అంశాలలో మౌలిక చట్టాలలో సారూప్యత 

3 ముఖ్యమైన పదవులలో నియమించడానికి దేశమంతటికీ అఖిలభారత సివిల్ సర్వీసులు వ్యవస్థను నెలకొల్పారు.

21. లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?

 నేపాల్ దేశం రాజ్య ప్రవేశిక పేర్కొంది .

22.శాంతి  కాముకత ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది ?

జపాన్ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.


11, నవంబర్ 2020, బుధవారం

జాతీయోద్యమం

 ప్రశ్నల సమాధానములు నిధి.


1.జాతీయోద్యమం  అంటే ఏమిటి?

భారత స్వాతంత్ర పోరాటంలో సామాన్య ప్రజానీకం నుండి సంస్థానాల రాజులు వరకు ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసినందున దీన్ని జాతీయ ఉద్యమం అంటారు.


2. ముస్లిం లీగ్  పార్టీ గురించి తెల్పుము?

ముస్లింలీగ్ పార్టీని 1906 సంవత్సరంలో స్థాపించారు. .
ఇది ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ . ఈ లీగ్ కృషివల్ల  1909వ సంవత్సరంలో  ముస్లిం   ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి .
పార్టీకి 1930 వరకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లేదు. 1937లో ముస్లిం పార్టీ 102 స్థానాలను గెలుచుకుంది 
1940 నుండి  ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది.
1946లో రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలలో విజయభేరీ మోగించింది. 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినం నిర్ణయించింది అనేక చోట్ల మతపరమైన దాడులు చెలరేగాయి

3.క్యాబినెట్ మిషన్  లోని సభ్యులు ఎవరు?
కేబినెట్ మిషన్ లోని సభ్యులు lord penthik Lawrence, sir Stafford cripps, A.V.Alexander .

4.బ్రిటీష్ ఇండియా లో  మొదటి ఎన్నికలు ఎన్ని రాష్ట్రాలలో ,ఎప్పుడు నిర్వహించారు?

బ్రిటిష్ ఇండియాలో మొదటి ఎన్నికలు 11 రాష్ట్రాలలో   1937 సంవత్సరంలో నిర్వహించారు. 11 రాష్ట్రాలకు ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

5.వ్యక్తిగత సత్యాగ్రహం అంటే ఏమిటి?

స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు మొదలైన వాటితో నిమిత్తం లేకుండా వ్యక్తులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జాతీయ నాయకులు  ఒక్కొక్కరు  వ్యక్తిగతంగా జైలుకు వెళ్లార. దీనిని వ్యక్తిగత సత్యాగ్రహం అంటారు.

6.స్వాతంత్య్ర ఉద్యమం లో హిందూ మహాసభ,  (R. S. S). రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ఏమిటీ?

స్వాతంత్ర ఉద్యమంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయినా ఆర్ ఎస్ ఎస్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పని చేశాయి .
కులం వర్గాలను అధిగమించి హిందువులు అందరినీ ఏకం చేసే సామాజిక జీవితంలో సంస్కరణ తీసుకురావాలని ఇవి ప్రయత్నించాయి. ఈ సంఘ కార్యకలాపాలలో అనేకమంది కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రభావితమయ్యారు
ఆర్ ఎస్ ఎస్ వల్ల ముస్లిం ప్రజల్లో కొంత అభద్రతా భావం ఏర్పడింది.


7." విభజించు పాలించు"అన్న విధానాన్ని వ్యాఖ్యానిo చండి? .

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో అనుసరించినా విధానాన్ని విభజించు పాలించు అంటారు ఈ విధానం లో (విభిన్న ప్రాంతాలుభిన్న ప్రాంతాలు, మతాలూ,మతాలు  తెగల  మధ్య  బేధాభిప్రాయాలు  నెలకొల్పడం) భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం మైనార్టీ వర్గాల మధ్య విభేదాలను సృష్టించి మతకలహాలకు కారణమయింది ఇలాంటి విధానాలను అవలంబించి భారతదేశాన్ని మరికొంత కాలం పరిపాలన చేయాలనేదే బ్రిటిష్ వారి అభిమతం

8.ముస్లిం లీగ్ పార్టీ వల్ల జరిగిన రాజకీయ పరిణామాల ఏమిటి?
R

9.ప్రత్యేక నియోజకవర్గాల విశేషం ఏంటి?

భారతదేశంలో 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు లో భాగంగా మత ప్రాతిపదికన ముస్లింలకు కొన్ని స్థానాలను ప్రత్యేకంగా రిజర్వు చేయడాన్ని ప్రత్యేక నియోజకవర్గం అంటారు.

 Q.కమ్యూనల్ అవార్డ్ అనగా నేమి?

భారతీయ సమాజాన్ని కుల ప్రాతిపదికన విడదీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కమ్యూనల్ అవార్డ్ లేదా ప్రత్యేక నియోజకవర్గాలు. దీన్ని ప్రతిపాదించినది రామ్సే మెక్డొనాల్డ్
 ఇందులో లో దళిత వర్గాలకు ప్రత్యేక ఏలెక్టరేట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గాంధీ అంబేద్కర్ పూనా ఒప్పందం ద్వారా దీనిని  రద్దు చేయడమైనది .గాంధీజీ సంయుక్త  ఏ లెక్టరేట్  
ప్రతిపాదించారు.

10.క్రిప్స్ రాయబారo విశేషాలు ఏమిటి?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ సైన్యం యొక్క  ప్రజల  ల యొక్క మద్దతు కోరుతూ భారత జాతీయ నాయకులతో 1942 వ సంవత్సరంలో   sir Stafford cripps నాయకత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశాన్ని   cripps రాయబారం ఉంటారు
ఈ సమావేశం తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని క్రిప్స్ ప్రకటించారు.


11.క్విట్ ఇండియా ఉద్యమం గురించి వ్యాఖ్యానిo చండి?

క్రిప్స్ రాయబారం విఫలం అయిన తర్వాత 1942లో ఆగస్టు లో కాంగ్రెస్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది దేశం నుండి బ్రిటిష్ వారిని వెళ్లగొట్టాలని ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఈ ఉద్యమంలో నే గాంధీజీ గారు "డూ ఆర్ డై "అనే నినాదం ఇచ్చారు .
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకం నుండి విద్యార్థులు కార్మికులు రైతులు అందరూ కూడా దేశవ్యాప్త ఆందోళన చేపట్టడం జరిగింది ఇందులో బ్రిటిష్ వారి ఫ్యాక్టరీలలో కళాశాలలో పోలీస్ స్టేషన్లు పోస్ట్ ఆఫీసులు రైల్వే స్టేషన్లు లలో సమ్మె చేయడం జరిగింది

12. జాతీయోద్యమం లో భారత జాతీయ సైన్యం పాత్ర ( I.N.A.)ను పేర్కొనుము?

 ఐ .ఎన్ .ఏ . అనగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ సైన్యాన్ని కి  కి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించడం జరిగింది జపాను సహాయంతో భారత్లోని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారత జాతీయ సైన్యం పోరాడాల్సింది .దీని ప్రధాన కార్యాలయం రంగూన్ ,సింగపూర్ లో స్థాపించారు. ఈ ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ "చలో ఢిల్లీ ""  జైహింద్ "అని నినాదాలు ఇచ్చారు.
 రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.


13. స్వాతంత్ర్యం తర్వాత బా రత దేశం లో విలీనం ఐన సంస్థానాలు ఏవి,?

భారతదేశంలో  సంస్థానంలో విలీనం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.

 స్వాతంత్రం తర్వాత భారతదేశం లో విలీనమైన సంస్థానాలు .
కాశ్మీర్,  హైదరాబాద్,  జునాగఢ్.

1947 సంవత్సరం లో పాకిస్తాన్ కాశ్మీర్  పై దండెత్తినప్పుడు కాశ్మీర్ రాజు భారతదేశంలో విలీనం కావడానికి భారత దేశంలో విలీనం కావడానికి అంగీక రించారు.

హైదరాబాద్ సంస్థానాన్ని పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది .

జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశంలోకి కలవడం జరిగింది.

14."తెభాగ" ఉద్యమం అంటే ఏమిటి?

బెంగాల్ లో భూస్వాముల నుంచి భూమిని సాగు తీసుకున్న రైతులు కౌలు పరిమాణం మూడింట రెండు వంతులు పెంచాలని ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమాన్ని తెభాగ
ఉద్యమం అంటారు


15. సంస్థానాలు విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ను పేర్కొనండి? 

భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినప్పుడు సుమారు 550 పైగా సంస్థానాలకు కూడా స్వాతంత్రం ప్రకటించడం జరిగింది .ఈ సంస్థానాలు భారతదేశంలో లో నైనా పాకిస్తాన్ లోనైనా లేదా స్వతంత్రంగా అయినా ఉండడానికి అవకాశం ఇచ్చారు.

స్వతంత్రం తర్వాత సంస్థానాల విలీనం ఆ బాధ్యత భారత మొదటి హోం శాఖ మాత్యులు "సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఉంచడం జరిగింది వీటిని ఆయన చాలా చాకచక్యంగా భారతదేశంలో విలీనం చేశారు. అయితే జునాగఢ్, హైదరాబాద్ ,కాశ్మీర్ సంస్థానాలు .విలీనం కాలేదు వీటిని స్వాతంత్రం తరువాత ప్రత్యేక చర్యల ద్వారా భారతదేశంలో కలిపారు జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశం లో కలవడం జరిగింది హైదరాబాద్ పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేశారు కాశ్మీర్ పై పాకిస్తాన్ దండెత్తడం తో కాశ్మీరు రాజు భారతదేశంలో విలీనానికి అంగీకరించారు

16.భా రత దేశ విభజన కు దారి తీసిన వివిధ కారణాలు  తెలపండి?

బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అనుసరించినా విభజించు పాలించు అనే విధానం .
భారతదేశానికి విభజనకు దారి తీసింది .

ముస్లిం మైనార్టీల లో అభద్రతా భావం .

ముస్లింలీగ్ సభ్యులు తాత్కాలిక ప్రభుత్వం లో చేరిన ప్రభుత్వ పరిపాలన సరైన సహకారం అందించకపోవడం.

ముస్లిం లీగ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ ప్రయత్నాలు విఫలం కావడం

 ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినం జరపడం .మతకలహాలు మతకలహాలు .
మహమ్మద్ ఇక్బాల్ లాంటి కవులు కూడా పాకిస్తాన్ అనే భావనను సమర్థించడం.

 ఈ కారణాల వల్ల భారతదేశం పాకిస్థాన్ రెండుగా విడిపోయింది

17.స్వాతంత్ర్య ఉద్యమం లో గాంధీజీ పాత్ర ఏమిటి?

గాంధీజీ భారతదేశానికి 1915 వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి రావడం జరిగింది.
1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించి సత్యం అహింసల పై ఆశ్రమాన్ని నడిపారు 1917 బీహార్ లోని చంపారన్ రైతుల సత్యాగ్రహం నిర్వహించి విజయవంతం అయ్యాడు 1919 సంవత్సరం లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ సంఘటన కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించారు .1920 -22 సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి "సత్యం  అహింస "అనే సిద్ధాంతాలతో భారత దేశానికి స్వాతంత్రం తీసుకు రావడం జరిగింది

18.సుభాష్ చంద్రబోస్ లో మీకు నచ్చిన  గుణాలు ఏవి? ఎందుకు?

భారత జాతీయోద్యమ నాయకుడు లో సుభాష్ చంద్ర బోస్ ముఖ్య నాయకుడు విదేశాలలో(ఐ ఎన్ ఏ అనే సైన్యాన్ని) భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై అత్యంత సాహసోపేతంగా యుద్ధాన్ని ప్రకటించారు.
ఈయన  సైన్యాన్ని అజాద్ హింద్ ఫౌజ్ అంటారు. నినాదాలు "చలో ఢిల్లీ" జై హింద్"

19(.డొమినియన్) రాజ్య ప్రతిపత్తి అంటే ఏమిటి?

భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం కాకుండా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండే స్వాతంత్రాన్ని ఇవ్వడం.


20.దేశవిభజన లో  మౌంట్ బాటెన్ విధానాలు పేర్కొనండి?

1947 ఫిబ్రవరి లో వావేల్ లో స్థానం లో వైస్రాయ్ గా మౌంట్ బాటెన్ వచ్చారు .అప్పటికి భారత దేశంలో లో కాంగ్రెస్ ముస్లింల మధ్య బేధాభిప్రాయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి 

మౌంట్ బాటన్ మరోసారి కాంగ్రెస్ ముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేశారు .
కానీ విఫలమయ్యాయి విఫలమయ్యాయి .

.దాంతో 1947 జూన్ 3న ఒక ప్రణాళికను రూపొందించి ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని పాకిస్తాన్ ను విభజించడానికి నిర్ణయం తీసుకున్నారు

 ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ముస్లింలీగ్ అంగీకరించాయి.




💐💐💐💐💐💐💐💐💐
            💐💐💐💐.

8, నవంబర్ 2020, ఆదివారం

వలస పాలిత ప్రాంతాల లో లో జాతి విముక్తి ఉద్యమాలు

 

               ప్రశ్నల సమాధానములు నిధి.

1 వలస పాలిత దేశాలు అంటే ఏమిటి?

ఒక దేశం మరొక దేశం యొక్క పరిపాలన నియంత్రణలో ఉంటే అటువంటి దేశాలను వలస పాలిత దేశాలు అంటారు .
ఉదా: ఇంగ్లాండ్ యొక్క వలస పాలిత దేశం ఇండియా


2.జాతీయత భావం అంటే ఏమిటి?

ఈ దేశం నాది అనేటువంటి భావన కలిగి ఉన్న దాన్ని జాతీయత అంటారు

3.ప్రజాస్వామ్యo అంటే ఏమిటి?

ప్రజాస్వామ్యం అనగా ప్రజా పరిపాలన అని అర్థం డెమోక్రసీ అనే ఆంగ్ల పదo " డెమో స్ "  "క్రే షియా " అనే రెండు గ్రీకు  పదాల కలయిక  కలయిక వల్ల  వల్ల ఏర్పడినది .
 demos అనగా ప్రజలు.
 "క్రేషియా "అనగా పరిపాలన.
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ నిర్వహించడాన్ని ప్రజాస్వామ్యం అంటారు

4. నైజీరియా జాతీయవాద ముందు ఉన్న రెండు సమస్యలు ఏవి?

  1.బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం .2.ఘర్షణ పడుతున్న వివిిిిిిిిిిధ తెగల మధ్య ఐక్యమత్యం సాధించడం.




5.సన్ యేట్ సేన్ మూడు సిద్దాంతాలు ఏవి?

 సన్ యేట్ సేన్ 3 సిద్ధాంతాలు  ("son "min """chui")

ఇవి ఏమనగా 
1.జాతీయవాదం ;:-అంటే విదేశీ పాలకుల గా భావించబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్య శక్తులను తొలగించడం .
2.ప్రజాస్వామ్యం::- ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
3.సామ్యవాదం::- అంటే పరిశ్రమలపై నియంత్రణ భూమి లేని రైతాంగానికి  భూమి పంచడం.

6.యుద్దప్రభువులు అంటే ఎవరు?

చైనాలో స్థానిక సైనిక నాయకులను యుద్ధ ప్రభువులు అని పిలిచేవారు

7.".మే నాలుగు ఉద్యమం "ను వివరించండి?


1919 may 4. బీజింగ్లో లో ఒక నిరసన ప్రదర్శన ప్రారంభమైంది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన పోరాడినప్పటికీ జపాన్ పొందిన విభాగాలను చైనా తిరిగి పొందలేకపోయింది దీన్ని నిరసిస్తూ మే 4 1919 న చేపట్టిన ఉద్యమాన్ని మే 4 ఉద్యమం అంటారు
ఇందులో లో  ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రజాస్వామ్యం జాతీయవాదం  ద్వారా  ముందుకు వెళ్లాలని విదేశీయులను తరిమివేయాలని పేదరికాన్ని తగ్గించాలని మహిళల పరాధీనత ఆడపిల్లల పాదాల కట్టివేయడం వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.

8."సియావో షిమిన్" అనగానేమి?.

చైనాలో మధ్యతరగతి పట్టణ ప్రజలను సియావో షిమిన్ అంటారు

9.సోవియట్లు అంటే ఏమిటి?

రష్యాలో ఉండే స్థానిక రాష్ట్రాలను సోవియట్ లు అంటారు.
రష్యా విప్లవం కంటే ముందు ఏర్పడిన కార్మిక కర్షక సంఘాలను సోవియట్ లు అంటారు.


10.లాంగ్ మా ర్చ్ అనగానేమి?

చైనాలో కమ్యూనిస్టులు( రెడ్ ఆర్మీ ) 6000 కిలోమీటర్ల సైనిక  కవాతు నిర్వహించడాన్ని లాంగ్ మార్చ్ అంటారు.

11.భూసంస్కరణలు అంటే ఏమిటి?
పెద్దపెద్ద భూస్వాములు నుండి భూమిని సేకరించి పేద ప్రజలకు పంచి పెట్టడాన్ని
భూసంస్కరణలు అంటారు. 

12.వియత్నాం వలస పాలన అను భవం వివరించండి?


13. వియత్నాం భూ సంస్కరణలు తీరు తెలపండి?

వియత్నాంలో 1945 ఆగస్టు లో హోచిమిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమిక అవును 25 శాతం తగ్గించారు మారు కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు కౌలుదార్లకు మాఫీ చేశారు వియత్నాం విద్రోహుల భూమిని పంచ సాగారు

భూసంస్కరణల తో  1954లో ఉత్తర వియత్నాం లో కొత్త యుగం మొదలయ్యింది .
భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పేద రైతులకు భూమి పంచిపెట్టారు .
రైతుల కలలు నిజం చేయడంలో లో వియత్నాం ప్రభుత్వం సఫలీకృతం అయింది
 కాబట్టి రైతులకు మద్దతు పూర్తిగా ప్రభుత్వాలకు లభించింది.

14 .వియత్నాం ప్రధాన ఎగుమతులు ఏవీ?

వియత్నాం ప్రధాన ఎగుమతులు వరి రబ్బర్ పంటలు

15.వియత్నాం రైతాంగం  సమస్యలు పేర్కొనండి?

వియత్నాం దేశం ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలన కింద దశాబ్దాలపాటు ఉండడంవల్ల సామాన్య రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది .

.భూమి లేకపోవటం .
అధిక కౌలు పరిమాణం ఉండటం .
అధిక వడ్డీ భారం కింద రైతాంగం నలిగిపోవడం వెట్టి కార్మికులుగా చేయడం .
వంటివి వియత్నాం రైతాంగం ఎదుర్కొన్నది

16.వియత్నాం లో జాతీయతావా దం ఎలా విస్తరించింది? వివరించండి?

I .వియత్నాంలోను స్థానికులను నాగరికులుగా చేయడానికి విద్య ఒక మార్గంగా భావించారు .

ఫ్రెంచ్ వాళ్ళు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు విద్యార్థులు గుడ్డిగా అనుసరించకుండా కొన్నిసార్లు బహిరంగంగా మౌనంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండేవారు.
 టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాఠాలు బోధించేవారు.
 దేశ భక్తి భావంతో సమాజ ప్రయోజనాల కోసం పోరాడటం విద్యావంతుల విధి అని బోధించేవారు 
20వ శతాబ్దంలో ఆరంభంలో  ఆధునిక విద్య కోసం వియత్నాం విద్యార్థులు జపాన్ కి వెళ్లారు.
 ఫ్రెంచ్ వాళ్లను తరిమివేయడం కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి అంతకు ముందు ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడం ముఖ్య విధిగా జాతీయ భావంతో పని చేశారు.


17 .ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏమిటి?

ఏజెంట్  ఆరెంజ్ అత్యంత విష పదార్థం ఇది ఆకులు రాలి పోయేలా చేసి మొక్కల్ని చంపే విషం

18.నై జీరియా గిరిజన జాతులు ఏవి?

నైజీరియాలో "హౌసా పులానీ " ఈ ప్రజలు ఉత్తర భాగంలో అధికంగా ఉండేవారు అదేవిధంగా  లో ఆగ్నేయ భాగంలో లో" ఈ బో తెగ ""నైరుతి భాగంలో" యరు బా".

19.ఖండాం త ర ఆఫ్రికా వాదం అంటే ఏమిటి?

దేశ తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడానికి ఖండాంతర ఆఫ్రికా వాదం అంటారు దీన్ని సాధించడానికి కృషి చేసిన వ్యక్తి  కామెన్ క్రుమా..



20.వియత్నాం నూతన గణతంత్ర వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్ల ను పేర్కొనండి?

21.చైనా, వియత్నాం, భారత దేశాలలో ని భూ సంస్కరణలు ను పోల్చండి?

చైనా దేశంలో 1950లో భూసంస్కరణల అమలు పెట్టారు గ్రామాలలో ఉన్న ప్రజలను గుర్తించి భూస్వాముల భూముల స్వాధీనం చేసుకుని పంచడం మొదలుపెట్టారు ప్రాం తీయ స్థాయిలో భూ సంస్కరణల సంఘం కీలక పాత్ర పోషించింది చైనా 43 శాతాన్ని గ్రామీణ ప్రజలు 60 శాతానికి పంచిపెట్టడం లో భూసంస్కరణలు విజయం సాధించాయి.

వియత్నాంలో 1954 తర్వాత భూస్వాముల భూముల స్వాధీనం చేసుకొని భూమి లేని రైతాంగానికి పంచి పెట్టడం జరిగింది రైతుల కలలు నిజం చేయడంలో వియత్నాం ప్రభుత్వం సఫలీకృతం అయింది..

భారతదేశంలో  నెహ్రూ ప్రభుత్వం  3 రకాల   భూ సంస్కరణలను ప్రవేశపెట్టింది .

1.జమిందారీ వ్యవస్థ .
2కౌలు విధానాల సంస్కరణ.
3. భూ పరిమితి విధానాలు .

దున్నేవాడిదే భూమి  అనే లక్ష్యంతో  భూసంస్కరణలు ప్రారంభించారు అయితే పూర్తిస్థాయిలో భారతదేశంలో భూసంస్కరణలు  అమలు కాలేదు

22.వియత్నాం లో అమెరికా జోక్యం  ఎందుకు చేసుకున్నది?

తమ శత్రువులైన కమ్యూనిస్టుల ప్రాబల్యం వియత్నాంలో పెరుగుతున్నందున ఆందోళన చెంది అమెరికా వియత్నాంలో యుద్ధానికి దిగింది

23.నాపాలం బాంబు అంటే ఏమిటి?

మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబును నాపాలం బాంబు అంటారు.

24.నైజీరియాలో చమురు, పర్యావరణo,రాజకీయాల  ప్రభావాన్ని  తెల్పుము?.

డెల్టాలో 1950లో ఎవరు కనుగొన్నారు చమురుకనుగొన్నారు  డ చ్ సెల్ కంపెనీలు ఆధ్వర్యంలో వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి.
 చమురు వెలికి తీసి తమ లాభాల్లో కొంత సైనిక పాలకులకు అందించాయి.
 సాధారణ ప్రజలకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా యదేచ్ఛగా చమురు వెలికి తీయడం వల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి .
జీవావరణ వ్యవస్థ దెబ్బతిని మడ అడవులు అంతరించాయి. దీంతో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలను (క్యాన్సర్ లాంటి వ్యాధులు)  ఎదుర్కోవలసి వచ్చింది .

💐💐💐💐💐💐💐💐

7, నవంబర్ 2020, శనివారం

నివాస ప్రాంతాలు వలసలు

 

నివాస ప్రాంతాలు- - వలసలు.

1.నివాసప్రాంతం అంటే ఏమిటి?

ఒక ప్రదేశంలో మనం నివసించడానికి అనుకూలంగా ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని నివాస ప్రాంతం అంటారు.

2.విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి?

పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడిన నివాసయోగ్యమైన నగరాలను విమానాశ్రయ నగరాలు అంటారు.

3.పట్టణీ కరణ అనగానేమి?

పట్టణ జనాభాలో పెరుగుదల నే పట్టణీకరణ అని అంటారు పట్టణాలలో లో జనాభా వల్ల అనేక సమస్యలు ఉత్పన్న మగును

4.వలస అనగా నేమి?

సాధారణంగా గా ప్రజలు ఉపాధి కోసం, విద్య కోసం ,మెరుగైన టువంటి జీవితం కోసం, ఉన్న ప్రాంతాల నుంచి వేరొక ప్రాంతాలకు పోవడాన్ని వలసలు అంటారు.

5.నివాస ప్రాంతాలు యొక్క మౌలిక విషయాలు ఏవి?

నివాస ప్రాంతంలో మౌలిక విషయంలో   ప్రదేశం orస్థలము .పరిస్థితి  ఆ ప్రదేశం యొక్క భౌతిక స్థితి ప్రదేశం యొక్క చరిత్ర  అనేవి మౌలిక విషయాలు గా పరిగణిస్తారు

6.మహా నగరాలు అంటే ఏమిటి?

  కోటి జనాభాకు మించి ఉన్న నగరాలను మహానగరాలు అంటారు .ఉదా. ముంబై ,ఢిల్లీ.

7.మెట్రో పాలిటన్ సిటీ అంటే ఏమిటి?

10 లక్షల నుండి  కోటి జనాభా ఉన్న నగరాలను మెట్రో నగరాలు అంటారు వృధా ఉదా .కలకత్తా చెన్నై ,హైదరాబాద్ ,అహ్మదాబాద్

8.క్లాస్ 1 నగరాలు అంటే ఏమిటి?

ఒక లక్ష నుండి  10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలను క్లాస్ వన్ నగరాలు అంటారు

9.పట్టణం అనగానేమి?

5000 వేల నుండి ఒక లక్ష మధ్య ఉన్న జనాభా ఉన్న పట్టణాలను పట్టణo అంటారు

10.రెవెన్యూ గ్రామము అంటే ఏమిటి?

 నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాన్ని రెవెన్యూ గ్రామం అంటారు

11.ఆవాస ప్రాంతం అంటే ఏమిటి?

 రెవెన్యూ గ్రామం లోపల ఉండే కొన్ని నివాస ప్రాంతం సముదాయాలనుమ హమ్లెట్ లేదా  ఆ వాసప్రాంతం అంటారు

12.అంతర్గత వలస అంటే ఏమిటి?

దేశంలోని రాష్ట్రాల మధ్య లేదా ప్రాంతాల మధ్య  జరిగే వలసలను అంతర్గత వలసలు అంటారు .

13.అంతర్జాతీయ వలస అంటే ఏమిటి?

ఒక దేశం నుండి  మరొక దేశానికి జరిగే వలసలను అంతర్జాతీయ వలసలు అంటారు ఉదా .ఇండియా నుండి అమెరికా,
 ఇండియా నుండి బ్రిటన్

14.అంతరాష్ట్ర వలస అంటే ఏమిటి?
రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఒక జిల్లా నుండి మరొక జిల్లా లేదా అలా ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలోకి జరిగే వలసలను  అంతర్రాష్ట్ర వలసలు అంటారు.


15.కాలానుగుణ వలస అంటే ఏమిటి?
 భూమి లేని వ్యవసాయ కూలీలు సాధారణంగా వ్యవసాయ పనుల కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యవసాయ కూలీలుగా కాలానుగుణంగా వెళ్తూ ఉంటారు అటువంటి వలసలను వలసలు అంటారు

16.ఏరోట్రోపొలిస్  నగరాలు(విమానశ్రయ నగరాలు) అంటే ఏమిటి?

ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధి చెందుతూ ఉండటంవల్ల పెద్ద పెద్ద విమానాశ్రయాలకు చుట్టూ కూడా నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి అటువంటి నగరాలను విమానాశ్రయ నగరాలు అంటారు.

17.వలసలు గుర్తింపు ప్రామాణికాలు ఏంటి?

ఒక వ్యక్తిని వలస వెళ్లిన వారి గా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు రెండు రకాల ప్రామాణికాలను ఉపయోగిస్తారు .
:1 జన్మస్థానం : ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం .
2 ఇంతకుముందు నివాసమున్న స్థలం: ఒక వ్యక్తి ఆరునెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఉన్న ప్రదేశం

18.పట్టణీకరణ వలన ఏర్పడే సమస్యలు ఏమిటి?

పట్టణాల పెరుగుదల వల్ల అనేక సమస్యలు ఏర్పడును 1 మురుగు నీటి పారుదల సమస్య 2. జనాభాకు సరిపడా గృహ వసతి లేకపోవడం 3జనాభాకు అనుగుణంగా విద్యుత్ నీరు, రవాణా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు వంటివి ,కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయి .
4.
వాహనాలు అధికంగా వినియోగం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడును.
5 వాహన కాలుష్యం పెరుగును 6.త్రాగునీటి కొరత ఏర్పడును .
7.రోడ్ల విస్తరణ చేయవలసి ఉంటుంది


19.తాత్కాలిక వలస అంటే ఏమిటి?

వ్యక్తులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లేక ఉపాధి కోసం కొలతలు వెళ్తూ ఉంటారు .
అయితే జనాభా లెక్కల ప్రకారం 6 నెలలు కంటే తక్కువ వలస వెళితే అటువంటివారిని తాత్కాలిక వలసలు అంటారు

20. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల? వివరించండి?

1.గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేక పోవడం. 2.మెరుగైన జీవన వసతి కోసం .
గ్రామీణ ఉపాధి లో తగినంత ఆదాయం లేకపోవడం
3.పట్టణాలలో విద్య వైద్య ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండడం .
4.ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో అధికంగా ఉండడం.
 5.మౌలిక వసతులు లభించడం .ఉపాధి అవకాశాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో ఉండటం .వల్ల 
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు

21.పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో ఉపాది అవకాశా లు ఎక్కువ? కారణాలు పేర్కొనండి?

పట్టణ ప్రాంతాలలో  పారి శ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ .
సేవా రంగంలో కూడా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల కు ఉపాధి అవకాశాలు ఎక్కువ.

పట్టణాల్లో బిల్డింగుల నిర్మాణంలో  రోడ్ల 

నిర్మాణం లోనూ  మురికి కాలువల నిర్మాణం 

లోనూ వ్యాపార వాణిజ్య  కార్యకలాపాలలో కూడా ఎక్కువ అ ఉపాధి అవకాశాలు లభించును.

22.గ్రామీణ ప్రాంతాల్లో ని వలసల వల్ల ఏ రంగం ఆర్థికం గా దెబ్బ తింటుంది? ఎందువల్ల?

గ్రామీణ ప్రాంతాలలో వలసల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా  నష్టపోవడం  జరుగును.
వ్యవసాయ రంగంలో లో కూలీలు కొరత ఏర్పడును.
వ్యవసాయ రంగంలో పెట్టుబడుల కొరత ఏర్పడును
వ్యవసాయ రంగంలో లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లోపించడం ఉత్పత్తి ఉత్పాదకత దెబ్బతినడం వంటివి జరుగును


23.వలస  వెళ్ళిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?
1 భాషా సమస్య ఏర్పడును .
2.మురికి  వాడలలో నివాసం .
3.తీవ్రమైన నా పరిస్థితుల్లో నివసించడం.
4. ఆహార ధాన్యాలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం .
5.పిల్లలకు విద్య అందుబాటులో లేకపోవడం 6.కుటుంబం యొక్క బాధ్యతలు.
 వృద్ధుల సంరక్షణ సమస్యలు ఏర్పడును 7.అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యుల అందుబాటులో లేకపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

24.వలస వెళ్ళిన ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ చర్యలు చేపట్టాలి?పేర్కొనండి? 

వలస వెళ్లిన ప్రజలకు విద్య వైద్యం  అందుబాటులో ఉండేటట్టు చూడాలి
. మెరుగైన రవాణా వసతులు ఉండేటట్లు చూడాలి .
సరి అయిన తాగునీటి ఏర్పాట్లు ఉండాలి .

గృహవసతి లాంటి ఏర్పాట్లు ఉండాలి ..

పనిచేసే ప్రదేశాలలో సరైన సౌకర్యాలు ఉండాలి. పని ప్రదేశాలలో లో పని వేతనాలు  సక్రమంగా అందేటట్లు చూడాలి .
ఎటువంటి వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలి.

25."పట్టణీకరణ అభివృద్ధికి చిహ్నం గా భావిస్తున్నారు"కారణం ఏమిటి? వివరించండి?

పట్టణాలలో మెరుగైన మౌలిక వసతులు రోడ్లు రవాణా సౌకర్యాలు విద్య వైద్యం అందుబాటులో ఉండటం వల్ల అభివృద్ధి భావిస్తూ ఉన్నారు .
అదే విధంగా పారిశ్రామిక సేవా రంగాలలో కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించడం అభివృద్ధికి చిహ్నం గా భావిస్తూ ఉన్నారు.
 జీవన ప్రమాణాలు అధికంగా ఉండటం వల్ల అభివృద్ధికి చిహ్నంగా  గా భావిస్తున్నారు.

26.భారత దేశ పటం లో నగరాలను గుర్తిచండీ?
1.చెన్నై 2.బెంగళూరు.3.హైదరాబాద్4.ఢిల్లీ 5.కలకత్తా,6భోపాల్ 7.ముంబై 8.కొచ్చిన్.

27 అంతర్గత ,అంతర్జాతీయ వలసల ప్రభావాలు మధ్య తేడాలను పేర్కొనండి?

 అంతర్గత వలసలు:  ఇవి ఇవి దేశంలోని రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య జిల్లాల మధ్య ఉంటాయి. 
ఇందులో లో ప్రభుత్వ  సహాయ సహకారాలు ఉండవు.
వృత్తి అనుభవం ఉన్న లేకున్నా కూడా పని లభించును. వృత్తి అనుభవం ఉన్నటువంటి వారికి నైపుణ్యం ఉన్నటువంటి వారికి అధిక వేతనాలు లభించును  
దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన నా దేశం లోనే ఉంటారు కాబట్టి దేశ సేవ గానే భావించవచ్చ 
అంతర్జాతీయ  వలసలు:- ఇవి 1 దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్లడం జరుగును .

అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువగా వలసలు ఉండే అవకాశం ఉంది.
 ఇందులో లో కొన్ని సార్లు ప్రభుత్వ జోక్యం అవసరం  .
విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అవకాశం ఉంది.
 నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లు వైద్యులు కార్మికులు ఇతర దేశాలలో సేవలను అందిస్తారు

28.అంతర్జాతీయ వలసలు వల్ల లాభమా ,నష్టమా , వివరించండి?
లాభాలు

అంతర్జాతీయ వలసల వల్ల విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి లభించడం లాభదాయకం అంతర్జాతీయ వలసల వల్ల విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి లభించును 
మన దేశం నుండి వలస వెళ్లే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం మన దేశంలో నిరుద్యోగం  తగ్గును

. నష్టాలు
మన దేశం నుండి విజ్ఞానాన్ని సంపాదించి ఇతర దేశాలకు సేవచేయడం వల్ల మనదేశంలో మేధో వలస వల్ల నష్టం జరుగును దీనిని బ్రెయిన్ డ్రైన్ అంటారు
మనదేశంలో ఉన్న నైపుణ్యం ఉన్నటువంటి  ఇంజనీర్లు కార్మికులు వృత్తి పనివారు డాక్టర్లు లు వ్యక్తులు ఇతర దేశాలలో సేవ చేయడం వల్ల మనదేశంలో ఉత్పత్తి ఉత్పాదకత తగ్గును.
పై రెండింటిని సమన్వయం చేసుకోగలిగే  తే మన దేశానికి లాభం చేకూర్చవచ్చు.


💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
  

4, నవంబర్ 2020, బుధవారం

జనాభా

జనాభా (ప్రశ్నలు సమాధానములు నిధి)

1.జనసాంద్రత అనగానేమి?

ఒక ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు తెలియజేసే దాన్ని జనసాంద్రత అంటారు .


2.లింగనిష్పత్తి అనగానేమి?

జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు కు ఎంత మంది స్త్రీలు ఉన్నారు తెలియజేసే దాన్ని లింగనిష్పత్తి అంటారు.


3.ఫెర్టిలిటీ శాతం అంటే ఏమిటి?

ఒక మహిళ  తన జీవిత కాలంలో లో  ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చింది తెలియజేయు శాతాన్ని ఏమంటారు.

4 .భౄణహత్య అనగానేమి?

గర్భంలో ఉన్న శిశువును గర్భంలోనే చంపడాన్ని భ్రూణహత్య అంటారు .

5.శ్రా మిక జనాభా అనగానేమి?

జనాభా సమూహంలో లో 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులను శ్రామిక జనాభా అంటారు.

6.జనాభా మార్పు ను  తెలియచేసే అంశాలను వివరించండి?

జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. 1.జననాలు, 2.మరణాలు .3వలసలు .
అనే మూడు ప్రక్రియల వల్ల జనాభా మార్పు కలుగుతుంది.


7.దేశ జనాభా ను ప్రధాన o గా ఎన్ని వర్గాలు గా విభజిస్తారు?

ఒక దేశ జనాభాను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు .

1 పిల్లలు (సాధారణంగా 15 సంవత్సరాల లోపు వారు) 
2. పని చేసే వయసు (15 నుండి 59 మధ్య వయస్సు) 
3. వృద్ధులు 59 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వాళ్ళు.

8.జన నాల రేటు అంటే ఏమిటి?

ఒక సంవత్సర కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభా ఎంత మంది సజీవంగా జీవించి ఉన్నారో దానిని జననాల రేటు అంటారు.

9.మరణాలు రేటు అంటే ఏమిటి?

ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక సంవత్సర కాలంలో ఎంత శాతం మంది మరణించారు తెలియజేసే దాని రేటు అంటారు.

10.జనాభా విస్తరణ అనగానేమి?

 జనాభా పెరుగుదల ఏ ఏ రాష్ట్రాలలో ఎంత ఉందో ఏ ప్రాంతాలలో ఎంత ఉందో తెలియజేసే దానిని జనాభా విస్తరణ అంటారు.

11.జనాభా పెరుగుదల అంటే ఏమిటి?

ప్రతి పది సంవత్సరాల కాలంలో జనాభా సంఖ్య పెరుగుదలను సూచించే దానిని జనాభా పెరుగుదల అంటారు.

12.జన గణన ద్వారా ఏమి తెలుసుకుంటారు?

దేశ జనాభాలో ఏ వయసు వారు ఎంత శాతం మంది ఉన్నారు.
శ్రామిక జనాభా ఎంత ఉంది .
జనాభాలో వృద్ధులు ఎంతమంది.
 ఎంత మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు.
 పారిశ్రామిక రంగం లో ఎంత మంది ఉన్నారు సేవా రంగంలో ఎంత జనాభా ఉంది.
  అక్షరాస్యులు  నిరక్షరాస్యులు.   మతం ,  గృహ సౌకర్యం ,ఎన్ని రకాల వృత్తులలో ఉపాధి పొందుతున్నారు .ఎంతమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఇలాంటి అంశాలు సమాచారం సేకరించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఈ జనాభా సమాచారo సేకరించబడుతుంది.

13.వివిధ రాష్ట్రాల జనసాంద్రత లో తేడాలకు గల కారణాలు ఏంటి?

Ans.రాష్ట్రం యొక్క భూభాగం,
మైదానాలు,  అడవులు. కొండలు.
 పర్వతాలు, వార్షిక వర్షపాతం ,ఎడారులు సారవంతమైన నేలలు ,

మౌలిక వసతులు, విద్య వైద్య సౌకర్యాలు ,పట్టణీకరణ ,ఉపాధి అవకాశాల విస్తరణ .
వంటి అంశాలు .
వివిధ రాష్ట్రాలలో జనసాంద్రత లో తేడాలకు కారణం.

14.జనాభా పెరుగుదల కు గల  కారణాలు ఏంటి?

1బాల్య వివాహాలు.
2. విద్య వైద్య సౌకర్యాల అభివృద్ధి.
 .3.
ఉపాధి అవకాశాల పెరుగుదల ..4కరువుకాటకాల నిర్మూలన .5.మూఢనమ్మకాలు.
 6.కుటుంబ నియంత్రణ పాటించకపోవడం పుత్రసంతానం కోసం నిరీక్షణ మధ్య .
7.జననాల రేటు ఎక్కువ కావడం .
సంతానానికి సంతానానికి మధ్య అనంతరం లేకపోవడం ..
8.వరదలను నివారించుట.
 ఈ కారణాల వల్ల జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుంది

15.జనాభా పెరుగుదల అరికట్టేందుకు నీ సూచనలు తెల్పుము?

 1.అక్షరాస్యతను పెంపొందించడం.
 2.బాల్య వివాహాలను అరికట్టడం.
 3.కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించడం .
4.విద్య వైద్య సంస్థలను అందుబాటులోకి తీసుకురావడం.
 5.మూఢనమ్మకాలను తొలగించడం .
6.అధిక సంతానం  అధిక భారం అని తెలియ చేయడo.
 7.పురుషులైనా స్త్రీలైనా సమానమనే అనే భావన కలిగించడం
 8.కుటుంబం పరిమిత కుటుంబం వల్ల కలిగే లాభాలను వివరించడం.
 9.జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుందని తెలుపడం.
 ఈ చర్యల ద్వారా జనాభాను అరికట్టవచ్చు

16.జనాభా సమస్య నివారణకు నినాదాలు వ్రాయండి?

A.అధిక జనాభా- అనర్థాలకు హేతువు.
 B.చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం.
 C.అధిక జనాభా -ఆహార కొరత కు కారణం..
 D.పరిమిత కుటుంబం ప్రగతికి సోపానం

17. లింగనిష్పత్తి లో అసమానతలు ఏ విదంగా తగ్గించవచ్చు?తెల్పుము?

1.అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా 2.పురుషులు స్త్రీలు సమానం అనే భావనను వృద్ధి చెందడం ద్వారా.
3. పురుషాధిక్యతను తగ్గించడం.
4. పురుషాధిక్య తను తగ్గించడం ద్వారా 5.మహిళా అక్షరాస్యతా పెంపొందించడం ద్వారా.
6. చట్టాల రూపకల్పన మరియు పటిష్ఠంగా అమలు చేయడం చేయడం ద్వారా.


18. శ్రామిక జనాభా అని ఎవరిని అంటారు?

 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారిని శ్రామిక జనాభా అంటారు వీరు వివిధ రకాల వృత్తుల లో పాల్గొని ఉత్పత్తి కార్యక్రమాలు చేపడతారు

19.అంతర్గత వలసలు అనగానేమి?
దేశంలోని వివిధ రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను అంతర్గత వలసలు అంటారు

20.అంతర్జాతీయ వలసలు అనగానేమి?

ఒక దేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని అంతర్జాతీయ వలస అంటారు.


21.తెలంగాణలోని ఏ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ ఉంది దానికి గల కారణం ఏమిటి?

తెలంగాణలో అత్యధికంగా మౌలిక సదుపాయాలు  అభివృద్ధి చెందిన ప్రాంతంలో జన సాంద్రత అధికంగా ఉంటుంది.
 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాబట్టి అక్కడ జీవన సదుపాయాలు పారిశ్రామిక కేంద్రాలు , విద్య  వైద్య కేంద్రాలు ,ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రం లోని  వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి కి  వలస వచ్చి అక్కడ స్థిరపడటం వల్ల అధిక జనసాంద్రత కేంద్రీకృతమై ఉంది .

22.లింగనిష్పత్తి లో ఎక్కువ ,తక్కువ, ఉంటే సమాజం పై పడే ప్రభావం ను పేర్కొనండి?.

 లింగ నిష్పత్తి లో తేడాలవల్ల సమాజంలో సామాజిక దుష్పరిణామాలు లేదా అరాచకాలు జరిగే అవకాశాలు ఏర్పడును.
 వివాహం కావలసిన వారి మధ్య  పురుషులకు స్త్రీలు ,స్త్రీలకు పురుషులు ,తగినంత లభ్యం కాకపోవచ్చు .
లింగ నిష్పత్తి జననాల రేటు ను ప్రభావితం చేస్తుంది .
సామాజిక అసమానతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

💐             💐                   💐

భారతదేశ నీటి వనరులు

భారతదేశ నదులు నీటి వనరులు.

ప్రశ్నలు సమాధానాలు .

1. అంతర్ భూ జలం అనగానేమి?

 భూమి లోపల రాతి పొరల మధ్య ఉన్న జల భాగాన్ని అంతర్  భూ జలం అంటారు.


2.ప్రవాహ వనరులు ఏవి ?

3.పరివాహక ప్రాంతం అనగా నేమి ?

నీటి పారుదల కింద సాగవుతున్న టువంటి భూభాగాన్ని పరివాహక ప్రాంతం అంటారు..


4.కరువు అనగా నేమి?

 సాధారణ వర్షపాతం లో 75 శాతం కన్నా తక్కువ వర్షపాత కురువ దాన్ని కరువు అంటారు..

Or 

కురు వలసిన వర్షం కంటే తక్కువ వర్షం కురువ డాన్ని కరువు అంటారు.



5. భారతదేశ నదీ జల వ్యవస్థ మూడు భౌతిక అంశాలను పేర్కొనుము?

దేశ భారత దేశ నదీ జల వ్యవస్థ మూడు భౌతిక అంశాలు అనుగుణంగా ఉంది .1 హిమాలయాలు 

.2.ద్వీపకల్ప పీఠభూమి 

.3.సింధు గంగా మైదానం.

6.భారతదేశ నదీ జల వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు ?

పుట్టుక ఆధారంగా నదీ వ్యవస్థ ను అం రెండు రకాలుగా రెండు రకాలుగా వర్గీకరించారు.

 1 హిమాలయ నదులు .

.2.ద్వీపకల్ప నదులు

7.హిమాలయ నదులు ఏవి ?.

గంగా సింధు బ్రహ్మపుత్రా నది వాటి ఉపనదులు

8.దీపకల్ప నదులు ఉదాహరణలు ఇవ్వండి?

 గోదావరి, కృష్ణ పెన్నా తుంగభద్ర కావేరి మొదలగునవి.

9.ప్రవాహ వనరులు అనగా నేమి ?

వనరులు ఒక చోట నుండి మరియొక చోటికి ప్రవహిస్తూ ఉంటాయి ఇటువంటి వనరులను ప్రవాహ వనరులు అంటారు ఉదా:వర్షపు నీరు.

10.సింధూ నది ఉపనదులు ఏవి?

 జీలం చీనాబ్ రావి బియాస్ సట్లైజ్.

11.గంగా నది ఏ రెండు ప్రధాన సెలయేళ్ల కలయిక ?

భగీరథ ,అలక్ నందా అను 2 ప్రధాన సెలయేర్లు దేవ ప్రయాగ వద్ద కలిసి గంగా నది గా మారును.

12.జీవనది అనగా ?

సంవత్సరం పొడవునా నిరంతరం ప్రవహించే నదులను జీవనదులు అంటారు.

13.ద్వీపకల్ప పీఠభూములు జన్మించి ఉత్తరంగా ప్రవహించే నదులు ఏవి ? చంబల్ ,సింద్ ,బెట్వా ,సొన్, . కేన్.

14.మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథక  షరతులు ఏవి?

 కృహత్ బందీ (చెట్లను నరకడం నిషేధం)

 చేరాయి బంది (పశువులను స్వేచ్ఛగా వేయడానికి వదలడం నిషేధం) 

నషా బంద్ ( మత్తు పానీయాల నిషేధం) 

నస్ బంది( అధిక సంతానం నిషేధం)

అంతేకాకుండా ప్రజలు కొంత శ్రమ దానం చేయాలి భూమిలేని పేదలకు దీనినుంచి మినహాయింపు ఉంది

15. పశ్చిమ దిక్కునకు ప్రవహించే ద్వీపకల్ప నదులు ఏవి?

 నర్మద తపతి నదులు సబర్మతి, లూని ,మహి నది..

16.నీటి సంరక్షణకు మెరుగుపరచడానికి హివారే బజార్ లో ఏ పద్ధతులపై నియంత్రణ పెట్టుకున్నారు?

 సాగునీటికి బోరుబావులు తవ్వడం .నియంత్రణ.

 అధిక నీటి వినియోగం చెరకు అరటి వంటి పంటల పై నియంత్రణ.

 బయటి వాళ్లకు భూములు అమ్మడం నిషేధం

 

అడవులను నిర్మూలన చేయకుండా నియంత్రించడం.

 వర్షపు నీరు వృధా కాకుండా పరి రక్షణ చర్యలు చేపట్టడం నిర్మాణం.

ఉపరితల నీటి వనరులు కలుషిత గల కారణాలు ఏమిటి?

వ్యవసాయంలో  అధిక కంగా క్రిమిసంహారకాలు రసాయనిక ఎరువులు వాడడం.

 పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలను  నదులలో వదలడం.

 కుంటలు చెరువులు వాగులలో మానవవ్యర్థాల వల్ల నీరు కలుషితమవుతుంది .

అధిక జనాభా వల్ల ఇంట్లో నుంచి వచ్చే మురుగునీరు కాలువలు చెరువులు కుంటలు కలిసి నీటి కాలుష్యం పెరిగింది. 

 17."వి "ఆకారపు లోయ లను ఏర్పరుచు నదులు ఏవి?

హిమాలయాల నుండి  జన్మించే నదులు v ఆకారపు  లోయలను. ఏర్పరచును.అవి ప్రధానంగా సింధు బ్రహ్మపుత్ర నదులు.

18.బ్రహ్మపుత్రా నది కి అస్సాం  లోయలో కలియు 2 ప్రధాన ఉపనదులు ఏవి?

ది బంగ్ ,లోహిత్ నదులు....

 19.తుంగభద్ర డ్యామ్ ఏ కారణాల వల్ల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతుంది ??

తుంగభద్రా నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా. అడవుల నిర్మూలన జరగడం..

 గనుల తవ్వకం వల్ల 

నేల కోత గురికావడం  వల్ల.

 కుద్రేముఖ్ లో ఇనుప ఖనిజం ,తాండూర్ వద్ద మాంగనీస్ తవ్వకాల వల్ల ,నేల కోత ఎక్కువ సాంప్రదాయ చెరువులు చిన్న జలాశయాల నుండి వచ్చే వ్యర్ధాలు డ్యాం లో చేరడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతుంది.




2, నవంబర్ 2020, సోమవారం

4.భారతదేశ శీతోష్ణస్థితి

 భారతదేశ శీతోష్ణస్థితి.

 ప్రశ్నలు సమాధానాలు.


1.Q.వాతావరణం అనగా నేమి?

 ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వర్షపాతం  పవనాలు, ఆర్ధత ,మేఘాలు ,అవపాతం .వంటి సంయుక్త స్థితి వాతావరణం అంటారు. 

Q2.

శీతోష్ణస్థితి అనగా నేమి ?

వాతావరణ  పరిస్థితిలో ఉండే అంశాలు  ఒక విశాలమైన ప్రాంతంలో 30 సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ సమయం వాతావరణ పరిస్థితులు ఒకేలా ఉండడాన్ని శీతోష్ణ స్థితి అంటారు.

3.Climo graph.or climoto graph. అనగా నేమి ?

దేశంలో వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వర్షపాతం అంశాలలోనూ వ్యత్యాసాలను తెలియ చేయడాన్ని climo graph  అంటారు.

4.శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి?

 1.అక్షాంశం. 


2.భూమికి నీటికి గల సంబంధం .

3భౌగోళిక స్వరూపం .

4ఉపరితల గాలి ప్రసరణ .

5.Q.రుతుపవనాల ఆరంభం అనగా నేమి ?

అధిక పీడన ప్రాంతాలనుంచి అల్పపీడన ప్రాంతాలకు  గాలి వేయడాన్ని రుతు పవనాలు ఏమంటారు. అప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన అకస్మాత్తుగా వర్షం రావడాన్ని రుతుపవన ఆరంభం అంటారు.

6.Q. వ్యాపార పవనాలు (tradewinds)అనగా నేమి?

ఒకే దిశలో  స్థిరంగా పయనించే గాలులను వ్యాపార పవనాలు అంటారు.

(trade అనే జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం.).

7Q.జెట్ ప్రవాహాలు అనగానేమి ?

నేలనుండి 12 వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులను ప్రవాహాలు అంటారు.

8Q. పశ్చిమ  విక్షోభాలు అనగా నేమి ?

భారతదేశం లో  శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాను వాయు  గుండాలను పశ్చిమ విక్షోభాలు అంటార.

9.Q. మ్యాంగో షవర్స్( mango showers)మామిడి జల్లులు అనగా నేమి?

 భారతదేశ ద్వీపకల్పంలో వేసవికాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా  కురిసే వర్షాలు మామిడి జల్లులు అంటారు. ఈ వ్యక్తి ఈ వర్షాలు మామిడి పండ్లు త్వరగా పండడానికి దోహదం చేస్తాయి.

 10.Q.లూ (Loo)పవనాలు అనగా నేమి ?

భారతదేశం ఉత్తర మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక ప వనా.లూ( L00) పవనాలు అంటారు.

11.Q. భారతదేశ సాంప్రదాయ కాలాలు వివరించండి? (or) సాంప్రదాయ  భారతీయ  కాలాలను వర్గీకరించి నెలవారీగా వ్రాయండి?

వసంతం రుతువు.   చైత్రం - వైశాఖం (మార్చి --ఏప్రిల్)

గ్రీష్మం ఋతువు.     జేష్ఠ --ఆషాడం ( మే -జూన్)

వర్షరుతువు .    శ్రావణం -భాద్రపదం (జూలై -ఆగస్టు)

శరదృతువు .ఆశ్వయుజం- కార్తీకదీపం( సెప్టెంబర్ర్ -అక్టోబర్)

హేమంత ఋతువు.  మార్గశిరం -పుష్యం (నవంబర్ -డిసెంబర్)

శిశిర ఋతువు . మాఘం ఫాల్గుణం ?(జనవరి ఫిబ్రవర.)

12.I.P.C.C.:INTER GOVERNMENTAL PANAL  ON CLIMATE CHANGE. 

13.A.G.W.Anthroprogenic Global  warming. 

14.Q.హరితగృహ వాయువులు ఏవి?

కార్బన్ డయాక్సైడ్ . మీథేన్, క్లోరో ఫ్లోరో కార్బన్స్.

15.Q. భూగోళం వేడెక్కడానికి ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలు ఏమిటి?

అడవుల నిర్మూలన అటవీ సంపదను నాశనం చేయడం

వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో అధిక యంత్రాల వినియోగం

శిలాజ ఇంధనాలను దుర్వినియోగం చేయడం .

పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను సరిగా ప్రాసెస్ చేయకుండా వదిలివేయడం.

 ఎయిర్ కూలర్లు రిఫ్రిజిరేటర్ లను అధికంగా వినియోగించడం .

వాహనాల వినియోగం పెరగడం .

జనాభా పెరగడం .

వ్యవసాయ రంగంలో రసాయనిక మందులు వినియోగం .

ఈ కారణాల వల్ల  భూమి వేడెక్కడం జరుగుతుంది.

17.భూగోళం వేడెక్కడం ని తగ్గించడానికి కి తగిన సూచనలు చర్యలను తెలపండి ?

అడవులను ఎక్కువగా పెంచడం.

 పర్యావరణ అనుకూల విధానాలను చట్టాలను తయారుచేయడం .

ఏసీల వినియోగాన్ని తగ్గించడం.

 ప్రజా రవాణా సౌకర్యాలను పెంచడం.

 సేంద్రియ ఎరువులను వినియోగించడం.

 సౌరశక్తిని వినియోగించడం పునర్వినియోగ ఇంధనాలను వాడడం.

 Q. భారతదేశ శీతోష్ణస్థితులు ప్రభావంపై 4 వ్యాఖ్యలు వ్రాయండి?

A. కరువులు సంభవించడం.

B. తుఫానులు సంభవించడం వాయుగుండాలు ఏర్పడడం.

 దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడం .

కరువు కాటకాలు ఏర్పడడం.

 తీర ప్రాంతాలు ముంపునకు గురి కావడం .

కొండ చరియలు విరిగి పడడం .

ప్రకృతి విపత్తులు సంభవించటం .

సముద్ర మట్టాలు పెరగడం

Q. అక్టోబర్ వేడిమి అనగా నేమి ?

అధిక ఉష్ణోగ్రత గాలిలో తేమ కారణంగా అక్టోబర్ నెలలో వాతావరణం చాలా ఉక్కపోత  గా ఉంటుంది దీనినే అక్టోబర్ వేడి అంటార.

  వర్షచ్చాయా ప్రాంతం అనగానేమి ?

వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాన్ని వర్షచ్చాయా ప్రాంతం అంటారు.

 నైరుతి రుతుపవన కాలం  అనగా నేమి

భారతదేశానికి జూన్ మొదట్లో నైరుతి దిక్కు నుండి (కేరళ) వీచే పవనాలను నైరుతి రుతుపవనాలు అంటారు ఇవి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం వరకు వీస్తాయి..

ఈశాన్య రుతుపవన కాలం అనగానేమి?

 భారత దేశానికి ఈశాన్య దిక్కు నుంచి అక్టోబర్ మధ్య కాలం నుండి రుతుపవనాల ల వెనుదిరిగి వస్తాయి ఈ కాలాన్ని ఈశాన్య రుతుపవన కాలం అంటారు .

మాన్ సూన్ అనగా నేమి?

మా న్ సూన్  అనే  పదం mausam అరబిక్్ పదం నుండి  వచ్చింది మాన్సూన్ అనగా రుతుపవనాలు అని అర్థం .

భారతదేశంలో లో పంటకాలం (రుతుపవనాల) పేర్కొనుము? 

భారతదేశంలో  3 పంట కాలాలు ఉన్నాయి అవి .

 ఖరీఫ్ కాలం ;- జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం వరకు ఉండే పంట కాలం

రబీ కాలం :-నవంబర్ నుండి  మార్చి వరకు ఉండే పంట కాలం.

జయాద్ :ఏప్రిల్ నుండి  జూన్ వరకు ఉండే పంట కాలం.

అడవుల నిర్మూలన అంటే ఏమిటి ?

అడవులను పెద్ద మొత్తంలో నరికి వేసే చర్యలను అటవీ నిర్మూలన అంటారు

ఉత్పత్తి ఉపాధి

Q.అవ్యవస్థీకృత రంగం కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడానికి నీవు చేసే సూచనలు ఏవి ?

1.అసంఘటిత రంగ కార్మికులకు తగిన జీతాలు అందేటట్లు చేయడం.

2. కార్మిక చట్టాల కనుగుణంగా సెలవులు లబ్ధి పొందేలా చూడడం .

3ఉపాధి పొందే చోటు అన్ని రకాల ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం 4.కార్మికులకు బీమా ఆరోగ్య రక్షణ వంటి చర్యలు చేపట్టడం .

5.ఉద్యోగుల వేతనాలు సకాలంలో అందేటట్టు చూడడం .6.యజమాని యొక్క దయ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేలా చూడటం.

7. సెలవులను పొందినప్పుడు వేతనాలు మినహాయించు కుండా వేతనాలు అందే ఏర్పాట్లు చేయడం.

8. పెన్షన్ భీమా రిటైర్మెంట్ సదుపాయాలు పొందేలా చూడడం.

Q.భారత దేశంలో చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

 1 .అనిశ్చిత వర్షపాతం.

2 మార్కెట్ సౌకర్యాలు తగినంత లేకపోవడం 3.పెట్టుబడి కొరత 

4.నిరక్షరాస్యులైన టువంటి రైతులు.

5. చిన్న భూ కమతాలు .

6.విస్తాపన వ్యవసాయం

7. తగినంత పరిజ్ఞానం లేకపోవడం .

8.ఎరువులు రసాయనిక మందులు ఎలా వినియోగించుకోవాలో తెలియక పోవడం.

 9మధ్య దళారీలు వ్యవస్థ .

ఈ కారణాల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు

Q. ఉపాధి అవకాశాలను కల్పించడానికి తీసుకోవలసిన చర్యలను తెలపండి?

A. వ్యవసాయ రంగ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం.

B. సాంకేతిక వృత్తి విద్యలను అందుబాటులో ఉండేలా ప్రోత్సహించడం .

C.మౌలిక సదుపాయాలను రోడ్లు  రవాణా  బ్యాంకులు  భీమా  వంటి సదుపాయాలను  కల్పించడం .

D.ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని  వృద్ధి చెందేలా చూడటం.

E.టెక్నాలజీ పార్కులను ప్రోత్సహించడం .

F.విదేశీ సాంకేతికపరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకోవడం.

G. స్వదేశీ సాంకేతిక పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వడం.

H. కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహించడం I. నైపుణ్యం ఉన్న  మానవ వనరులను తీర్చిదిద్దడం వంటి చర్యల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చు .

Q.ఉపాధి బదిలీ అనగా నేమి ?

ఒక రంగంలో లో పనిచేసే వ్యక్తులు తగినంత వేతనాలు పొందలేక నైపుణ్యాన్ని పెంపొందించుకుని వేరొక రంగానికి మారడాన్ని ఉపాధి బదిలీ అంటారు.

Q.సేవా రంగం లోని అంశాలు ఏవి ?

సేవా రంగం లోని అంశాలు రవాణా ప్రసార సాధనాలు ద్రవ్య సంస్థలు బ్యాంకింగ్ భీమ విద్య వైద్యం పరిపాలన ప్రసార సాధనాలు  పోస్ట్ ఆఫీస్ టెలికమ్యూనికేషన్స  కంప్యూటర్లు ఇంటర్నెట్ మొదలగునవి.

Q.వ్యవస్థీకృత రంగం అనగానేమి? 

ఒక అనిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి ఉపాధి కల్పిస్తున్న టువంటి రంగాలను వ్యవస్థీకృత రంగం అంటారు .దీనిలో జీతాలు ,ఆదాయం ,ఉద్యోగ భద్రత, సెలవులు ,వైద్యం , వంటివి నిర్ణీత విధానంలో అందుతాయి.

Q.అవ్యవస్థీకృత రంగం అనగానేమి? 

ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి ఉపాధి కల్పన అందించని రంగాలను అవ్యవస్థీకృత రంగం అంటారు ఇందులో చేతి పనులు, చేనేత ,బీడీల తయారీ  అగర వత్తులు తయారీ ఇవి అవ్యవస్థీకృత రంగానికి చెందిన అంశాలు.